iDreamPost
android-app
ios-app

టైగర్.. ట్రైలర్ రిలీజ్ హక్కులు ఫ్యాన్స్ కే!

  • Author ajaykrishna Updated - 09:52 AM, Wed - 20 September 23
  • Author ajaykrishna Updated - 09:52 AM, Wed - 20 September 23
టైగర్.. ట్రైలర్ రిలీజ్ హక్కులు ఫ్యాన్స్ కే!

టైగర్ నాగేశ్వరరావు.. మాస్ రాజా రవితేజ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీని దర్శకుడు వంశీ రూపొందిస్తున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిసనన్ చెల్లి నుపూర్ సనన్ టాలీవుడ్ డెబ్యూ చేస్తోంది. కాగా.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ లో ఎక్సయిట్ మెంట్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఎందుకంటే.. అక్టోబర్ 20న సినిమా రిలీజ్ కాబోతుండగా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. కాగా.. టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ విషయంలో ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు ప్రొడ్యూసర్.

మూవీకి ఇంకా నెల రోజుల టైమ్ మాత్రమే ఉంది. కానీ.. ఆల్రెడీ సాంగ్స్ తో ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన టీజర్.. సినిమాపై బిగ్ హైప్ క్రియేట్ చేసింది. ఖచ్చితంగా సినిమా రెగ్యులర్ ఫార్మాట్ లో ఉండదని.. చాలా ఫ్రెష్ గా ఉంటుందని అర్థమైంది. ఇంకేముంది.. రవితేజ ఫామ్ లో ఉన్నప్పటికీ.. పాన్ ఇండియా సక్సెస్ చూడాలని ఫ్యాన్స్ ఎన్నాళ్ళుగానో వెయిట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు సినిమాని గట్టిగా ప్రమోట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ రిలీజ్ డేట్ ని ఫ్యాన్స్ కే వదిలేసాడు నిర్మాత అభిషేక్.

సోషల్ మీడియాలో వేదికగా.. టైగర్ ట్రైలర్ కి ఏ డేట్ బాగుంటుందని సెప్టెంబర్ 27, అక్టోబర్ 3 తేదీలకు ఫ్యాన్ పోలింగ్ జరిపించాడు. అందులో దాదాపు ఫ్యాన్స్ అందరూ ట్రైలర్ సెప్టెంబర్ 27నే కావాలని ఓట్లు వేశారు. అలా ట్రైలర్ రిలీజ్ హక్కులను ఫ్యాన్స్ కే వదిలేసిన మేకర్స్.. ఫ్యాన్స్ కోరినట్లుగానే సెప్టెంబర్ 27న ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో టైగర్ విషయంలో ఫ్యాన్స్ అందరు ఖుషి అవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా చాలా రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకేక్కుతున్నట్లు తెలుస్తుంది. మరి ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరొందిన టైగర్ నాగేశ్వరరావు క్యారెక్టర్ ని ఎలా ప్రెజెంట్ చేస్తారో తెరపై చూడాలి. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. మరి టైగర్ నాగేశ్వరరావు మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet