iDreamPost
android-app
ios-app

దేవర రాక ముందే Jr. NTR హౌస్ ఫుల్ బోర్డు! ఇదేమి క్రేజ్ స్వామి?

Jr NTR Puts Housefull Board At His Compound: దేవర సినిమా కోసం తారక్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందా? ఎప్పుడు పండగ చేసుకుందామా అని చూస్తున్నారు. ఇదిలా ఉంటే తారక్ దేవర రిలీజ్ కి ముందే హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారు.

Jr NTR Puts Housefull Board At His Compound: దేవర సినిమా కోసం తారక్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందా? ఎప్పుడు పండగ చేసుకుందామా అని చూస్తున్నారు. ఇదిలా ఉంటే తారక్ దేవర రిలీజ్ కి ముందే హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారు.

దేవర రాక ముందే Jr. NTR హౌస్ ఫుల్ బోర్డు! ఇదేమి క్రేజ్ స్వామి?

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజై రెండేళ్లు దాటేసింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఊసే లేదు. దీంతో ఫ్యాన్స్ ఆకలి తారక్ ఎప్పుడు తీరుస్తారా అని ఆశగా, ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివతో దేవర పార్ట్ 1లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు మేకర్స్. కాగా దేవర సినిమా రాక ముందే జూనియర్ ఎన్టీఆర్ తన కాంపౌండ్ లో హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారు. అదేంటి హౌస్ ఫుల్ బోర్డు సినిమా టికెట్స్ ఫిల్ అయితే పెడతారు కదా అని అనుకుంటున్నారా? అదే తారక్ మంత్రం మరి. 

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు విడుదలైనప్పుడు హౌస్ ఫుల్ బోర్డు పడినట్టు.. ఇప్పుడు సినిమాలు ఒప్పుకునే విషయంలో కూడా హౌస్ ఫుల్ బోర్డు పడుతున్నాయి. దీనికి తారక్ కోసం ఎదురుచూస్తున్న కథలు, దర్శకులే నిదర్శనం. సినిమా రిలీజ్ కి ముందే హౌస్ ఫుల్ బోర్డు పడడం అనేది తారక్ కే సాధ్యమని చెప్పుకోవాలి. కొరటాల శివతో దేవర సినిమా లైన్ లో ఉండగానే.. ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా ఉంది. మళ్ళీ అదే కొరటాల శివతో దేవర 2 రెడీగా ఉంది. ఇవి కాకుండా హాయ్ నాన్న దర్శకుడు శౌర్యువ్ తారక్ కి ఒక కథ చెప్పారు. తరుణ్ భాస్కర్ ఒక కథ సిద్ధం చేసుకున్నారు. స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ ఒక కథ చెప్పినట్లు టాక్ నడుస్తుంది. వీటన్నిట్లోనూ ఒకటి ఫైనల్ చేయాల్సి ఉంది.

ఇలా కథలు పట్టుకుని దర్శకులు తారక్ చుట్టూ చేరిపోయారు. ఒక సినిమా రిలీజ్ కి ముందే 5 సినిమాలు క్యూలో ఉండడం అంటే మామూలు విషయం కాదు. పైగా ఇందులో ప్రశాంత్ నీల్ తో, కొరటాల శివతో ఖాయమైపోయింది. ఇక తరుణ్ భాస్కర్, శౌర్యువ్, సుధీర్ వర్మ తారక్ కోసం రెడీగా ఉన్నారు. తరుణ్ భాస్కర్ కథ బాగుంటుంది కాబట్టి తారక్ ని ఒప్పించేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సుధీర్ వర్మ, శౌర్యువ్ లు కూడా తమ కథలతో రెడీగా ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ ముగ్గురిలో ఎవరి స్క్రిప్ట్ ముందు ఓకే చేస్తారో చూడాలి. కానీ దేవర విడుదల కాకముందే కథల ఎంపిక విషయంలో హౌస్ ఫుల్ బోర్డు పడడం అనేది తారక్ కే చెల్లిందేమో. మరి ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి