iDreamPost
android-app
ios-app

మరో 2 ఏళ్లు.. ఆ హీరో సినిమాలు రిలీజ్ చేయొద్దు: ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్

  • Author ajaykrishna Updated - 09:51 AM, Tue - 3 October 23
  • Author ajaykrishna Updated - 09:51 AM, Tue - 3 October 23
మరో 2 ఏళ్లు.. ఆ హీరో సినిమాలు రిలీజ్ చేయొద్దు: ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్

ఇండస్ట్రీలో ఒక సినిమాతో మరో సినిమాని క్లాష్ కి దింపాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే.. ఇక్కడ సినిమా అనేది ఒక బిజినెస్. కోట్ల పెట్టుబడి దానిపై ఉంటుంది. కాబట్టి.. వేరే దారి లేకనో.. లేదా మంచి పండుగ సీజన్ అని వేరే సినిమాలతో పోటీకి దిగితే పర్వాలేదు. కానీ.. ఖచ్చితంగా అదే ఫలానా సినిమాతో పోటీకి వస్తానని సవాల్ విసిరితే పరిస్థితులు మారిపోతాయి. అప్పటిదాకా పోటీకి వస్తే వచ్చింది అనుకున్న వాళ్లంతా.. ఓహో దీని వెనుక ఉద్దేశం ఇదా అని సినిమాని లైట్ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది వ్యాక్సిన్ వార్’ మూవీ విషయంలో అదే జరుగుతుంది.

కశ్మీర్ ఫైల్స్ మూవీ.. దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం రూ. 20 కోట్లలోపు బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా.. పాన్ ఇండియాని షేక్ చేస్తూ సుమారు రూ. 300 కోట్లకు పైగా వసూల్ చేసింది. దీంతో వెంటనే తదుపరి సినిమాగా ‘ది వాక్సిన్ వార్’ని అనౌన్స్ చేశాడు డైరెక్టర్ వివేక్. అయితే.. కశ్మీర్ ఫైల్స్ రిలీజ్ అయినప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ కూడా రిలీజ్ అయ్యింది. ఆ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో జనాలంతా కశ్మీర్ ఫైల్స్ మూవీకి వెళ్లారు. సినిమా కంటెంట్ నచ్చడంతో బ్లాక్ బస్టర్ చేశారు జనాలు. కట్ చేస్తే.. ఏమైందో గానీ సలార్ కి పోటీగా వ్యాక్సిన్ వార్ రిలీజ్ చేస్తానని సెప్టెంబర్ 28న రిలీజ్ చేసేసాడు.

ఆ సినిమాకు టాక్ బాగున్నా.. జనాలు వెళ్లడం లేదు. చూస్తే.. కలెక్షన్స్ నిల్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వాక్సిన్ వార్ మూవీకి కలెక్షన్స్ లేకపోవడంతో.. స్పందించాడు వివేక్ అగ్నిహోత్రి. రిలీజ్ విషయంలో ప్రభాస్ ని టార్గెట్ చేసిన వివేక్.. ఇప్పుడు షారుఖ్ ఖాన్ ని టార్గెట్ చేయడం గమనార్హం. ఆయన మాట్లాడుతూ.. ‘జనాలంతా తమ డబ్బులు గదర్ 2, జవాన్ సినిమాలు చూసేందుకు ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు నా మూవీ చూడటానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. నేను షారుఖ్ ఖాన్ ని రిక్వెస్ట్ చేస్తున్నా.. మరో రెండేళ్ల పాటు తాను ఏ సినిమా రిలీజ్ చేయొద్దని” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో మీ సినిమా ఆడకపోతే పక్కవాళ్ళపై ఏడవడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. మరి వివేక్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)