iDreamPost
android-app
ios-app

ఈ బాబు ఇప్పుడు స్టార్ హీరో! ఏపీలో మాత్రం సెన్సేషన్!

ఈ ఫోటోలో కనిపిస్తున్న బాబుని చూశారా.. చక్కని స్మైల్ తో హీరోలా ఉన్నాడు కదూ. హీరోలా ఉండటమేమిటీ.. అతడు హీరోనే. ఇతడు కూడా నెపో కిడ్ అన్న ముద్ర పడిన వాడే. అన్ని అవరోధాలను ఎదుర్కొని నిలబడ్డాడు. ఇతడి పేరు ఏపీలో చర్చనీయాంశమైంది. ఇంతకు అతడు ఎవరంటే..?

ఈ ఫోటోలో కనిపిస్తున్న బాబుని చూశారా.. చక్కని స్మైల్ తో హీరోలా ఉన్నాడు కదూ. హీరోలా ఉండటమేమిటీ.. అతడు హీరోనే. ఇతడు కూడా నెపో కిడ్ అన్న ముద్ర పడిన వాడే. అన్ని అవరోధాలను ఎదుర్కొని నిలబడ్డాడు. ఇతడి పేరు ఏపీలో చర్చనీయాంశమైంది. ఇంతకు అతడు ఎవరంటే..?

ఈ బాబు ఇప్పుడు స్టార్ హీరో! ఏపీలో మాత్రం సెన్సేషన్!

నెపోటిజం.. ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న పేరు. సినీ ఇండస్ట్రీకి చెందిన కిడ్స్ ఎవరైనా ఎంట్రీ ఇస్తున్నారంటే.. ముందుగా వినిపించే పదం ఇదే.  వారసత్వం పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు ఉపయోగపడుతుందేమో కానీ.. నిలదొక్కుకోవాలంటే టాలెంట్ కంపల్సరీ. లేకుంటే ఇంటికి సాగనంపుతారు ప్రేక్షకులు. అందుకు ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు ఉదాహరణగా ఉన్నారు. పరిశ్రమలో పెద్ద కుటుంబం నుండి రానీ, బడా దర్శక, నిర్మాతల పిల్లలైనా సరే.. నచ్చలేదా ఒక్క మూవీకే పెట్టా, బేడా సర్దుకోవాల్సిందే. సక్సెస్ అయితే ‘నీకేంట్రా నిన్ను నీ ఫాదర్ ఉన్నాడుగా’ అంటూ తీసి పారేస్తుంటారు ఫ్యాన్స్. ఇలాంటి మాటలు, అవమానాలు,అవరోధాలు తట్టుకుని నిలబడటం అంత ఈజీగా కాదూ.

సక్సెస్,ఫెయిల్యూర్ మధ్య ఉన్న ఆ చిన్న గీతను దాటుకుని నిలబడితేనే.. స్టార్ హీరోగా స్టాండెడ్ కాగలడు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న పిల్లోడిని చూశారా..హీరోలాగా ఉన్నాడు కదూ. చక్కటి స్మైల్ ఇస్తూ.. ప్రొఫెషనల్ మోడల్ లా కనిపిస్తున్నాడు కదూ. అవును మరీ ఎంతైనా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారసుడు కదా. ఆ మాత్రం ఉంటుంది మరీ. నెపో కిడ్ ముద్ర పడినా.. ఎన్నో సమస్యలని ఎదుర్కొని సక్సెస్‌ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు. తండ్రి నిర్మాత అయినా.. తొలి సినిమా వరకే అతడికి పనికి వచ్చింది. కానీ అక్కడ నుండి తనను తాను నిరూపించుకుంటూ ముందుకు సాగాడు. హిట్స్, ప్లాప్స్‌ను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. అనుకున్నట్లే స్టార్‌గా అవతరించాడు. ఒక ఇండస్ట్రీనే కాదూ.. దక్షిణాది పరిశ్రమలతో పాటు హిందీలోనూ ఓ మూవీతో సత్తా చాటాడు.

ఇంతకు ఆ చిన్నారి ఎవరో అంటే.. సూపర్ గుడ్ ఫిల్మింస్ ద్వారా తెలుగులో సూపర్ డూపర్ హిట్స్ చిత్రాలు నిర్మించిన ఆర్‌బి చౌదరి ముద్దుల తనయుడు జీవా. చైల్డ్ ఆర్టిస్టుగా రెండు సినిమాలు చేసిన జీవా.. ఆశయ్.. ఆశయ్ అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. సొంత బ్యానర్‌లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జీవా..ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. మనసంతా నువ్వే మూవీ రీమేక్ మూవీలో నటించి హిట్ అందుకున్నాడు. ఈ అనే చిత్రంతో అతడికి మాస్ ఇమేజ్ వచ్చింది. ఈ మూవీ తెలుగులో డబ్బింగ్ అయ్యి.. జీవా ఇక్కడి ప్రేక్షకులకు తెలిసింది. కానీ అతడికి గుర్తింపు తెచ్చిన చిత్రం మాత్రం రంగం. టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు.

 స్నేహితుడు, మాస్క్, సైజ్ జీరో, ఎటో వెళ్లిపోయింది మనస్సుతో పలకరించాడు. అయితే ఫుల్ లెంత్ మూవీలో నటించలేదు.  కపిల్ బయోపిక్ 83తో హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జీవా.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చకు కారణమయ్యాడు. యాత్ర 2లో అతడు నటించడమే అందుకు కారణం. ఇందులో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రను చేశారు. మార్చి 8న విడుదలైన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంటుంది.