iDreamPost

రూల్స్ రంజన్ మూవీ రివ్యూ!

రూల్స్ రంజన్ మూవీ రివ్యూ!

టాలీవుడ్ లో హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. డీజే టిల్లు, బెదురులంక సినిమాలతో సూపర్ ఫామ్ లో ఉన్న బ్యూటీ నేహాశెట్టి.. వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘రూల్స్ రంజన్’. రత్నం కృష్ణ రూపొందించిన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా సమ్మోహనుడా సాంగ్ హైప్ మామూలుగా లేదు. ఈ సినిమా తాజాగా థియేటర్స్ లో విడుదలైంది. మరి కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ గా సక్సెస్ అయ్యాడా లేదా? ఇప్పుడు రివ్యూలో చూద్దాం!

కథ:

మనోరంజన్(కిరణ్ అబ్బవరం) హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వెర్ ఉద్యోగి. తనకంటూ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకొని లైఫ్ లీడ్ చేస్తుంటాడు. సడన్ గా ఓసారి హైదరాబాద్ నుండి ముంబైకి ట్రాన్స్ ఫర్ అవుతాడు. కట్ చేస్తే.. అదే ఆఫీస్ లో వర్క్ చేసే సన(నేహాశెట్టి) పరిచయం అవుతుంది. ఆఫీస్ లో అందరిచేత రూల్స్ రంజన్ అనిపించుకున్న అతను.. ఒక్కసారిగా సన కోసం ఒక్కో రూల్ బ్రేక్ చేస్తుంటాడు. ఆమె ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతుంటాడు. ఈ క్రమంలో సనతో లవ్ లో పడతాడు రంజన్. కొద్దిరోజులకు సన ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. దాంతో రంజన్ మైండ్ బ్లాక్ అవుతుంది. మరి సన ఇచ్చిన ట్విస్టు ఏంటి? రూల్స్ ఫాలో అయ్యే రంజన్ రూల్స్ బ్రేక్ చేసి ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడు? చివరికి ఏమైంది? తెలియాలంటే తెరపై మూవీ చూడాల్సిందే

విశ్లేషణ:

సాఫ్ట్ వేర్ ఆఫీస్ లలో మొదలయ్యే లవ్ స్టోరీస్ ఇప్పటిదాకా చాలా చూశాం. ముఖ్యంగా మన తెలుగులో చాలా సినిమాలు ఇదే పాయింట్ తో ఉన్నాయి. ఒకే ఆఫీస్ లో హీరో హీరోయిన్స్ పరిచయం అవ్వడం.. కొద్దిరోజులకు కలిసి తిరగడం.. ఆ తర్వాత లవ్ చేసుకొని.. పెళ్లి టైమ్ లో ఏదొక సమస్య రావడం.. ఇవన్నీ మనం రెగ్యులర్ గా చూసేశాం. ఒక మహానుభావుడు, కృష్ణవ్రిందా విహారి, ఊర్వశివో రాక్షసివో.. ఇలా చాలా ఉన్నాయి. అన్నింట్లో కామన్ థింగ్ కామెడీ, లవ్ ట్రాక్. సేమ్ ఇదే ఫార్ములా.. రూల్స్ రంజన్ లో కూడా ఫాలో అయ్యాడు దర్శకుడు. సాఫ్టవేర్ ఎంప్లాయిగా హీరో క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ సినిమా స్టార్ట్ అయ్యింది.

అలా హీరో క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసి.. మెల్లగా హీరో క్యారెక్టర్ ని ముంబైకి షిఫ్ట్ చేయడం.. అక్కడ హీరోకి అదే ఆఫీస్ లో వర్క్ చేసే హీరోయిన్ పరిచయం కావడం.. ఇదంతా రొటీన్ అనిపిస్తుంది. కానీ.. దర్శకుడు స్టోరీనే నమ్ముకోలేదు. కామెడీని జోడించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అయ్యే హీరో క్యారెక్టర్ తో పాటు హైపర్ ఆది, వెన్నెల కిషోర్, సుదర్శన్ లతో ఫన్ క్రియేట్ చేశాడు. అలా ఫస్టాఫ్ రెగ్యులర్ లవ్ స్టోరీలాగే ఎంటర్టైన్మెంట్ తో సాగింది. సెకండాఫ్ లో అసలు కథ ఉంటుందని అనుకునేలోపు బిగ్ ట్విస్టు ఇచ్చాడు. అదేంటంటే.. కథలో లక్ష్యం ఆల్రెడీ సెట్ చేశాడు. దాన్ని ఎలా చేరుకున్నాడు అనేది సెకండాఫ్.

కథ పరంగా సెకండాఫ్ పెద్ద ఇంటరెస్టింగ్ గా లేకపోయినా.. లీడ్ క్యారెక్టర్స్ తో పాటు కామెడీ ట్రాక్ లతో నెట్టుకొచ్చాడు. ఫన్ పరంగా సినిమా బాగా సేవ్ అయ్యిందని చెప్పాలి. ఆల్రెడీ తెలిసిన కథనే.. డిఫరెంట్ గా కామెడీతో ట్రై చేశాడు దర్శకుడు. అయితే.. తీరా హీరోహీరోయిన్స్ లవ్ ట్రాక్ పీక్స్ లోకి వెళ్తుందని అనుకున్న టైమ్ లో ఇచ్చిన ట్విస్ట్ కొంచం ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తుంది. బట్.. ఆ తర్వాత మళ్లీ నార్మల్ అయిపోయింది. క్లైమాక్స్ కి వచ్చేసరికి రెగ్యులర్ సినిమాలకు మెరుగులు దిద్దినట్లుగా రూల్స్ రంజన్ సాగింది. ఇక లీడ్ యాక్టర్ గా కిరణ్ అబ్బవరం బాగా చేశాడు.

రూల్స్ రంజన్ క్యారెక్టర్ లో చక్కగా ఒదిగిపోయాడు. సన క్యారెక్టర్ లో నేహాశెట్టి పర్వాలేదు. కానీ.. ఆమె క్యారెక్టర్ కంటే గ్లామర్ కే ఎక్కువ మార్కులు పడతాయి. కామెడీ పరంగా సినిమాని ఆదుకున్నారు వెన్నెల కిషోర్, హైపర్ ఆది, సుదర్శన్. మిగతా యాక్టర్స్ అంతా తమ తమ పరిధిమేరా ఆకట్టుకున్నారు. కామెడీ వర్కౌట్ కాకపోతే సినిమా ఫుల్ బోర్ కొట్టేదని చెప్పవచ్చు. ఇక టెక్నికల్ గా సినిమాలో.. మ్యూజిక్ పర్వాలేదు. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటర్ లెన్త్ ఉన్న సీన్స్ కి కత్తెర వేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఫైనల్ గా రైటర్, డైరెక్టర్ రత్నం కృష్ణ.. పాత కథనే కొత్తగా కామెడీ ట్రీట్మెంట్ తో చెప్పాలని అనుకున్నాడు. ఆ విషయంలో కామెడీ వరకు సక్సెస్ అయినా.. ఎమోషన్స్ పరంగా నిరాశపరిచాడు. మరి రెగ్యులర్ కామెడీ సినిమాలు మెచ్చేవారికి రంజన్ నచ్చవచ్చు.. నచ్చకపోవచ్చు.

ప్లస్ లు:

  • కిరణ్ అబ్బవరం
  • కెమెరా వర్క్
  • మ్యూజిక్

మైనస్ లు:

  • కొత్తదనం లేని స్టోరీ
  • కామెడీ పండకపోవడం
  • వీక్ ఎమోషన్స్
  • సరైన ఎండింగ్ లేని క్యారెక్టర్స్

చివరిమాట: రూల్స్ రంజన్.. కొంతే నవ్విస్తాడు!

రేటింగ్: 1.5/5

(ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి