iDreamPost
android-app
ios-app

తీసింది 600 కోట్ల సినిమా.. తిరిగేది మాత్రం చిన్న కారులో.. నీ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్!

  • Published Jun 13, 2024 | 9:41 PM Updated Updated Jun 13, 2024 | 9:41 PM

Nag Ashwin Car: సెలబ్రిటీలన్నాక ఖరీదైన కార్లను వాడడం మామూలే. బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లను వాడుతుంటారు. ఒక సినిమా హిట్ అయితేనే లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు. అలాంటిది మహానటి వంటి బ్లాక్ బస్టర్ తీసిన సినిమా దర్శకుడి దగ్గర ఖచ్చితంగా లగ్జరీ కారు ఉండే ఉంటుంది అని అనుకుంటాం కదా.

Nag Ashwin Car: సెలబ్రిటీలన్నాక ఖరీదైన కార్లను వాడడం మామూలే. బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లను వాడుతుంటారు. ఒక సినిమా హిట్ అయితేనే లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు. అలాంటిది మహానటి వంటి బ్లాక్ బస్టర్ తీసిన సినిమా దర్శకుడి దగ్గర ఖచ్చితంగా లగ్జరీ కారు ఉండే ఉంటుంది అని అనుకుంటాం కదా.

  • Published Jun 13, 2024 | 9:41 PMUpdated Jun 13, 2024 | 9:41 PM
తీసింది 600 కోట్ల సినిమా.. తిరిగేది మాత్రం చిన్న కారులో.. నీ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్!

ప్రస్తుతం దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో కల్కి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటానీ వంటి ప్రముఖ నటులు నటించిన ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ బుజ్జి కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భైరవ, బుజ్జి మధ్య వచ్చే సన్నివేశాలు ఫన్నీగా ఉండబోతున్నాయి. ఇక ఈ కారుని ప్రత్యేక శ్రద్ధతో డిజైన్ చేయించారు. ఏకంగా ఈ కారు కోసం 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇక ఈ సినిమా కోసం 600 కోట్లు బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్న నాగ్ అశ్విన్ ఎలాంటి కారు వాడుతున్నారో తెలుసా?  

దర్శకులకు, హీరోలకు ఖరీదైన లగ్జరీ కార్లు ఉండడం అనేది మామూలే. చిన్న సినిమాలు తీసి హిట్ కొడుతున్న దర్శకులకే ఇప్పుడు మంచి లగ్జరీ కార్లు ఉంటున్నాయి. చిన్న చిన్న యూట్యూబర్స్ కి కూడా ఇప్పుడు బెంజ్, బీఎండబ్ల్యూ కార్లు ఉంటున్నాయి. అలాంటిది కల్కి వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని తీస్తున్న నాగ్ అశ్విన్ దగ్గర ఎలాంటి కారు ఉంటుందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ బెంజో, బీఎండబ్ల్యూనో, ఆడి హై అండ్ మోడల్ కారు ఉంటుందిలే అని అనుకుంటున్నారా? కానీ నాగ్ అశ్విన్ చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన వాడేది ఒక ఎలక్ట్రిక్ కారు. అది కూడా మహీంద్రా కంపెనీకి చెందిన కారు. కల్కి సినిమా కోసం చేయించిన బుజ్జి కారు కూడా మహీంద్రా కంపెనీ చేసిందే.

యాదృచ్చికమో లేక ఆయన మహీంద్రా కంపెనీ మీద ఉన్న నమ్మకంతో కొన్నారో తెలియదు గానీ ఆయన తిరిగేది.. కల్కి సినిమాలో వాడిన కారు బ్రాండ్ మహీంద్రానే. ఇక నాగ్ అశ్విన్ తిరిగే కారు మహీంద్రా e2o. ఇది ఎలక్ట్రిక్ కారు. దీని ధర 10 లక్షల నుంచి 11 లక్షల రూపాయలు ఉంటుంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ఈ కారులో తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 600 కోట్ల సినిమా తీసి ఏంటి స్వామి నువ్వు ఇంత చిన్న కారులో తిరుగుతున్నావ్.. ఇది కదా సింప్లిసిటీ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ సినిమాల టేకింగ్ లో రిచ్ నెస్ చూపిస్తారు గానీ బయట మాత్రం చాలా సింపుల్ గా, మిడిల్ క్లాస్ పర్సన్ లా ఉంటాని కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss