Tollywood Stars: ఆ వైబ్ మిస్ అవుతోంది.. నిరాశలో స్టార్ హీరోల ఫ్యాన్స్!

ఆ వైబ్ మిస్ అవుతోంది.. నిరాశలో స్టార్ హీరోల ఫ్యాన్స్!

  • Author ajaykrishna Published - 09:01 AM, Wed - 20 September 23
  • Author ajaykrishna Published - 09:01 AM, Wed - 20 September 23
ఆ వైబ్ మిస్ అవుతోంది.. నిరాశలో స్టార్ హీరోల ఫ్యాన్స్!

ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరోలు ఏ సినిమా అనౌన్స్ చేసినా.. ఆ సినిమా షూటింగ్ దశలో ఉన్నా.. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు ఫ్యాన్స్. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలకు సంబంధించి పెద్ద పెద్ద సినిమాలన్నీ ఫ్యాన్స్ ని టెంప్ట్ చేస్తున్నాయి. పైగా దాదాపు తెలుగు హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ సినిమాలే లైనప్ చేస్తున్నారు. సో.. ఫ్యాన్స్ లో అంచనాలు ఉండటం మామూలే. కాకపోతే.. అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ వాదన. ఎందుకంటే.. ముందు రిలీజ్ అని హైప్ క్రియేట్ చేయడం తీరా టైమ్ కి వాయిదా వేసేయడం చేస్తున్నారు.

అలా ఎవరు కావాలని చేయరు. బట్.. కనీసం వీడియో గ్లింప్స్ అన్న చోట ఒక కొత్త పోస్టర్ అయినా రిలీజ్ చేస్తే బెటర్ అని అంటున్నారు. జనరల్ గా వినాయక చవితి సందర్బంగా ప్రతీ హీరో, మేకర్స్.. ఇదివరకు శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్స్ రిలీజ్ చేసేవారు. కానీ.. ఈ ఏడాది వినాయక చవితికి అలా చేయలేదు. కనీసం ఎలాంటి అప్డేట్స్ కూడా ప్రకటించలేదు. పైగా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి.. వచ్చిన అప్డేట్స్ ఏమో సంతృప్తి కరంగా లేకపోవడం ఫ్యాన్స్ ని నిరాశకు గురిచేస్తున్న విషయం. ఇదిలా ఉండగా.. ప్రెజెంట్ టాలీవుడ్ స్టార్స్ అందరూ వాళ్ల కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఓవైపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సిద్ధం చేస్తుండగా.. మరోవైపు డార్లింగ్ ప్రభాస్ సలార్ ని రిలీజ్ కి రెడీ చేస్తూ.. కల్కి, మారుతీ సినిమాలు కంప్లీట్ చేస్తున్నాడు. మహేష్ బాబు త్రివిక్రమ్ తో గుంటూరు కారం చేస్తుండగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాలతో దేవరతో బిజీ అయ్యాడు. ఇక అల్లు అర్జున్ సుకుమార్ ల పుష్ప 2 షూటింగ్ దశలో ఉంది. పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజి చేస్తూనే.. హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నాడు. ఇలా ఉన్న స్టార్స్ అందరు సినిమాలు సిద్ధం చేస్తున్నారు బాగానే ఉంది. కానీ.. ఇలాంటి పెద్ద పండుగలు వచ్చినప్పుడు ఎందుకని కనీసం కొత్త పోస్టర్స్ అయినా రిలీజ్ చెయ్యట్లేదు అని నిరాశ చెందుతున్నారు. ఇలా చేస్తే ఆ వైబ్ మిస్ అవుతుందని చెప్పుకొస్తున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments