iDreamPost
android-app
ios-app

మహేశ్ కోసం జేమ్స్ కామెరూన్! జక్కన్న ప్లాన్ అదిరిందిగా..

  • Published Feb 27, 2024 | 3:21 PM Updated Updated Feb 27, 2024 | 3:21 PM

James Cameron For SSMB29: మహేశ్- రాజమౌళి మూవీపై క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అదే జరిగితే ఇండియన్ సినిమాలోనే ఇది బిగ్గెస్ట్ హిస్టరీ అవుతుంది.

James Cameron For SSMB29: మహేశ్- రాజమౌళి మూవీపై క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అదే జరిగితే ఇండియన్ సినిమాలోనే ఇది బిగ్గెస్ట్ హిస్టరీ అవుతుంది.

  • Published Feb 27, 2024 | 3:21 PMUpdated Feb 27, 2024 | 3:21 PM
మహేశ్ కోసం జేమ్స్ కామెరూన్! జక్కన్న ప్లాన్ అదిరిందిగా..

సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఇన్నాళ్లు ఎంత స్టార్డమ్ ఉన్నా కూడా కావాలనే కేవలం రీజనల్ హీరోగానే ఉండిపోయారు. కానీ, ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా సినిమాతో అందరినీ అలరించేందుకు దర్శకధీరుడు జక్కన్నతో కలిసి రెడీ అయిపోయాడు. అయితే వీళ్ల మూవీ పాన్ ఇండియానా? పాన్ వరల్డా? అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. కానీ, ఇది పక్కా పాన్ వరల్డ్ మూవీ అనేందుకు ఒక వార్త అయితే బలం చేకూరుస్తోంది. అదేంటంటే.. మహేశ్ కోసం ఏకంగా హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ రాబోతున్నాడట. ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు.. ఇండియన్ సినిమాలోనే ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది.

హాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టైటానిక్, అవతార్ అంటూ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన డైరెక్టర్. అలాంటి లెజెండ్ మహేశ్ బాబు- రాజమౌళి సినిమా కోసం ఇండియా వస్తున్నారని ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే ఎస్ఎస్ఎంబీ 29 మూవీ కోసం జక్కన్న పక్కాగా వ్యూహాలు రచిస్తున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన లొకేషన్స్ సెర్చ్, వర్క్ షాప్స్ అన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. అయితే ఈ మూవీని జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించాలి అనేది రాజమౌళి ప్లాన్ గా చెబుతున్నారు. నేషనల్ మీడియాని పిలిచి పెద్ద ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారట.

మరి జక్కన్న పిలిస్తే.. జేమ్స్ కామెరూన్ వస్తాడా? అనే ప్రశ్న అందరికీ వస్తుంది. కానీ, రాజమౌళి పిలవాలే గానీ.. జక్కన్న కచ్చితంగా వచ్చేస్తాడు. ఇప్పటికే రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాకి జేమ్స్ కేమరూన్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అని అదరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాని పొగిడేస్తూ ఒక వీడియో కడా రిలీజ్ చేశాడు. అలాగే ఇటీవల ఓ అవార్డ్స్ ఫంక్షన్ లో రాజమౌళి గురించి ప్రస్తావించగా.. అప్పుడు కూడా ప్రశంసలు కురిపించాడు. కాబట్టి జక్కన్న పిలవాలే గానీ జేమ్స్ కామెరూన్ కచ్చితంగా వస్తాడు. అదే గనుక జరిగితే ఇండియన్ సినిమాలోనే ఇది బిగ్గెస్ట్ మూవీ లాంఛ్ అవుతుంది అనే చెప్పాలి. ఒక ఇండియన్ సినిమా కోసం జేమ్స్ కామెరూన్ రావడం అంటే వరల్డ్ వైడ్ గా పెద్ద చర్చకు దారి తీస్తుంది.

అంటే మహేశ్- రాజమౌళి సినిమా ఓపెనింగ్ నుంచే పాన్ వరల్డ్ స్థాయిలో రీసౌండింగ్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇదే గనుక నిజమైతే మహేశ్ బాబు మూవీ పాన్ వరల్డ్ స్థాయిలో వస్తున్నట్లే లెక్క. గతంలో వచ్చిన వార్తలకు ఇప్పుడు వినిపిస్తున్న గాసిప్స్ బలం చేకూరుస్తున్నాయి. ఇంక ఈ మూవీ విషయానికి వస్తే.. ఇది ఇండియానా జోన్స్ తరహా కథ అని రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీ అడవులు, దొంగతనాలు, అడ్వెంచర్స్ నేపథ్యంలో సాగుతూ ఉంటుంది. దీనికోసం మహేశ్ బాబు లుక్స్ కూడా మార్చబోతున్నారు. ఇప్పటికే మహేశ్ కు స్పెషల్ ట్రైనింగ్, ట్రెకింగ్ కూడా నేర్పిస్తున్నారు. ఈ మూవీతో మహేశ్ బాబు పాన్ వరల్డ్ హీరోగా మారబోతున్నాడు. మరి.. మహేశ్ బాబు కోసం హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ రాబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişmeritbet girişgrandpashabet