ఏందిరా అయ్యా..ఈ సలార్ ప్రీ బుకింగ్స్

Confusion at Saalar Ticket Bookings: ఈ డిసెంబర్ 22న థియేటర్లపైకి దాడి చేసేందుకు వస్తోంది డైనోసార్ ప్రభాస్ మూవీ సలార్-ది సీజ్ ఫైర్. ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అయితే ఇటీవల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఇలా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయో లేదో..

Confusion at Saalar Ticket Bookings: ఈ డిసెంబర్ 22న థియేటర్లపైకి దాడి చేసేందుకు వస్తోంది డైనోసార్ ప్రభాస్ మూవీ సలార్-ది సీజ్ ఫైర్. ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అయితే ఇటీవల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఇలా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయో లేదో..

కళ్ళు తిరుగుతున్నాయి సినిమా రిలీజ్ కాకముందే. ప్రీ రిలీజ్ బుకింగ్సే మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. ఇంకా సలార్ రిలీజ్ డిసెంబర్ 22 అవుతుందనగానే దేశమంతా ఉప్పెన వచ్చినట్టుగా తయారైంది. తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ గడ్డల మీద సలార్ దుమారం లేచింది. అడ్వాన్స్ టికెట్ బుకింగ్ మోతెక్కిపోతోంది. వారం రోజుల ముందు నుంచే టిక్కెట్స్ హడావుడి ప్రారంభమై సలార్ పెద్ద హిట్ అయినంత వాతావరణం మొత్తం అన్ని రాష్ట్రాలలో వచ్చేయడం కొంత వింతగా ఉన్నా కూడా, ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్‌కి ఆ మాత్రం అంచనాలుండడం సహజమే అనిపిస్తుంది. పైగా ప్రభాస్‌ని, ఒరిజినల్ యాక్షన్ ఫ్రేమ్‌లో చూడ్డానికి మొహం వాచిపోయిన డార్లింగ్ అభిమానులకు సలార్ ట్రైలర్ 1 కొత్త ఆశలను అందించింది.

ఇంత వరకూ విడుదలైన ప్రభాస్ స్టారర్స్ సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ దాదాపుగా నిరాశనే మిగిల్చాయి. అంటే ప్రభాస్ బాహుబలి 1 అండ్ 2తో సాధించిన ఓవరాల్ ఇమేజ్‍కి తగినట్టుగా లేకపోవడం, ప్రభాస్ మార్కెట్‌ని అడ్వాంటేజ్ తీసుకున్న సినిమాలుగా మాత్రమే అవి మిగిలిపోవడంతో ఇటు ఇండియన్ ఫిల్మ్ ట్రేడ్‌కి, అటు పక్క అభిమానులకి కూడా తీవ్రమైన నిరాశనే అవి మిగిల్చాయి. ఇప్పుడలా కాదు. సలార్ ట్రైలరే సినిమాలా ఉంది. దాదాపు నాలుగు నిమిషాల నిడివిలో విడుదలైన సలార్ ట్రైలర్ చూస్తే మాత్రం ప్రభాస్ ఇందులో దుమ్ము లేపబోతున్నాడనే ఫీలింగ్ కలిగింది. ట్రైలర్ ఎండ్‌లో ప్రభాస్ వచ్చినా, అంతకు ముందు ఎస్టాబ్లిష్ మెంట్ షాట్స్, ప్లాట్ ఇంట్రడక్షన్, ఆ వాతావరణం, అందులో ఆర్డిస్టులు మొత్తం అందరూ కూడా రాబోతున్న ప్రభాస్ విజువల్స్‌ ని చాలా హైలైట్ చేశాయి.

కెజిఎఫ్ ఫ్రాంచైజ్‌తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇచ్చిన షాక్ మామ్మూలు కాదు. అన్ని భాషలలో ప్రశాంత్ నీల్‌కి హేట్సాఫ్ చెప్పే పరిస్థితి వచ్చేసింది. కెజిఎఫ్‌కి ఏ మాత్రం తగ్గకుండా, నిజానికి అంత కన్నా ఎక్కువే కూడా సలార్ ట్రైలర్‌లో కనిపించగానే సలార్ మీద అమాంతంగా అంచనాలు ఆకాశానికి చేరుకున్నాయి. యానిమల్ బాక్సాఫీసు ఊచకోత యధేచ్ఛగా సాగుతోంది ఓ వైపు. అదెక్కడ ఆగుతుందో, ఎప్పుడు ఆగుతుందో కూడా తెలియనంత యానిమల్ మేనియా చెలరేగుతోంది ప్రస్తుతం వరల్ వైడ్. అలా యానిమల్ వేట కొనసాగుతుండగానే డిసెండర్ 22న సలార్ రిలీజ్‌కి తయారైంది. యానిమల్ ధాటికి సలార్ మాత్రం ఎంతవరకూ తట్టుకుని నెగ్గుకొస్తుందో అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. యానిమల్ లాగానే సలార్ కూడా దుమ్ము లేపితే దక్షిణాది దర్శకులకు ఇంక ఎప్పటికీ తిరుగే ఉండదు.

Show comments