iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారిని గుర్తుపట్టారా? పవన్ ఫ్యాన్స్‌కి ప్రత్యేకమైన హీరోయిన్!

  • Published Apr 01, 2024 | 3:28 PM Updated Updated Apr 01, 2024 | 3:28 PM

ఈ ఫోటోలో కళ్లు మూసుకుని ముసి ముసి నవ్వులు నవ్వుతున్న చిన్నారిని గుర్తు పట్టారా..? చేసినవే మూడు-నాలుగు సినిమాలే అయినా.. ఆమె గుర్తించదగిన నటిగా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేయించుకుంది. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్‌కి ప్రత్యేకమైన హీరోయిన్. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఈ ఫోటోలో కళ్లు మూసుకుని ముసి ముసి నవ్వులు నవ్వుతున్న చిన్నారిని గుర్తు పట్టారా..? చేసినవే మూడు-నాలుగు సినిమాలే అయినా.. ఆమె గుర్తించదగిన నటిగా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేయించుకుంది. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్‌కి ప్రత్యేకమైన హీరోయిన్. ఇంతకు ఆమె ఎవరంటే..?

  • Published Apr 01, 2024 | 3:28 PMUpdated Apr 01, 2024 | 3:28 PM
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? పవన్ ఫ్యాన్స్‌కి ప్రత్యేకమైన హీరోయిన్!

సినిమాల్లో వచ్చినప్పుడు తెలియదు.. లైఫ్ ఎట్లా టర్నింగ్ తీసుకుంటుందని. ఎవరైనా స్టార్ హీరో లేదా హీరోయిన్ అవుదామనే వస్తారు. కానీ పరిచయాలు, పరిస్థితులు, సినిమా ఛాన్సులు వారిని మార్చేస్తుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో.. మూవీల్లో క్లిక్ అయితే.. దశాబ్ద కాలం పాటు వెను దిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ వచ్చిన తొలి నాళ్లల్లో కెరీర్ మలుచుకోవడం తెలియక ఫెయిలైన భామలున్నారు. తొలి సినిమా హిట్ కొట్టి.. మరో సినిమా విషయంలో తడబడుతూ ఉంటారు. కొంత మంది మంచి హీరోయిన్లు ప్రేమ, పెళ్లి అంటూ ఒకటి రెండు సినిమాలకే ఇండస్ట్రీకి దూరం అవుతుంటారు. ఆ జాబితాలోకి వస్తుంది ఈ ఫోటోలో చిన్నారి కూడా.

తెల్లటి గౌనులో రెండు పిలకలు వేసుకుని కళ్లు మూసుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఈ పాప ఎవరో తెలుసా..? ఇండస్ట్రీలో క్యూట్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కేవలం మూడంటే మూడు సినిమాలు చేసి..ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ప్రముఖ నటుడితో రిలేషన్ షిప్‌లో ఉంటూనే ఓ బిడ్డకు తల్లి అయ్యింది. కొడుకు పుట్టిన ఐదేళ్లకు ఆ జంట పెళ్లి చేసుకున్నారు. కూతురు కూడా పుట్టింది. కానీ అనూహ్యంగా భర్త నుండి విడాకులు తీసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది ఈ కపుల్. ఇంతకు ఈ చిన్నారి ఎవరంటే.. తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రేక్షకులంతా ముద్దుగా వదినా అని పిలుచుకునే మెగా ఫ్యామిలీ హీరో, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్. మోడల్‌గా కెరీర్ స్టార్ చేసి.. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా నిరూపించుకుంటోంది.

మరాఠీ కుటుంబంలో జన్మించిన రేణు.. 2000లో వచ్చిన బద్రీ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంటరైంది. పూరి జగన్నాథ్ ఫస్ట్ హీరోయిన్ కూడా ఆమెనే. ఇందులో వెన్నెలగా మెప్పించడం కాదు కంటతడి పెట్టించింది. ఆమె నటన, త్యాగానికి ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో సాంగ్స్, నువ్వు నంద అయితే ఏంటీ..నేను బద్రీబద్రీ నాథ్ అంటూ పవన్ డైలాగ్స్, కామెడీతో సినిమా సక్సెస్ అయ్యింది. ఈ సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్‌తో ప్రేమలో పడింది రేణు. అదే ఏడాది తమిళంలో వచ్చిన జేమ్స్ పాండులో కూడా కనిపించింది. మళ్లీ మూడేళ్ల తర్వాత జానీ సినిమాలో పవన్ పక్కనే నటించింది. అయితే అప్పటికే వీరిద్దరూ రిలేషన్ షిప్స్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అప్పటికే పవన్‌కు పెళ్లి కావడం..ఆమె నుండి అఫీషియల్‌గా విడిపోక పోవడంతో రేణును వివాహం చేసుకోలేదు.

2004లో రేణు.. అకీరాకు జన్మనిచ్చింది. 2007లో తొలి భార్యతో విడాకులు సెటిల్ అయ్యాక.. 2009లో నటిని వివాహం చేసుకున్నాడు పవన్. రేణు ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. ఆ సమయంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా మారి.. భర్త సినిమాలకు కాస్ట్యూమ్ డిజైన్ చేసింది. కానీ వీరి కాపురం మూణాళ్ల ముచ్చటగానే నిలిచింది. అన్నా లెజెనోవా రావడంతో రేణు.. భర్త నుండి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తన స్వస్థలం వెళ్లిపోయాక.. మరాఠీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2013లో ప్రొడ్యూసర్‌గా మారి మంగలాస్టక్ వన్స్ మోర్ అనే చిత్రాన్ని తెరకెక్కించింది. వెంటనే డైరెక్టర్ అయిపోయి. ఇష్క్ వాలా లవ్ చిత్రాన్ని తీసి మంచి పేరు తెచ్చుకుంది. సుమారు 20 ఏళ్ల గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించింది. రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. సామాజిక కార్యకర్త హేమలతా లవణం పాత్రలో ఒదిగిపోయిందనే చెప్పొచ్చు.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetfixbetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş