అక్కినేని నాగచైతన్య కొత్త చిత్రం ‘తండేల్’ గురించి నిర్మాత అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ గీతా ఆర్ట్స్ అధినేత ఏమన్నారంటే..!
అక్కినేని నాగచైతన్య కొత్త చిత్రం ‘తండేల్’ గురించి నిర్మాత అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ గీతా ఆర్ట్స్ అధినేత ఏమన్నారంటే..!
స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస పరాజయాలతో డీలా పడ్డ ఆయనకు ‘దూత’ వెబ్ సిరీస్‌తో హిట్ పడింది. ప్రముఖ దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ సిరీస్‌కు ఆడియెన్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. అలాంటి చైతూ రీసెంట్గా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ‘తండేల్’ అనే పాన్ ఇండియా మూవీకి కమిటైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చైతన్యకు జంటగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించారు. అయితే గతంలో చైతూ-సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ‘లవ్ స్టోరి’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మళ్లీ ఇప్పుడు ‘తండేల్’ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. కాగా, ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున గెస్టులుగా వచ్చారు. ఇక పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
‘తండేల్’ సినిమా పూజా కార్యక్రమం తర్వాత నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. ఏడాదిన్నర కింద మొదలుపెట్టిన మా ప్రయత్నం ఇప్పుడు పూజా కార్యక్రమాల వరకు వచ్చిందన్నారు. ప్రస్తుతం ఓ సబ్జెక్ట్‌ను ఎలా తీర్చిదిద్దాలని టీమ్ ప్రయత్నిస్తోందని తెలిపారు. అయితే రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడనేది కంగారు లేకుండా.. స్టోరీని అనుకున్నట్టుగా ఓ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా సినిమా తీయాలని చూస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఓ దర్శకుడికి హిట్ వస్తే చాలు.. లెక్కలేనన్ని ఆఫర్లు వస్తున్నాయని.. కానీ, దీనికి ముందు ఎప్పుడో ఉన్న కమిట్మెంట్లను అలా పాటించడం అనేది సహజంగా రాజమౌళి ఫాలో అవుతుంటారని అల్లు అరవింద్ గుర్తుచేశారు.
‘ఎంత మంది ఎన్ని ఆఫర్లు ఇచ్చినా.. నేను గీతా ఆర్ట్స్‌లోనే చేస్తానని ఆ కథను పట్టుకొని చందూ మొండేటి జర్నీ చేశారు. అలాగే ఈ కథకు నాగ చైతన్య అయితే కరెక్ట్‌గా సెట్ అవుతారని.. ఆయనకు స్టోరీ చెబితే ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. ఈ కథలో చైతూకు సరైన జోడీ కావాలి కదా? అందుకే మా బంగారు తల్లి (సాయి పల్లవి)కి కూడా స్టోరీ వినిపిస్తే ఫుల్ ఎగ్జైట్ అయింది. ప్రస్తుతం సినిమాలన్నీ పాన్ ఇండియా సైజులో వినిపిస్తూ.. కనిపిస్తున్నాయి. కాబట్టి , పాన్ ఇండియా మూవీ అనుకున్నప్పుడు ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ రావడం, అలాగే శ్యామ్ (కెమెరామెన్) దొరకడం మా అదృష్టం’ అని అరవింద్ చెప్పుకొచ్చారు.
‘నా బోర్డ్ రూమ్‌లో చిన్న పడవలు రూపొందించి మూవీని ఎలా చేయాలని ఆలోచించేవారు. ఇలాంటి సినిమా వస్తుండటం నాకు ఎగ్జైటింగ్‌గా అనిపిస్తుంది. అలాగే మా కెప్టెన్ చందూకు ఆల్ ది బెస్ట్. ‘తండేల్’ అంటే చాలా మందికి చాలా డౌట్లున్నాయ్. అవి అలాగే ఉంచండి.. మాట్లాడుతూ ఉండండి’ అని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. ఇక అల్లు అరవింద్ మాటల్ని బట్టి చూస్తే ఇంకా పరశురామ్ మ్యాటర్‌ను మరిచిపోయినట్టుగా కనిపించడం లేదు. విజయ్-పరశురామ్ కలసి గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయాల్సి ఉంది. కానీ పరశురామ్ కాస్తా దిల్ రాజు బ్యానర్ లోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆ మధ్య పెద్ద కాంట్రవర్సీనే జరిగింది. ఇది చూస్తుంటే.. పరశురామ్ మీద అల్లు అరవింద్‌కు ఇంకా కోపం తగ్గినట్టుగా లేదని అంటున్నారు. మరి, ‘తండేల్’ మూవీపై అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలిజేయండి.
ఇదీ చదవండి: Ted Sarandos: బాలీవుడ్‌ను కాదని టాలీవుడ్ హీరోలను కలిసిన నెట్‌ఫ్లిక్స్ CE0.. కారణం ఏంటంటే..