iDreamPost
android-app
ios-app

ఏప్రిల్‌లో మొదలు కానున్న సలార్-2 షూటింగ్

  • Published Mar 04, 2024 | 1:10 PM Updated Updated Mar 04, 2024 | 1:13 PM

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్-1 ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ప్రభాస్ మాస్ కటౌట్ చూసి మురిసిపోయారు అభిమానులు. ఇక ఈ సినిమా స్వీకెల్ ఉండబోతుందని గతంలోనే ప్రకటించింది చిత్ర యూనిట్. ఇప్పుడో ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చింది.

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్-1 ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ప్రభాస్ మాస్ కటౌట్ చూసి మురిసిపోయారు అభిమానులు. ఇక ఈ సినిమా స్వీకెల్ ఉండబోతుందని గతంలోనే ప్రకటించింది చిత్ర యూనిట్. ఇప్పుడో ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చింది.

  • Published Mar 04, 2024 | 1:10 PMUpdated Mar 04, 2024 | 1:13 PM
ఏప్రిల్‌లో మొదలు కానున్న సలార్-2 షూటింగ్

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా గతేడాది డిసెంబర్ లో విడుదలైన ‘సలార్ పార్ట్ 1: సీజ్‍ఫైర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయింది. కాగా ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ భారీ వసూళ్లను సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా రూ.600కోట్ల వసూళ్లను సాధించింది. ఇక సలార్ సినిమా క్లైమాక్స్‌లో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసే ట్విస్టులు పెట్టడంతో పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించిన బాబీ సింహ ఏప్రిల్ లో సలార్-2 షూటింగ్ స్టార్ట్ అవుతుందనే శుభవార్తను ప్రభాస్ అభిమానులకి అందించారు.

తాజాగా ‘ఐ డ్రీమ్’కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో నటుడు బాబీ సింహాకు సలార్ సీక్వెల్ గురించి ప్రశ్న ఎదురైంది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‍లోనే సలార్ పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు బాబీ సింహా వెల్లడించారు. సలార్ సీక్వెల్ కు ‘ సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్‍ను మొదటి భాగం క్లైమాక్స్ లోనే రివీల్ చేశారు. తాను శౌర్యాంగ వారసుడనే విషయం దేవ (ప్రభాస్)కు తెలుసా లేదా అనే ఆసక్తికరమైన ప్రశ్న ప్రేక్షకులలో ఉండిపోయింది. అలాగే ప్రాణ స్నేహితులైన దేవ, వరదరాజ మన్నార్ (పృథ్విరాజ్ సుకుమారన్) మధ్య యుద్ధానికి కారణం ఏంటో కూడా సీక్వెల్ లోనే తెలుస్తుంది. అందుకే సలార్ పార్ట్-2 ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‍డేట్ అందించారు నటుడు బాబీ సింహా.

ఇక సలార్ పార్ట్ 2 షూటింగ్ ఏప్రిల్‍లో మొదలవుతుందని బాబీ సింహా చెప్పడంతో ప్రభాస్ అభిమానులు సంతోషిస్తున్నారు. ఇది గనక నిజమైతే ఖచ్చితంగా 2025లోనే ఈ సినిమా విడుదలవుతుందని భావిస్తున్నారు. పార్ట్ 1 క్లైమాక్స్ లో శౌర్యాంగ తెగను దాచి ఒక యుద్ధానికి సిద్ధం చేసే భారవ పాత్రను పోషించారు బాబీ సింహా. మరి పార్ట్ 2 లో ఆయన ఎలా పాత్ర ఉంటుందో చూడాలి. ఇక సలార్ పార్ట్ 2 సినిమా షూటింగ్ ఏప్రిల్‍లో మొదలైనా కూడా అది స్టార్ట్ అయిన కొన్ని రోజుల తర్వాతే ప్రభాస్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మారుతీ దర్శకత్వం వహిస్తున్న ది రాజాసాబ్ సినిమాని కూడా ప్రభాస్ చేస్తున్నారు. దానికి ముందు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 AD ఈ ఏడాది మే 9న విడుదల కాబోతుంది.

Jojobet GirişmeritbetmeritbetcasibomvbetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/