iDreamPost
android-app
ios-app

అల్లు అర్జున్‌కే ఎందుకు ఇలా? గిరి గీసి కూర్చోమంటే కష్టం కదా?

Allu Arjun: అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ ఇప్పుడు గొడవ రోజు రోజుకు ముదిరిపోతోంది. మొన్నా మధ్య పవన్ కళ్యాణ్ పరోక్షంగా చేసిన కామెంట్స్ తో ఈ వివాదానికి అధికారికంగా తెరలేపినట్టయ్యింది. అసలు అల్లు అర్జున్ ఏం తప్పు చేశాడని మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు? గిరి గీసి కూర్చోమంటే కూర్చోవాలా? ఇలానే ఉండు అంటే ఉండాలా?

Allu Arjun: అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ ఇప్పుడు గొడవ రోజు రోజుకు ముదిరిపోతోంది. మొన్నా మధ్య పవన్ కళ్యాణ్ పరోక్షంగా చేసిన కామెంట్స్ తో ఈ వివాదానికి అధికారికంగా తెరలేపినట్టయ్యింది. అసలు అల్లు అర్జున్ ఏం తప్పు చేశాడని మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు? గిరి గీసి కూర్చోమంటే కూర్చోవాలా? ఇలానే ఉండు అంటే ఉండాలా?

అల్లు అర్జున్‌కే ఎందుకు ఇలా? గిరి గీసి కూర్చోమంటే కష్టం కదా?

హీరో అని పిలిపించుకోవడం ఎన్నో జన్మల అదృష్టం. కోట్ల జనాభాలో అతి కొద్ది మందికి మాత్రమే దక్కే అవకాశం . ఒక్కసారి ఆ ఫేమ్, క్రేజ్ వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడానికి లైఫ్ లాంగ్ కష్టపడాలి. ఇష్టమైన మనుషులను వదులుకోవాలి. సరదాలకు, స్నేహితులకు దూరం అవ్వాలి. ఫేక్ స్మైల్ మొహం మీదకి తెచ్చుకుని కృత్రిమంగా మారిపోవాలి. మనసుకి నచ్చింది కాకుండా.., మందికి నచ్చింది చేస్తూ పోవాలి. కానీ.., అల్లు అర్జున్ మాత్రం కాస్త డిఫరెంట్. అతనిది ఓ జెన్యూన్ క్యారెక్టర్. సినిమాల్లోకి వచ్చాక స్టార్ గా ఎదిగాడే గాని.., మనిషిగా మాత్రం తగ్గిపోలేదు. ఆర్య ముందు ఉన్న సరదాలు ఇంకా ఉన్నాయి. అప్పటి స్నేహాలు ఇంకా కాపాడుకుంటూ వస్తున్నాడు.ఫేక్ ఎమోషన్స్ అలవాటు చేసుకోలేదు. నిజానికి రంగుల ప్రపంచంలో ఓ అరుదైన వ్యక్తిత్వం ఇది. ఇలా ఉన్నందుకు బన్నీని ఓ వర్గం ఫ్యాన్స్ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. పొలిటికల్ వార్ లో తమ ప్రత్యర్థి పార్టీలోని ఓ వ్యక్తికి సపోర్ట్ చేశాడు అనేది వారి వాదన.

బన్నీ స్నేహానికి విలువ ఇస్తాడు. ఎన్నికల సమయంలో తన స్నేహితుడికి అండగా నిలిచాడు. అంతే తప్ప.. ప్రత్యర్థి పార్టీ మొత్తానికి సపోర్ట్ చేయలేదు. తరువాత జనసేన విజయాన్ని కోరుకుంటూ ట్వీట్ చేశాడు. తన తండ్రిని పిఠాపురం పంపాడు. (నిజంగా బన్నీ మెగా వైరమే కోరుకుంటే.. అల్లు అరవింద్ ని ఆపలేరా?). ఇలా స్నేహితుడికి అండగా నిలవడమే మహా పాపం అయిపోయింది. ఫ్యాన్స్ ముసుగులో చిల్లర గాళ్ళు అంతా చీప్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. జనసేన విజయం తరువాత ఈ దాడి ఇంకాస్త ఎక్కువ అయ్యింది. . అయితే.., ఇక్కడే ఓ విచిత్రమైన ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. మెగా నీడలో ఉండాలంటే సొంత ఇష్టాలు వదులుకోవాలా? బన్నీకి మాత్రమే ఆ రూల్ వర్తిస్తుందా? బన్నీని మాత్రమే గిరి గీసి కూర్చోమంటారా? మిగిలిన స్టార్స్.. తమకి నచ్చిన సమయంలో, నచ్చిన వారికి సపోర్ట్ చేసుకోవచ్చా? ఈ ప్రశ్నలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న జనసేన పార్టీ స్థాపిస్తున్నటు ప్రకటన చేశారు. ఆనాడు మీటింగ్ లో పవన్ ఇచ్చిన స్లోగన్ గుర్తుందా? “కాంగ్రెస్ హటావో దేశ్ బచావో”. మరి.. అప్పుడు మెగా బాస్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కేంద్ర పర్యాటక సహాయ శాఖా మంత్రిగా పని చేస్తున్నారు. ఆ తరువాత 2018 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అంటే.. పవన్ బీజేపీకి సపోర్ట్ చేసింది.. తన అన్నకి ఎదురెళ్ళే కదా? నిజం చెప్పాలంటే బన్నీఇక్కడ ఓ వ్యక్తి మాత్రమే సపోర్ట్ చేశాడు. పవన్ ఏకంగా తన అన్న ప్రత్యర్థి పార్టీ మొత్తానికి సపోర్ట్ చేశాడు కదా? ఫ్యాన్స్ చేత స్టేట్ లో, సెంటర్ లో తన అన్నయ్యకి వ్యతిరేకంగా ఓట్లు వేయించాడు కదా? మరి.. అప్పుడు పవన్ ని టార్గెట్ చేయని ఎవ్వరూ కూడా.., ఇప్పుడు బన్నీని ఎందుకు ట్రోల్ చేయాలి? అంత ఎందుకు చిరంజీవి దగ్గరికే వద్దాము. 2020 సంక్రాంతి పోటీ. అల వైకుంఠపురములో అంటూ బన్నీ, సరిలేరు నీకెవ్వరు అంటూ మహేశ్ తలపడ్డారు. ప్రమోషన్స్ దగ్గర నుండే పోటీ మొదలైపోయింది. ఇంక రిలీజ్ కి కొన్ని రోజులు ముందు సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ కి చిరు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యి.. మహేశ్ ని ఆశీర్వదించాడు. మరి.. దాన్ని ఎవ్వరూ తప్ప పట్టలేదు ఎందుకు?

ఇప్పుడు బన్నీ మాత్రం అందరికీ సాఫ్ట్ టార్గెట్ అయిపోయాడు. నిజానికి అప్పుడు పవన్ చేసింది గాని, తరువాత చిరు చేసింది గాని, ఇప్పుడు బన్నీ చేసింది గాని ఏది తప్పు కాదు. ఆ సమయంలో వారికి అనిపించిన నిర్ణయం వారు తీసుకున్నారు. స్టార్స్ అయినంత మాత్రాన ఎమోషన్స్ ని, బంధాలని, ఇష్టమైన స్నేహాలని వదులుకోవాలని ఎక్కడా లేదు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఇదే విషయాన్ని చాలా సార్లు మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. “నా సినీ వారసులు కాబట్టి ఇలానే ఉండాలి, ఇలానే ప్రవర్తించాలని రూల్ లేదు. వారి జీవితం, వారి ఇష్టం. లైఫ్ లో వారి ఛాయిస్ ఏదైనా అందరికీ అండగా మాత్రం నేను ఉంటాను” అని ఎన్నోసార్లు చెప్పారు. దీన్ని అర్ధం చేసుకోలేని కొంతమంది అభిమానులు మాత్రం బన్నీని టార్గెట్ చేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. బన్నీపై ఈ ట్రోలింగ్ మెగా హీరోలు కూడా కోరుకుంది కాదు. కానీ.., కొంతమంది చేపల పులుసు గాళ్ళ నోటికి తాళం వేయడంలో మాత్రం మెగా హీరోలు కాస్తయినా చొరవ చూపించి ఉంటే బాగుండేది.

కొన్ని నెలలుగా జరిగిన దాడితో బన్నీ కూడా విసిగిపోయినట్టు ఉన్నాడు. ఫైనల్ గా నిన్న ఓ సినిమా వేడుకలో ఓపెన్ అయిపోయాడు. “నా అనుకుంటే నా మనసుకు నచ్చితే నేను వస్తాను” అని కుండబద్దలు కొట్టేశాడు. పుష్ప గాడి రూల్ ఇది అన్నంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇది. వ్యవహారం అయితే కాస్త సీరియస్ గానే కనిపిస్తుంది. మెగా హీరోలు ఇన్ని సార్లు, ఇన్ని విధాలా గీత దాటితే లేని ట్రోలింగ్.. మా హీరోపైనే ఎందుకు అన్నది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రశ్న! అవతల వైపు నుండి మాత్రం ట్రోల్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫ్యాన్స్ గోల ఎలా ఉన్నా.. అవతల ఉంది.. చిరు, అరవింద్ 44 ఏళ్ళ బంధం. పేరుకి బావ, బావమరిది బంధమే అయినా ఇద్దరిదీ రక్త సంబంధం కన్నా గాఢమైన బంధం. వ్యవహారం ముదరకుండా పెద్దలు రంగంలోకి దిగాలి. మెగా కాంపౌండ్ అన్నది ఇక్కడ సమస్య కాదు. మన హీరోలని మనమే తగ్గించుకోవడం ఏంటి అనేది సమస్య. బన్నీ, చరణ్ గ్లోబల్ స్థాయికి ఎదిగారు. తెలుగు సినిమా సత్తాని చాటుతున్నారు. ఇలాంటి సమయంలో దురభిమానం పనికి రాదు. ఈ మొత్తం వ్యవహారానికి ఎప్పుడు, ఎలా బ్రేక్ పడుద్దో చూడాలి.