iDreamPost
android-app
ios-app

‘గుంటూరు కారం’ నుండి తమన్ అవుట్? క్లారిటీ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

  • Author ajaykrishna Published - 01:58 PM, Mon - 24 July 23
  • Author ajaykrishna Published - 01:58 PM, Mon - 24 July 23
‘గుంటూరు కారం’ నుండి తమన్ అవుట్? క్లారిటీ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అది మూవీస్ పరంగా కావచ్చు లేదా మ్యూజికల్ గాను కావచ్చు. ఒక్కోసారి డైరెక్టర్, హీరో రిపీట్ అయినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ కావచ్చు. మరో టైమ్ లో హీరోకి, మ్యూజిక్ డైరెక్టర్ కి కుదిరినా డైరెక్టర్ చేంజ్ కావచ్చు. అలాగని హీరో చేంజ్ అయి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ రిపీట్ కావచ్చు. ఇలా ఏ కాంబినేషన్ సెట్ అయినా.. మొత్తానికి ఫ్యాన్స్, ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేసేది బ్లాక్ బస్టర్. అయితే.. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న కాంబినేషన్ రిపీట్ అవుతుందంటే మాత్రం అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘గుంటూరు కారం’ మూవీపై అలాంటి అంచనాలే నెలకొన్నాయి.

మహేష్ బాబు – డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. అతడు, ఖలేజాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఫ్యాన్స్ ఊహించని రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. పైగా మూడోసారి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ని రిపీట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. యాధృచ్చికంగా అటు మహేష్, తమన్ లకు 5వ సినిమా ఇది. దీంతో అటు మ్యూజిక్ పరంగాను అంచనాలు ఉన్నాయి. కాంబినేషన్ అయితే క్రేజీగానే ఉంది. కానీ.. ఈ సినిమాకి ముందునుండి అడ్డంకులే. షూటింగ్ మొదలైన కొద్దిరోజులకు ప్రాజెక్ట్ నుండి హీరోయిన్ పూజాహెగ్డే తప్పుకుంది. ఆ తర్వాత రీసెంట్ గా సినిమాటోగ్రాఫర్ తప్పుకుని షాకిచ్చాడు. అదే వరుసలో మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ కూడా తప్పుకున్నాడని వార్తలొచ్చాయి.

మహేష్, తమన్ కాంబినేషన్ లో మరో మ్యూజికల్ హిట్ ఆల్బమ్ వస్తుంది అనుకున్న ఫ్యాన్స్ కి షాక్ కొట్టినట్లు అయ్యింది. అయితే.. తమన్ గురించి ఇప్పటిదాకా అధికారిక వార్తలు మాత్రం రాలేదు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్.. గుంటూరు కారం మూవీ పై క్లారిటీ ఇచ్చాడు. “ఒకవేళ తాను సినిమా నుండి తప్పుకుంటే ప్రొడ్యూసర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు కదా.. అలాంటిదేమి లేదు. మేమంతా గుంటూరు కారం కోసం ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నాం” అని క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఫ్యాన్స్ అంచనాలు రీచ్ అయ్యేలా ఆల్బమ్ ప్లాన్ చేస్తున్నట్లు తమన్ తెలిపాడు. తమన్ స్వయంగా క్లారిటీ ఇచ్చేసరికి ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరి తమన్ – మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio