nagidream
Bharat Bhushan Met CM Revanth Reddy After He Became Elected As Telugu Film Chamber Of Commerce President: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికైన సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
Bharat Bhushan Met CM Revanth Reddy After He Became Elected As Telugu Film Chamber Of Commerce President: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికైన సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
nagidream
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. టీఎఫ్సీసీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సందర్భంగా రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి, అలానే గద్దర్ అవార్డ్స్ గురించి రేవంత్ రెడ్డితో చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఆయనను కలవడానికి అవకాశం ఇచ్చారు. ఆయనతో చర్చించే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రభుత్వ సహాయం ఉంటుందని రేవంత్ రెడ్డి గారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది’ అని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడు భరత్ భూషణ్ అన్నారు.
ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన భరత్ భూషణ్ కి అభినందనలు తెలియజేశారు. తన అమెరికా పర్యటన తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీటింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి అన్నారు.