iDreamPost
android-app
ios-app

sharwanand: శర్వానంద్ సరసన నటిస్తోంది.. ఆ ఇద్దరు ముద్దుగుమ్మలే..!

  • Published Jan 31, 2024 | 5:13 PM Updated Updated Jan 31, 2024 | 5:13 PM

ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న వారిలో అగ్రహీరోలు మాత్రమే కాకుండా.. మిగిలిన ఎంతో మంది ప్రముఖ హీరోలు కూడా ఉన్నారు. వారిలో ఒకరు శర్వానంద్. తాజాగా ఈ హీరో నటిస్తున్న ఒక సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న వారిలో అగ్రహీరోలు మాత్రమే కాకుండా.. మిగిలిన ఎంతో మంది ప్రముఖ హీరోలు కూడా ఉన్నారు. వారిలో ఒకరు శర్వానంద్. తాజాగా ఈ హీరో నటిస్తున్న ఒక సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.

  • Published Jan 31, 2024 | 5:13 PMUpdated Jan 31, 2024 | 5:13 PM
sharwanand: శర్వానంద్ సరసన నటిస్తోంది.. ఆ ఇద్దరు ముద్దుగుమ్మలే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో శర్వానంద్ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. ఫ్యామిలీ , లవ్ స్టోరిలకు పెట్టింది పేరు శర్వానంద్. గమ్యం, ప్రస్థానం చిత్రాలలో తన నటనకు సినీ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందాడు ఈ హీరో. కేవలం తెలుగులో మాత్రమే కాకుండ తమిళంలోనూ నటించాడు శర్వానంద్. ఈ హీరో చివరిగా “ఒకే ఒక జీవితం” సినిమాలో కనిపించాడు. ఆ తరువాత ఈ హీరో నుంచి ఎటువంటి అప్ డేట్స్ లేవు. కానీ, తాజాగా ఒక టాక్ వినిపిస్తోంది. శర్వానంద్ ప్రస్తుతం నటించబోతున్న ఓ చిత్రంలో.. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నట్లు.. ఆ ఇద్దరు ఎవరో కూడా దాదాపు ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే, శర్వానంద్ ప్రస్తుతం రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్నాడు. గత సంవత్సరం “సామజవరగమన” చిత్రంతో మంచి హిట్ ను అందుకున్నాడు ఈ దర్శకుడు. ఈ చిత్రం చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చినా.. పెద్ద విజయాన్ని సాదించింది. దానితో ఈ డైరెక్టర్ వరుసగా అవకాశాలను అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే హీరో శర్వానంద్ తో ఓ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ వర్కింగ్ లో ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ చిత్రానికి శర్వానంద్ కు జోడిగా నటించడానికి ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అందుకోసం ఇప్పటికే హీరోయిన్ల ఎంపిక పూర్తయినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ హీరోయిన్లు మరెవరో కాదు.. సాక్షి వైద్య‌, సంయుక్త మీన‌న్‌. వీరిద్దరిని ఈ చిత్రం కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే, వీరిద్దరితో శర్వానంద్ నటించడం ఇదే మొదటిసారి. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని .. ట్రయాంగిల్ లవ్ స్టోరీలలో ఇదొక కొత్త రకమైన స్టోరీ అని తెలియజేశారు.

ఇక శర్వానంద్ విషయానికొస్తే.. మొదటిగా పెద్ద హీరోల చిత్రాలలో కొన్ని ముఖ్య పాత్రలలో నటిస్తూ వచ్చాడు. దానితో మంచి పాత్రలు ఇతనిని వెతుక్కుంటూ వచ్చాయి.  శర్వానంద్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇతనిని గుర్తుపట్టేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. మెల్లగా ఇతను తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం శర్వానంద్ శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘బాబ్‌’ అనే పేరు పరిగణలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత వెంటనే రామ్ సుబ్బ‌రాజు క‌థ‌ని సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు. ఈ సినిమాలో ఇతర నటి నటులను, సినిమాకు సంబంధించిన మిగిలిన విషయాలను.. త్వరలోనే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది. మరి, శర్వానంద్ నటించబోయే సినిమాలో ఎంపిక చేసిన ఇద్దరు హీరోయిన్ల విషయంలో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio