iDreamPost
android-app
ios-app

Hero Srikanth:ఆ రోజు రాశీని అలా పిలిచాను.. అందుకే నన్ను కొట్టింది

  • Published Dec 28, 2023 | 12:14 PM Updated Updated Dec 28, 2023 | 12:14 PM

టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్, హీరోయిన్ రాశి ఇండస్ట్రీలో ఎంత మంచి హిట్ పెయిర్ అనేది అందరికి తెలిసిందే. అయితే ఇటీవలే వీరిద్దరు కలిసి ఓ మూవీ ఈవెంట్ కి వెళ్లారు. అక్కడ రాశి శ్రీకాంత్ తో చనువుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీనిపై స్పందించిన శ్రీకాంత్ మా మధ్య అలాంటి బంధం తప్ప ఇంకా ఏం ఉంటుంది అన్నారు.

టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్, హీరోయిన్ రాశి ఇండస్ట్రీలో ఎంత మంచి హిట్ పెయిర్ అనేది అందరికి తెలిసిందే. అయితే ఇటీవలే వీరిద్దరు కలిసి ఓ మూవీ ఈవెంట్ కి వెళ్లారు. అక్కడ రాశి శ్రీకాంత్ తో చనువుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీనిపై స్పందించిన శ్రీకాంత్ మా మధ్య అలాంటి బంధం తప్ప ఇంకా ఏం ఉంటుంది అన్నారు.

  • Published Dec 28, 2023 | 12:14 PMUpdated Dec 28, 2023 | 12:14 PM
Hero Srikanth:ఆ రోజు రాశీని అలా పిలిచాను.. అందుకే నన్ను కొట్టింది

టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే. ఇండ్రస్ట్రీలో హీరోగా, ప్రతినాయకుడిగా,  తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి మూవీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఫ్యామిలీ హీరోగా మారారు. ఇక మంచి లవ్ స్టోరిస్ లో ప్రేమికుడుగా అలరించి తనదైన నటనతో.. లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.అతి తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగారు. ఇక ఒకనొక కాలంలో శ్రీకాంత్‌కు మంచి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అలా అతని పై మనసు పారేసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారని ఇండస్ట్రీలో టాక్. ఇది ఇలా ఉంటే.. ఇటీవలే ఓ మూవీ కార్యక్రమంలో శ్రీకాంత్, సీనియర్ హీరోయిన్ రాశి పాల్గొన్నారు. అక్కడ వీరిద్దరూ చాలా చనువుగా ఉన్నా వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో.. వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ ఉందని టాక్ నడిచింది.

తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ రాశి, శ్రీకాంత్‌లది ఎంత మంచి హిట్ పెయిర్ అనేది అందరికి తెలిసిందే. తెరపై ఎంత మంచి హిట్ పెయిర్ గా నిలిచారో, తెరవెనుక కూడా అంతే మంచి స్నేహితులుగా ఉండేవారు. అయితే ఇటీవలే వీరిద్దరి కలిసి ఓ మూవీ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా ఏళ్ల క్రితం విడిపోయిప స్నేహితులు ఒక్కసారిగా కలిస్తే ఎలా ఉంటుందో.. అలానే నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఇక ఆ వీడియోలో రాశి.. శ్రీకాంత్ ను కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. కాగా, ఆ సమయంలో శ్రీకాంత్ ఏం అంటే రాశీ అలా కొట్టిందో అని చాలామంది నచ్చిన విధంగా ఊహించుకున్నారు. ఇక ఈ విషయం పై శ్రీకాంత్ తాజా ఇంటర్వ్యూలో రాశీ అలా ఎందుకు కొట్టిందో స్పందించి వివరించారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

raasi and srikanth funny incident

ఇక ఆ విషయం పై శ్రీకాంత్ స్పందిస్తూ.. ‘చాలా ఏళ్ల తర్వాత మేమిద్దరం ఒక ఫంక్షేన్ లో కలిశాం. కాగా, అక్కడ ఉన్న ఒక హీరోయిన్ రాశిని అమ్మ అని పిలిచింది. దీంతో.. నేను కూడా రాశిని.. సరదాగా రాశి అమ్మ అన్నాను. అందుకు తను సరదాగా నవ్వుతూ కొట్టింది. అంతకు మించి మా మధ్య ఇంక ఏం లేదు. నేను నంటించిన హీరోయిన్స్ లో సౌందర్య, ఉమతో చాలా కంఫర్ట్ గా ఫీలయ్యేవాడిని. వాళ్లంతా మా ఇంటిలో ఒక కుటుంబ సభ్యులా వచ్చేవారు. అంతేకాకుండా నేను సైడ్ ఆర్టిస్టులు అందరితో బాగా ఉండేవాన్ని’ అని అన్నారు.

ప్రస్తుతం శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా, గతంలో శ్రీకాంత్ ఊహ విడాకులు తీసుకుంటున్నారు అని రూమర్స్ ఎక్కువగా వినిపించాయి. దీనిపై పలు టీవీల్లో బ్రేకింగ్ కూడా వేశారు. అయితే వార్తలేవీ నిజాలు కాదని వాటిని ఖండించారు. ఇక ఇండస్ట్రీలో కుర్ర హీరోలు పెరగడంతో శ్రీకాంత్ విలాన్ గా సపోర్టింగ్ క్యారెక్టర్ గా నటించి మెప్పిస్తున్తారు. ఇటీవలె కొటబొమ్మాళి అనే సినిమాలో పోలీస్ గా అలరించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరి, శ్రీకాంత్, రాశిల మధ్య స్నేహం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet