iDreamPost
android-app
ios-app

రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ మాన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన విజయ్!

సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్, విజయ్ దేవర కొండ ఫ్యామిలీ స్టార్ విడుదలకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. కాగా, టిల్లు స్క్వేర్ తన కొత్త రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది. ఇక మిగిలింది ఫ్యామిలీ స్టారే. ఈ మూవీ విడుదల తేదీ కూడా దాదారు ఖరారు అయ్యింది.

సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్, విజయ్ దేవర కొండ ఫ్యామిలీ స్టార్ విడుదలకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. కాగా, టిల్లు స్క్వేర్ తన కొత్త రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది. ఇక మిగిలింది ఫ్యామిలీ స్టారే. ఈ మూవీ విడుదల తేదీ కూడా దాదారు ఖరారు అయ్యింది.

రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ మాన్..  లక్కీ ఛాన్స్ కొట్టేసిన విజయ్!

సంక్రాంతి పోటీ ముగిసింది. హనుమాన్, గుంటూరు కారం క్రేజీ కలెక్షన్లు రాబట్టుకున్నాయి. ఇకపోతే సంక్రాంతి నుండి రెండు సినిమాలు తప్పుకున్నాయి. వాటిల్లో ఒకటి రవితేజ ఈగల్. మరొకటి విజయ్ దేవర కొండ ఫ్యామిలీ స్టార్. ఈగల్ మూవీ కన్నా ముందే.. బడా సినిమాలకు లైన్ క్లియర్ చేసింది ఫ్యామిలీ స్టార్. మృణాల్ ఠాకూర్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని గీతా గోవిందం దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈగల్ మూవీ కోసం తన రిలీజ్ డేట్ త్యాగం చేసిన మూవీ టిల్లు స్క్వేర్. ఈ రెండు చిత్రాలు.. వాటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. ఒకటి అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చేసింది. మరొకటి రావాల్సి ఉంది.

సంక్రాంతి నుండి ఈగల్ మూవీ డ్రాప్ అవ్వడానికి సినీ ఇండస్ట్రీ పెద్దలు చర్చలు జరిపారు. ఫిబ్రవరి 9న సింగిల్ మూవీ రిలీజ్ అగ్రిమెంట్‌తో ఈగల్ పెద్ద పండుగ నుండి తప్పుకుంది. కానీ ఊరి పేరు భైరవ కోన రూపంలో మరో సమస్య తగులుకుంది. దీనిపై కూడా మరోసారి పెద్దలు కూర్చొని మాట్లాడారు. భైరవ కోనను ముందుకు జరుపుకోవాలని సూచించారట. ఈ విషయాన్ని పక్కన పెడితే.. రవితేజ కోసం తన సినిమాను పోస్టు పోన్ చేశాడు నాగ వంశీ. సిద్దు జొన్నల గడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన టిల్లు స్క్వేర్.. ముందుగా ఫిబ్రవరి 9నే రావాల్సి ఉంది..కానీ వెనక్కు జరిగింది. కాగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. మార్చి 29న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.

ఇక విజయ్ దేవర కొండ మూవీ ఫ్యామిలీ స్టార్ కూడా ఏప్రిల్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. ఏప్రిల్ 5వ తేదీన జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో రూపొందించిన దేవర విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల కారణంగా వాయిదా పడినట్లు టాక్. ఇప్పడు ఇదే తేదీపైన కన్నేసింది ఫ్యామిలీ స్టార్. ఆ తేదీ విజయ్ దేవర కొండకు స్పెషల్ కానుంది. ఎందుకంటే.. ఆ రోజు రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన్న పుట్టిన రోజు కావడం ఒక విశేషం కూడా. దీనికి తోడు ఉగాది కూడా కలిసి వచ్చే అంశం. అందుకే ఈ తేదీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసినట్లు తెలుస్తోంది. దేవర కూడా వెనక్కు జరగడంతో ఇక ఈ మూవీకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. దాదాపుగా ఈ రోజునే సినిమా విడుదల కానుంది.

అయితే మరో టాక్ కూడా నడుస్తోంది. ఫ్యామిలీ స్టార్ మూవీలో రష్మిక మందన్న కీలక పాత్రలో నటించిందని, ఏప్రిల్ 5 ఆమె పుట్టిన రోజు నాడే థియేటర్లలో విడుదల చేస్తే సర్ ప్రైజింగా ఉంటుందని భావిస్తున్నారట మేకర్స్. అదే నిజమైతే గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత వీరిద్దర్ని మరోసారి తెరపై చూడొచ్చు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన గీతా గోవిందం ఎంతటి సంచలన విజయం నమోదు చేసిన సంగతి విదితమే. దాదాపు రూ. 100 కోట్లకు పైగా కొల్లగొట్టి.. రౌడీ బాయ్‌ను కాస్త ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేసింది. ఇక ఫ్యామిలీ స్టార్ అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet