iDreamPost
android-app
ios-app

Terminator: మరోసారి ‘టెర్మినేటర్’తో వస్తున్న జేమ్స్ కామెరూన్.. ఈసారి నెక్ట్స్ లెవల్ ప్లానింగ్!

  • Published Aug 13, 2024 | 8:47 PM Updated Updated Aug 13, 2024 | 8:47 PM

James Cameron: హాలీవుడ్ మూవీస్​ను ఇష్టపడేవారికి ‘టెర్మినేటర్’ గురించి స్పెషల్​గా చెప్పాల్సిన పనిలేదు. ‘టెర్మినేటర్’గా ఆర్నాల్డ్ స్క్వాజ్​నెగ్గర్ చేసిన సందడిని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు.

James Cameron: హాలీవుడ్ మూవీస్​ను ఇష్టపడేవారికి ‘టెర్మినేటర్’ గురించి స్పెషల్​గా చెప్పాల్సిన పనిలేదు. ‘టెర్మినేటర్’గా ఆర్నాల్డ్ స్క్వాజ్​నెగ్గర్ చేసిన సందడిని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు.

  • Published Aug 13, 2024 | 8:47 PMUpdated Aug 13, 2024 | 8:47 PM
Terminator: మరోసారి ‘టెర్మినేటర్’తో వస్తున్న జేమ్స్ కామెరూన్.. ఈసారి నెక్ట్స్ లెవల్ ప్లానింగ్!

హాలీవుడ్ మూవీస్​ను ఇష్టపడేవారికి ‘టెర్మినేటర్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘టెర్మినేటర్’గా లెజెండరీ యాక్టర్ ఆర్నాల్డ్ స్క్వాజ్​నెగ్గర్ చేసిన సందడిని ఎవరూ ఇంకా మర్చిపోలేదు. నైంటీస్ కిడ్స్ మోస్ట్ ఫేవరెట్ యాక్షన్ ఫిల్మ్స్​లో ఒకటిగా ఈ సినిమాను చెప్పొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​తో మానవాళికి ఉన్న ప్రమాదాన్ని చెబుతూ ఈ చిత్ర కథ సాగుతుంది. స్కైనెట్ అనే సూపర్ కంప్యూటర్ క్రియేట్ చేసిన సైబర్​నెటిక్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. దాని నుంచి మానవాళిని కాపాడే టెర్మినేటర్​గా ఆర్నాల్ట్ స్క్వాజ్​నెగ్గర్ నటన, జేమ్స్ కామెరూన్ టేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్ ఆడియెన్స్​కు గూస్​బంప్స్ తెప్పిస్తాయి. ఇప్పటివరకు నాలుగు పార్ట్​లుగా వచ్చిన ఈ సిరీస్ నుంచి అదిరిపోయే అప్​డేట్ వచ్చింది.

‘టెర్మినేటర్’ మళ్లీ రాబోతున్నాడు. ఈ సిరీస్ నుంచి న్యూ ఫిల్మ్ రాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా జేమ్స్ కామెరూన్ రివీల్ చేశారు. ‘టెర్మినేటర్ జీరో’ అనే యానిమేషన్ సిరీస్​ను రూపొందిస్తూ బిజీగా ఉన్నారు కామెరూన్. తాజాగా ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘టెర్మినేటర్’ సిరీస్ నుంచి కొత్త చిత్రం రాబోతోందని తెలిపారు. దాని పనులు మొదలయ్యాయని చెప్పారు. నెట్​ఫ్లిక్స్ కోసం తాను ప్రస్తుతం తీస్తున్న ‘టెర్మినేటర్ జీరో’తో నయా ఫిల్మ్​కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘టెర్మినేటర్ నుంచి కొత్త ప్రాజెక్ట్ ఉంటుంది. అయితే ఇప్పుడే అన్ని వివరాలు చెప్పలేను’ అని జేమ్స్ కామెరాన్ పేర్కొన్నారు. ఈ వార్త వినగానే ఆయన అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు.

జేమ్స్ కామెరాన్ డైరెక్షన్​లో ‘టెర్మినేటర్’ కొత్త పార్ట్ అదిరిపోవడం ఖాయమని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఆయన ఇమాజినేషన్, థాట్ ప్రాసెస్​కు న్యూ టెక్నాలజీ తోడైతే సినిమా వేరే లెవల్​ ఉంటుందని, ఎవరి ఊహకు కూడా అందదని చెబుతున్నారు. కాగా, ‘టెర్మినేటర్’ ఫ్రాంచైజీని జేమ్స్ కామెరూన్ 1980వ దశకంలో మొదలుపెట్టారు. ఆయన దర్శకత్వంలో ఆ సిరీస్ నుంచి ‘ది టెర్మినేటర్’ అనే ఫస్ట్ పార్ట్ 1984లో రిలీజ్ అయింది. అది బ్లాక్​బస్టర్ అయింది. 1991లో సెకండ్ పార్ట్ ‘జడ్జిమెంట్ డే‘ వచ్చి అదీ సూపర్​హిట్ అయింది. ఈ రెండింటినీ జేమ్స్ కామెరూన్ తీశారు. ఆ తర్వాత వచ్చిన మూడు, నాలుగు పార్ట్​లను ఇతర దర్శకులు తెరకెక్కించారు. ఇప్పుడు ‘టెర్మినేటర్’ న్యూ ప్రాజెక్ట్ కోసం ఆయన మెగా ఫోన్ చేపట్టడంతో ఫ్యాన్స్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మరి.. ‘టెర్మినేటర్’ ఫ్రాంచైజీ నుంచి కొత్త చిత్రం కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabet