ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ ప్రొడ్యూసర్ కన్నుమూత

Jon Landau Passes Away: ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో అభిమానుల హృదయాలను కలచివేస్తున్నాయి. నటీనటులు, దర్శక, నిర్మాతలు కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

Jon Landau Passes Away: ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో అభిమానుల హృదయాలను కలచివేస్తున్నాయి. నటీనటులు, దర్శక, నిర్మాతలు కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

గత ఏడాది నుంచి సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నటీనటులు, దర్శక, నిర్మాతలతో పాటు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు వయోభారం, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాల వల్ల   చనిపోతే.. కెరీర్ ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు తట్టుకోలేక మరికొంతమంది బలవన్మరణానికి పాల్పపడుతున్నారు. సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసి భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాలు టైటానిక్, అవతార్ మూవీ నిర్మాత కన్నుమూయడంతో తీవ్ర విషాదం నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. యూనివర్సల్ బ్లాక్ బ్లస్టర్ మూవీస్ టైటానిక్, అవతార్ ల నిర్మాత జోన్ లండౌ కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ లాస్ ఏంజిల్స్ లో జులై 5న తుది శ్వాస విడిచారు. క్యాన్సర్ తో జోన్ లండౌ దాదాపు 16 నెలల పాటు పోరాటం చేశారని వైద్యులు తెలిపారు. ఆయన శుక్రవారం కన్నుమూసినప్పటికీ.. విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆస్కార్ విన్నింగ్ మూవీస్ టైటానిక్, అవతార్ లాంటి ప్రతిష్టాత్మక సినిమాలు ఆయన నిర్మించినవే కావడం విశేషం. డైరెక్టర్ జేమ్స్ కామెరున్ తో కలిసి ప్రస్తుతం అవతార్ మూవీస్ ఫ్రాంచైజీ మూవీస్ లను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన కెరీర్ లో అవతార్ 4 చిత్రాలు కలిపి మొత్తం 8 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. డైరెక్టర్ కామెరూన్ తో లాండౌ సంయుక్తంగా నిర్మించిన సినిమాలు మూడు అవార్డులు నామినేషన్ లకు ఎంపికయ్యాయి.

1980లో ప్రొడక్షన్ మేనేజర్ గా కెరీర్ మొదలు పెట్టారు జోన్‌ లండౌ. ప్రముఖ దర్శకులు జేమ్స్ కామెరూన్ తో కలిసి టైటానిక్ మూవీ నిర్మించారు. ఈ మూవీ అద్భుత విజయం సాధించడమే కాదు. దర్శకుడిగా జేమ్స్ కామెరున్, నిర్మాతగా జోన్‌ లండౌ కి మంచి గుర్తింపు తెచ్చింది. ఏకంగా 14 ఆస్కార్స్ నామినేషన్ రాగగా.. 11 అవార్డులు గెల్చుకున్న సినిమాగా చరిత్ర తిరగరాసింది. 2009 లో రిలీజ్ అయిన వ్యూజువల్ వండర్ అవతార్ మూవీ దాదాపు రూ.24 వేల కోట్లు కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా అవతార్ నిలిచింది. అవతార్ 2 రూ.19 వేల కోట్లు రాబట్టింది. జోన్‌ లండౌ చివరిగా అవతార్ సీరీస్ లో 3వ భాగం 2026 లో, 4వ భాగం2030 లో రిలీజ్ కానుంది. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

 

Show comments