Fahadh Faasil: ఫహద్ ఫజిల్ సినిమాపై హ్యుమన్ రైట్ కమీషన్ సీరియస్.. ఎందుకంటే..?

Fahadh Faasil..మలయాళ ఇండస్ట్రీలో అటు హీరోగా, ఇటు నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్నాడు ఫహద్ ఫజిల్. ఈ ఏడాది బాక్సాఫీసు వద్ద వంద కోట్లు కొల్లగొట్టిన ప్రేమలు, ఆవేశం చిత్ర నిర్మాతల్లో ఆయన కూడా ఒకరు. ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు.

Fahadh Faasil..మలయాళ ఇండస్ట్రీలో అటు హీరోగా, ఇటు నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్నాడు ఫహద్ ఫజిల్. ఈ ఏడాది బాక్సాఫీసు వద్ద వంద కోట్లు కొల్లగొట్టిన ప్రేమలు, ఆవేశం చిత్ర నిర్మాతల్లో ఆయన కూడా ఒకరు. ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు.

ఈ ఏడాది మలయాళ సినిమాలు బాక్సాఫీసును ఊచకోత కోసిన సంగతి విదితమే. సుమారు ఐదు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ప్రేమలు, బ్రహ్మయుగం, మంజుమ్మల్ బాయ్స్, గోట్ లైఫ్-ఆడు జీవితం, ఆవేశం. అయితే ఈ ఏడాది హీరోగా అటు నిర్మాతగా సక్సెస్ అయ్యాడు ఫహద్ ఫజిల్. బాక్సాఫీసు వద్ద వంద కోట్లు కొల్లగొట్టిన ప్రేమలు, ఆవేశం చిత్రాల నిర్మాతల్లో ఆయన కూడా ఒకరు. ఫుల్ జోష్‌లో ఉన్నాడు ఫహద్. అలాగే పుష్పతో కూడా తెలుగు వారికి సుపరిచితం అయ్యాడు. ఇప్పుడు అతడి చేతి నిండా సినిమాలున్నాయి. తెలుగులో పుష్ప 2తో పాటు డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనే మూవీ కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇవి కాకుండా రెండు తమిళం, రెండు మలయాళ చిత్రాలను లైన్లో పెట్టాడు.

అయితే ఇప్పుడు ఫహద్ నిర్మిస్తున్న చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఓ ప్రభుత్వాసుపత్రిలో షూటింగ్ చేయడం పట్ల మానవ హక్కుల కమీషన్ సీరియస్ అయ్యింది. కేరళలోని అంగమలీ తాలూకా ఆసుపత్రిలో క్యాజువాలిటీ విభాగంలో గురువారం రాత్రంతా చిత్రీకరణ చేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అత్యవసర విభాగంలో సినిమా షూట్ కు అనుమతినిచ్చినందుకు ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఎర్నాకులం జిల్లా వైద్యాధికారి, అంతమలీ తాలూకా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు కమీషన్ సభ్యులు బీనా కుమారి కోరారు. ఫహద్ నిర్మిస్తున్న పింక్లీ చిత్రం షూటింగ్ ఇటీవల మొదలైంది. ఈ నేపథ్యంలో ఓ గవర్నమెంట్ ఆసుపత్రిలో షూటింగ్ స్టార్ట్ చేశారు. క్యాజువాలిటీ లైట్లను డిమ్ చేసి షూటింగ్‌కు అనుమతించారని ఆరోపణలు ఎదురౌతున్నాయి. వైద్యులు చికిత్స అందిస్తుండగానే.. షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.

దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల్ని.. అత్యవసర విభాగంలోకి కూడా తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. మొత్తం 50 మంది చిత్రీకరణలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. మెయిన్ గేట్ నుండి లోపలికి ఎవరినీ రాకుండా అడ్డుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. షూటింగ్ జరుపుతున్న నేపథ్యంలో లోపలికి రోగుల్ని కూడా పంపలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే నిర్మాతల సంఘం ఈ ఆరోపణలను కొట్టివేసింది. ఓ రాత్రి సినిమా షూటింగ్ కోసం  రూ. 10 వేలు చెల్లించామని నిర్మాతలు చెబుతున్నారు. తాము ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలిగించలేదని ప్రొడ్యూసర్స్ క్లారిటీ చెప్పారు. కాగా, ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన హ్యుమన్ రైట్స్ కమిషన్.. కేసు నమోదు చేసింది. దీంతో నిర్మాత విచారణలో పాల్గొనాల్సి వస్తుందని సమాచారం. దీంతో ఫహాద్ విచారణను ఎదుర్కోవలసి వస్తుందని తెలుస్తోంది.

Show comments