iDreamPost
android-app
ios-app

షాకింగ్ న్యూస్! సినిమాలకు గుడ్ బై చెప్పనున్న దళపతి విజయ్?

  • Author ajaykrishna Published - 12:09 PM, Sat - 8 July 23
  • Author ajaykrishna Published - 12:09 PM, Sat - 8 July 23
షాకింగ్ న్యూస్! సినిమాలకు గుడ్ బై చెప్పనున్న దళపతి విజయ్?

స్టార్ హీరో దళపతి విజయ్ గురించి దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. పేరుకు తమిళ హీరో అయినప్పటికీ.. ఇటు తెలుగులోను మంచి మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోగలిగారు. విజయ్ సినిమాలన్నీ రెగ్యులర్ గా తెలుగులో డబ్ అవుతూనే వస్తున్నాయి. ఈ ఏడాది వారసుడు మూవీతో పలకరించిన విజయ్.. దీపావళికి ‘లియో’ మూవీని రెడీ చేస్తున్నాడు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో సూపర్ స్టార్డమ్ అందుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ లియో మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కావడంతో తమిళ, తెలుగు భాషల్లో మంచి బజ్, మార్కెట్ ఏర్పడింది.

కేవలం తెలుగులోనే లియో మూవీకి రూ. 20 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ తో పాటు.. అటు ఎల్.సి.యూ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో అక్టోబర్ 19న రిలీజ్ అవుతున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ సినిమా తర్వాత విజయ్.. డైరెక్టర్ వెంకట్ ప్రభుతో ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ అట్లీతో తన నాలుగో మూవీ చేయనున్నాడని టాక్ నడుస్తోంది. అదీగాక రోజురోజుకి విజయ్ క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా వరల్డ్ వైడ్ విస్తరిస్తోంది.

ఓ రకంగా విజయ్ ప్రెజెంట్ తన కెరీర్ లో పీక్ స్టేజ్ ని చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో విజయ్ ఫ్యూచర్ కి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో చక్కర్లు కొడుతోంది. వచ్చే ఏడాది వెంకట్ ప్రభు మూవీ కంప్లీట్ చేశాక.. విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. ఈ విషయం ఇప్పుడు అటు ఇండస్ట్రీలో.. ఇటు ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఎందుకు అనే వివరాల్లోకి వెళ్తే.. విజయ్ సినిమాల నుండి రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే గనక నిజమైతే.. తమిళనాడులో విజయ్ నిర్ణయం పెద్ద సంచలనం కాబోతుందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందనేది తెలియదు. కానీ.. టాక్ అయితే బలంగా నడుస్తుంది. మరి విజయ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet