iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం..టైటానిక్ ప్రముఖ నటుడు మృతి

  • Published May 06, 2024 | 7:36 AM Updated Updated May 06, 2024 | 7:36 AM

Bernard Hill Passed away: ఇటీవల సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ నటీనటులు కన్నుమూయడంతో అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది.

Bernard Hill Passed away: ఇటీవల సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ నటీనటులు కన్నుమూయడంతో అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది.

ఇండస్ట్రీలో విషాదం..టైటానిక్ ప్రముఖ నటుడు మృతి

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. భాషా బేధం అన్ని ఫిలిమ్ ఇండస్ట్రీలో వరుసగా సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. ప్రముఖ నటీనటులు, దర్శక,నిర్మాతలతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు ఈ లోకాన్ని వీడిపోతున్నారు. దీంతో వారి కుటుంబాల్లోనే కాదు.. వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు. చాలా వరకు వయోభారం, గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు కారణం అయితే.. ఇండస్ట్రీలో కెరీర్ సరిగా లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘టైటానిక్’ మూవీ నటుడు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ మూవీస్ తో పేరు తెచ్చుకున్న నటుడు బెర్నార్డ్ హిల్ (79) తుది శ్వాస విడిచారు. వృద్దాప్య కారణంగా ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ‘టైటానిక్’ మూవీ ఓ మరుపురాని అద్భుతమైన దృశ్యక కావ్యం.. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. 1912లో జరిగి అతి పెద్ద ఓడ ప్రమాదాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ.. అందమైన ప్రేమ కథను ప్రేక్షకుల ముందు ఆవిష్కరించారు స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరున్. 1997 లో రిలీజ్ అయి కోట్లు కొల్లగొట్టింది. అంతేకాదు ఏకంగా 11 అస్కార్ అవార్డులు గెల్చుకుంది.

యూకేకి చెందిన ప్రముఖ నటుడు బెర్నార్డ్ హిల్ దాదాపు 5 దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో విభిన్న పాత్రలు పోషించారు. టీవీ, సినిమా, థియేటర్ రంగాల్లో గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బెర్నార్డ్ టైటానిక్ మూవీలో కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ పాత్రలో నటించారు. అలాగే లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రాయాలజీలో కింగ్ పాత్రలో నటించి మెప్పించారు. గత కొంత కాలంగా బెర్నార్డ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బెర్నార్డ్ చనిపోయిన విషయం గురించి తెలిసి ఇండస్ట్రీ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆయనకు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.