మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమాల్లో ఒకటి ‘ధృవ’. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మంచి హిట్‌గా నిలిచింది. ‘గోవిందుడు అందరివాడేలే’, ‘బ్రూస్ లీ: ది ఫైటర్’ లాంటి వరుస ఫ్లాపులతో రేసులో కాస్త వెనుకబడిన టైమ్‌లో చెర్రీ కెరీర్‌కు మంచి బూస్టప్ ఇచ్చింది ‘ధృవ’. అయితే ఈ మూవీ ఓ తమిళ సినిమాకు రీమేక్ అనే విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా పేరు గడించిన మోహన్ రాజా రూపొందించిన ‘తని ఒరువన్’కు అఫీషియల్ రీమేకే ‘ధృవ’. ఈ మూవీలో చరణ్‌ను చూపించిన విధానానికి ఆయన ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు.
‘ధృవ’కు సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా అభిమానుల కోసం ఒక శుభవార్త వచ్చేసింది. ఈ మూవీకి ఒరిజినల్ అయిన ‘తని ఒరువన్’ సీక్వెల్‌కు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత శ్రీకారం చుట్టనున్నారు. 2015 ఆగస్టు 28న ఈ చిత్రం విడుదలైంది. ఈ నెల 28వ తేదీతో ‘తని ఒరువన్’ వచ్చి 8 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో అదే రోజున ‘తని ఒరువన్ 2’ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని టాక్. ఈ మూవీ గురించి ఇప్పటికే దర్శకుడు మోహన్ రాజా క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవితో తీసిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం ప్రమోషన్స్ సమయంలో ‘తని ఒరువన్’ సీక్వెల్ గురించి మోహన్ రాజా మాట్లాడారు.
‘తని ఒరువన్’ సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి కావొచ్చాయని, త్వరలోనే అన్ని విషయాలు చెబుతానని అప్పట్లో మోహన్ రాజా అన్నారు. ఈ స్టోరీ లైన్ రామ్ చరణ్‌కు కూడా బాగా నచ్చిందన్నారు. అయితే తెలుగులో ‘ధృవ 2’ ఉంటుందో లేదా రాబోయే రోజుల్లోనే తెలుస్తుందని సందిగ్ధంలో పడేశారు మోహన్ రాజా. ఒకవేళ ‘తని ఒరువన్ 2’ సూపర్ హిట్టయితే తెలుగులోనూ సీక్వెల్ తెరకెక్కొచ్చు. మొత్తానికి పట్టాలెక్కడానికి ముందే ‘తని ఒరువన్ 2’పై అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ ఆసక్తి నెలకొంది. మరి.. ‘ధృవ 2’ రావాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.