iDreamPost
android-app
ios-app

Avatar-3: అవతార్ 3.. బిగ్ అప్డేట్! టైటిల్, రిలీజ్ డేట్ ఫిక్స్!

  • Published Aug 10, 2024 | 9:59 AM Updated Updated Aug 10, 2024 | 9:59 AM

అవతార్ 3 గురించి బిగ్ అప్డేట్ వచ్చింది. టైటిల్ తో పాటుగా ఏ రోజున సినిమా రిలీజ్ చేస్తారో ప్రకటించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అవతార్ 3 గురించి బిగ్ అప్డేట్ వచ్చింది. టైటిల్ తో పాటుగా ఏ రోజున సినిమా రిలీజ్ చేస్తారో ప్రకటించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Avatar-3: అవతార్ 3.. బిగ్ అప్డేట్! టైటిల్, రిలీజ్ డేట్ ఫిక్స్!

అవతార్.. ఈ పేరు వింటే చాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సగటు సినీ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వస్తాయి. పేరుకు హాలీవుడ్ మూవీ అయినప్పటికీ.. తెలుగులో ఈ ఫ్రాంచైజీ సిరీస్ కు క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే వచ్చిన అవతార్, అవతార్ 2 సినిమాలు ఏ రేంజ్ లో వసూళ్ల వర్షం కురిపించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు అవతార్ 3 గురించి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. టైటిల్ తో పాటుగా ఏ రోజున రిలీజ్ చేస్తారో ప్రకటించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అవతార్.. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుతం. 2009లో విడుదలైన తొలి భాగం ప్రపంచాన్ని మెుత్తం ఊపేసింది. కలెక్షన్ల వర్షం కురిపించి, రికార్డులు కొల్లగొట్టింది. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని 2022లో సీక్వెల్ ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ కూడా భారీ విజయం సాధించింది. ఇక ఇప్పుడు అవతార్ 3 గురించి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. టైటిల్ తో పాటుగా రిలీజ్ డేట్ ను కూడా చెప్పేశారు. పార్ట్ 3 కి ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ అనే పేరును పెట్టారు. ఇక ఈ భాగాన్ని డిసెంబర్ 19, 2025న రిలీజ్ చేస్తామని డేట్ కూడా ప్రకటించారు.

big update from avathar movie

కాగా.. పంచభూతాల్లో మూడోది అయిన అగ్ని కాన్సెప్ట్ తో ఈ పార్ట్ తెరకెక్కబోతోంది. ఇవి కాకుండా మరో రెండు భాగాలను 2027, 2029లో విడుదల చేస్తారు. అవతార్ సిరీస్ ను ఐదు భాగాలుగా తీస్తామని గతంలోనే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అవతార్ 3 టైటిల్, రిలీజ్ డేట్ ప్రకటించడంతో.. ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజువల్ వండర్ కోసం వెయింటింగ్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Avatar (@avatar)