iDreamPost
android-app
ios-app

Avatar: Frontiers of Pandora: ఆన్‍లైన్‌లో రిలీజైన అవతార్ గేమ్! భారీ తగ్గింపు..

  • Published Jun 19, 2024 | 8:12 PM Updated Updated Jun 19, 2024 | 8:18 PM

Avatar Frontiers Of Pandora Game: మీరు వీడియో గేమ్ లవర్సా? అయితే అవతార్ గేమ్ ఇప్పుడు స్టీమ్ గేమ్ ఇంజిన్ ప్లాట్ ఫార్మ్ లో విడుదలైంది. జూన్ 17న ఈ అవతార్ గేమ్ స్టీమ్ లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు గేమ్ లవర్స్ కోసం డిస్కౌంట్ అందిస్తున్నారు.

Avatar Frontiers Of Pandora Game: మీరు వీడియో గేమ్ లవర్సా? అయితే అవతార్ గేమ్ ఇప్పుడు స్టీమ్ గేమ్ ఇంజిన్ ప్లాట్ ఫార్మ్ లో విడుదలైంది. జూన్ 17న ఈ అవతార్ గేమ్ స్టీమ్ లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు గేమ్ లవర్స్ కోసం డిస్కౌంట్ అందిస్తున్నారు.

Avatar: Frontiers of Pandora: ఆన్‍లైన్‌లో రిలీజైన అవతార్ గేమ్! భారీ తగ్గింపు..

అవతార్ మూవీ చూసే ఉంటారు. ఆ విజువల్స్ కి అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. అయితే హాలీవుడ్ లో వచ్చే సినిమాలు వీడియో గేమ్స్ గా వస్తుంటాయి. స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఇలా హాలీవుడ్ సినిమాల ఆధారంగా అనేక వీడియో గేమ్స్ వచ్చాయి. గతంలో అవతార్ సినిమా ఆధారంగా వీడియో గేమ్ వచ్చింది. దీన్ని యూబీ సాఫ్ట్ కంపెనీ డెవలప్ చేసింది. ఆ తర్వాత 2023 డిసెంబర్ 7న ‘అవతార్: ఫ్రాంటియర్స్ ఆఫ్ పండోరా’ పేరుతో మరో గేమ్ ని రిలీజ్ చేసింది. ప్లే స్టేషన్, విండోస్, ఎక్స్ బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ ప్లాట్ ఫార్మ్స్ కోసం డెవలప్ చేసింది. అయితే రిలీజ్ అయిన 6 నెలలకు ఈ గేమ్ ని స్టీమ్ లో అందుబాటులోకి తెచ్చింది యూబీ సాఫ్ట్ కంపెనీ. స్టీమ్ అనేది గేమర్స్ కోసం పీసీ గేమ్ లను పంపిణీ చేస్తుంది. గేమర్స్ కోసం అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది.

గేమ్స్ ని నేరుగా ఈ స్టీమ్ నుంచి కొనుగోలు చేసి సిస్టంలోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. స్టీమ్ గేమ్ లైబ్రరీనీ మెయింటెయిన్ చేస్తుంది. ఈ స్టీమ్ ప్లాట్ ఫార్మ్ ద్వారా యూజర్స్.. గేమ్స్ కి సంబంధించి స్టాటిస్టిక్స్, ఫ్రెండ్ యాక్టివిటీస్, అచీవ్ మెంట్స్ వంటివి చూసుకోవచ్చు. అంతేకాదు గేమ్ కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎక్కడికీ వెళ్లే పని లేకుండా స్టీమ్ లో ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. సాఫ్ట్ వేర్ ప్యాచులు, అప్డేట్స్, గేమ్ లో లోపాలు వంటివి ఉంటే స్టీమ్ నోటిఫై చేస్తుంది. మరొక విశేషం ఏంటంటే.. స్టీమ్ తరచుగా గేమ్స్ మీద బండిల్ డీల్స్, డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తుంది. అందుకే చాలా మంది స్టీమ్ ప్లాట్ ఫార్మ్ నుంచి గేమ్ కొనుక్కుని డౌన్లోడ్ చేసి ఆడాలని అనుకుంటారు.

తాజాగా అవతార్ ఫ్రాంటియర్స్ గేమ్ కూడా స్టీమ్ లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో బేసిక్, డీలక్స్ ఎడిషన్, గోల్డ్ ఎడిషన్, అల్టిమేట్ ఎడిషన్ మొత్తం నాలుగు రకాల గేమ్స్ ఈ స్టీమ్ లో డిస్కౌంట్ లో లభిస్తున్నాయి. అవతార్ ఫ్రాంటియర్స్ ఆఫ్ పండోరా గేమ్ నాలుగు ఎడిషన్స్ పై 40 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. అవతార్ ఫ్రాంటియర్స్ ఆఫ్ పండోరా గేమ్ బేసిక్ ఎడిషన్ ని రూ. 2,099కి అందుబాటులో ఉంచింది. అవతార్ ఫ్రాంటియర్స్ ఆఫ్ పండోరా గేమ్ డీలక్స్ ఎడిషన్ ని రూ. 2,399కి అందుబాటులో ఉంచింది. అవతార్ ఫ్రాంటియర్స్ ఆఫ్ పండోరా గేమ్ గోల్డ్ ఎడిషన్ ని రూ. 3,299కి అందిస్తుంది. అవతార్ ఫ్రాంటియర్స్ ఆఫ్ పండోరా గేమ్ అల్టిమేట్ ఎడిషన్ గేమ్ ని రూ. 3,899కే అందిస్తుంది. ఈ స్పెషల్ ఆఫర్ వచ్చే నెల జూలై 11తో ముగియనుంది. ఈ గేమ్ ని కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. 

ఈ గేమ్ ఆడాలంటే మినిమమ్ పీసీ రిక్వైర్మెంట్స్:

  • ఓఎస్: విండోస్ 10 గానీ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం ఉండాలి. అది కూడా 64-బిట్ వెర్షన్స్ అయి ఉండాలి. 
  • ర్యామ్: 16 జీబీ ర్యామ్ ఉండాలి. 
  • ప్రాసెసర్: ఏఎండీ రైజెన్ 5 3600 @ 3.6 జిగా హెడ్జెస్, ఇంటెల్ కోర్ ఐ7-8700కే @ 3.70 జిగా హెడ్జెస్ అంతకంటే ఎక్కువ.
  • గ్రాఫిక్స్: ఏఎండీ ఆర్ఎక్స్ 5700 (8 జీబీ), ఇంటెల్ ఆర్క్ ఏ750 (8 జీబీ, ఆర్ఈబీఏఆర్ ఆన్), ఎన్విడియా జీఈ ఫోర్స్ జీటీఎక్స్ 1070 (8 జీబీ) లేదా అంతకంటే ఎక్కువ. 
  • డైరెక్ట్ ఎక్స్: వెర్షన్ 12
  • స్టోరేజ్: 90 జీబీ హార్డ్ డిస్క్ స్పేస్ ఉండాలి. 

కంపెనీ రికమెండ్ చేసిన రిక్వైర్మెంట్స్:

  • ఓఎస్: విండోస్ 10 గానీ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం ఉండాలి. అది కూడా 64-బిట్ వెర్షన్స్ అయి ఉండాలి. 
  • ర్యామ్: 16 జీబీ ర్యామ్ ఉండాలి. 
  • ప్రాసెసర్: ఏఎండీ రైజెన్ 5 5600 ఎక్స్ @ 3.7 జిగా హెడ్జెస్, ఇంటెల్ కోర్ ఐ5-11600కే @ 3.9 జిగా హెడ్జెస్ అంతకంటే ఎక్కువ.
  • గ్రాఫిక్స్: ఏఎండీ రేడియాన్ ఆర్ఎక్స్ 6700 ఎక్స్టీ (12 జీబీ), ఎన్విడియా జీఈ ఫోర్స్ ఆర్టీఎక్స్ 3060 టీఐ (8 జీబీ) లేదా అంతకంటే ఎక్కువ. 
  • డైరెక్ట్ ఎక్స్: వెర్షన్ 12
  • స్టోరేజ్: 90 జీబీ హార్డ్ డిస్క్ స్పేస్ ఉండాలి.