iDreamPost
android-app
ios-app

లోకేష్ ఇలా చేశాడేంటి.. లియోకి LCU తో సంబంధం లేదా?

  • Author ajaykrishna Published - 08:59 AM, Fri - 6 October 23
  • Author ajaykrishna Published - 08:59 AM, Fri - 6 October 23
లోకేష్ ఇలా చేశాడేంటి.. లియోకి LCU తో సంబంధం లేదా?

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ సిరీస్ కోసం ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నగరం, మాస్టర్ సినిమాలు పక్కన పెడితే.. అంటే అవికూడా సూపర్ హిట్సే. బట్.. ఖైదీ, విక్రమ్ సినిమాలతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశాడు. అయితే.. దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ లియో. విజయ్ – లోకేష్ కాంబినేషన్ లో వచ్చిన రెండో మూవీ ఇది. మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. లోకేష్ యూనివర్స్ ని పరిచయం చేయడంతో లియోపై అంచనాలు పెరిగిపోయాయి. ఈసారి విజయ్ ని కూడా LCU లో భాగం చేయబోతున్నాడని అంతా అనుకున్నారు.

లియో అక్టోబర్ 19న రిలీజ్ అవుతోంది. అదికూడా పాన్ ఇండియా రేంజ్ లో వివిధ భాషలలో వస్తోంది. ఇదే ఊపులో రిలీజ్ కి ఇంకా రెండు వారాల టైమ్ ఉందనగా.. ట్రైలర్ వదిలారు మేకర్స్. ట్రైలర్ పై ఒక రేంజ్ లో అంచనాకు నెలకొన్నాయి. లోకేష్.. లియోని ఎలా విక్రమ్, ఖైదీలతో లింక్ చేయబోతున్నాడు? అసలు ఎలా ఉండబోతుంది? లియో దాస్ తో పాటు ఆంటోనీ దాస్, హరోల్డ్ దాస్ ల క్యారెక్టర్ ఎక్కడ లింక్ అవుతాయి? వీళ్ళ ముగ్గిరికి లింకేంటి? అంటూ ఇలా ఎన్నో సందేహాల మధ్య లియో ట్రైలర్ వచ్చింది. కట్ చేస్తే.. ట్రైలర్ చూశాక ఫ్యాన్స్, ఆడియన్స్ లో ఎక్సప్రెషన్స్ మారిపోయాయి.

ఒకరకంగా ఫ్యాన్స్, ఆడియన్స్ లియో ట్రైలర్ చూశాక నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. ట్రైలర్ లో ఎక్కడ కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి లింక్ ఉందని చూపించలేదు డైరెక్టర్. పైగా.. ఎక్కడా ఓ క్లూ కూడా వదలలేదు. బట్.. ఉన్న ముగ్గురు దాస్ ల క్యారెక్టర్ వెనుక ఏదో బలమైన కథ ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ.. అసలు లియో, LCU కి లింక్ లేకపోవడం ఏంటని అందరు షాక్ అవుతున్నారు. కాకపోతే మేకర్స్ కూడా ఇప్పటిదాకా లియో.. LCU లో భాగం అని ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదు. దీంతో ఇదికూడా నిజమే కదా అని ఓ వైపు వాదనలు వినిపిస్తున్నాయి. ముందుగా అంచనాలు పెట్టుకోవడం ఎందుకని.. కొందరి వాదన. అయితే.. విక్రమ్ టైమ్ లో కూడా ఇలాగే చేశాడు లోకేష్. సినిమా రిలీజ్ అనే టైమ్ లో ఖైదీకి లింక్ ఉందని ట్విస్ట్ ఇచ్చాడు. సో.. ఇప్పుడు లియో కూడా అలాంటిదేనేమో అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి లియో ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio