పాన్ ఇండియా బాటలో మాస్ రాజా అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రవితేజ పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. దసరా ఫెస్టివల్ సందర్బంగా టైగర్ నాగేశ్వరరావు మూవీ.. అక్టోబర్ 20న తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీ, కన్నడ, మలయాళంలో సినిమా రిలీజ్ అవుతోంది. దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ‘ది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2’ ఫేమ్ అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరొందిన టైగర్ నాగేశ్వరరావు క్యారెక్టర్ కి కల్పిత కథతో రూపొందినట్లు విడుదలైన ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావుకు సంబంధించి ప్రమోషన్స్ ట్రైలర్ తో మొదలు పెట్టేశారు మేకర్స్. ప్రమోషన్స్ లో రవితేజ సైతం చురుకుగా పాల్గొంటున్నారు. శ్రీకాంత్ విస్సా, వంశీ సంయుక్తంగా రాసిన ఈ స్క్రిప్ట్ పై మేకర్స్ చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. అలాగే ట్రైలర్ చూశాక రవితేజ ఫ్యాన్స్ కూడా హోప్స్ పెంచుకున్నారు. అయితే.. తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాను ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా ఇండియాలో ఏ సినిమాని కూడా సైన్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేయలేదని టాక్ ఉంది.
అలాంటిది ఫస్ట్ టైమ్ టైగర్ నాగేశ్వరరావు మూవీతో చేయనున్న ప్రయోగం సాహసమే అని అంటున్నాయి సినీ వర్గాలు. ఇక సినిమా సైన్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అవ్వబోతుందని తెలిసి ఫ్యాన్స్ ఆసక్తి రెట్టింపు అవుతోంది. గతేడాది అభిషేక్ నిర్మించిన రెండు సినిమాలు కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2.. రెండు కూడా పాన్ ఇండియాని షేక్ చేశాయి. అందులోనూ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ కూడా ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కాబట్టి.. ఇదికూడా హిట్ పక్కా అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇందులో రవితేజ పాత్ర కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉండబోతుందట. పైగా ఈ సినిమాతో రేణు దేశాయ్ రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు భగవంత్ కేసరి, లియో, ఘోస్ట్ మూవీస్ పోటీగా వస్తున్నాయి. మరి టైగర్ పోరాటం ఎలా ఉండబోతుందో చూడాలి. టైగర్ నాగేశ్వరరావు మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.