iDreamPost
android-app
ios-app

Video: టిల్లుతో రెచ్చిపోయిన అనుపమ.. అభిమాని ఆవేదన!

  • Published Feb 19, 2024 | 4:41 PM Updated Updated Feb 19, 2024 | 4:41 PM

మాలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ తాజాగా డీజే టిల్లు 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ లో అనుపమని చూసిన ఓ అభిమాని చేసిన కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకి ఆయన ఏం చెప్పాడంటే..

మాలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ తాజాగా డీజే టిల్లు 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ లో అనుపమని చూసిన ఓ అభిమాని చేసిన కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకి ఆయన ఏం చెప్పాడంటే..

  • Published Feb 19, 2024 | 4:41 PMUpdated Feb 19, 2024 | 4:41 PM
Video: టిల్లుతో రెచ్చిపోయిన అనుపమ.. అభిమాని ఆవేదన!

టాలీవుడ్ హీరోయిన్ ‘అనుపమ పరమేశ్వరన్’. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈమె మొదటగా మలయాళ సినిమాతో నటిగా వెండితెర పై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ కి పరిచయమై వరుస సినిమాలు చేస్తూ ఇక్కడ స్థిరపడిపోయింది. అయితే అనుపమ పేరుకి మలయాళ నటి అయిన ఈమె తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. కానీ, ప్రస్తుతం ఈ అమ్మడుకి అవకాశాలు పెద్దగా రావడం లేదు. కాగా, ఇప్పుడు అనుపమ చేతిలో ఒకటి రెండు ప్రాజెక్టులు తప్ప కొత్తవేమి లేవు. అయితే ఇప్పుడు ఆమె చేస్తున్నా ప్రాజెక్ట్ లో మాత్రం సరికొత్తగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎంతో పద్ధతిగా ముద్దుగా కనిపించిన అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు ఇలా కొత్త లుక్ లో కనిపించడంతో ఈమె అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

టాలీవుడ్ లో అనుపమ పరమేశ్వరన్ కు మంచి ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది. పైగా యూత్ లో ఈమెకు ఉన్నా క్రేజ్ అంత ఇంత కాదు. ఎందుకంటే.. ఒక ‘ప్రేమమ్’, ‘అఆ’ , ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒకటి జిందగీ’, ‘హలో గురు ప్రేమకోసమే’ లాంటి సినిమాల్లో ఎంతో పద్ధతిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది అనుపమ. కానీ , ఈ మూవీస్ తో ఆమెకి క్లాస్ ఇమేజ్ తెచ్చిపెట్టడమే తప్పా, పెద్దగా అవకాశాలు అందిపుచ్చుకో లేదు. దీంతో రూట్ మార్చిన అనుపమ రౌడీ బాయ్స్ సినిమాలో ముద్దు సీన్స్ లో నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అలాగే ఇప్పుడు ‘డీజే టిల్లు- 2’ లో నటించి అందరినీ షాకయ్యాలే చేసింది. ఇందులో ఆమె లిప్ కిస్ చేయడంతో పాటు హద్దుల చేరెపిసినట్లుగా కనిపిస్తుంది. అలానే ఈ సినిమాలో హాట్ హాట్ గా కనిపించబోతుందని ఇప్పటికే అందరికీ అర్ధమైపోయింది. అయితే.. అనుపమ ట్రెండ్ కి తగ్గట్టుగా మారే ప్రయత్నం చేస్తున్న.. అది అభిమానులు తీసుకోలేకపోతున్నారు. తాజాగా డీజే టిల్లు-2 ట్రైలర్ లో అనుపమని చూసిన ఓ అభిమాని ఆశ్చర్యపోయాడు. అలాగే ఆమె గ్లామర్ రోల్స్ చేస్తుండటం పై తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియాను కూడా చేశాడు.

ఎంతో ముద్దుగా అందంగా అలరించిన అనుపమ ఇప్పుడు ఉన్నటుండి ఇలా గ్లామెరస్ పాత్రలలో నటిస్తుంది. ఇది ఆమె అభిమానులకు అంతగా ఒంటిపడటం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పై అనేక విమర్శలు వినిపిస్తునే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ అభిమాని కూడా అనుపమ సినిమాలను ప్రస్తావిస్తూ.. తన భావోద్వేగాన్ని వెల్లడించాడు. అందులో ఆయన మాట్లాడుతూ.. ‘అనుపమా గారు.. నా ఆటోలో మీ ఫోటో ఎందుకు పెట్టుకున్నానో మీకు తెలుసా అండీ. ఒకప్పుడు మీరు తీసిన సినిమాలు అలాంటివి. అలాంటి సినిమాలు చూసి మిమ్మల్ని ఇష్టపడని వారంటూ ఉండరు. ప్రేమమ్, అఆ, శతమానం భవతి వంటి సినిమాలు ఎంత గొప్పగా ఉండేవి. అసలు శతమానం భవతి సినిమాలో మరదలు అంటే మీలా ఉండేలా చేశారు. దీని తర్వాత హలో గురు ప్రేమ కోసమెరా, ఉన్నది ఒక్కటే జిందగీ, వంటి సినిమాలు చేశారు. మరి ఇప్పుడు మాత్రం రౌడిబాయ్స్, టిల్లు స్క్వేర్ వంటి సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు సావిత్రి గారు, సౌందర్య గారిలానే మీరు సినిమాలు చేస్తారని అంతా అనుకున్నాం. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాలు మాకు నచ్చడం లేదరు ఎందుకండి ఇలాంటి సినిమాలు చేయడం’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. మరి, అనుపమ గ్లామరెస్ పాత్రలపై ఆయన అభిమాని చేసిన వ్యాఖ్యలు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomsuperbetinJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/