iDreamPost
android-app
ios-app

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హీరోయిన్!

  • Published Dec 27, 2023 | 4:54 PM Updated Updated Dec 27, 2023 | 4:54 PM

సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు. కొందరు స్టార్ హీరోయిన్లుగా ఎదిగితే.. మరికొందరు ఒకటి రెండు సినిమాలతోనే వెండితెరకు దూరమవుతుంటారు. వారిలో కొందరు గుర్తుపట్టలేనంతగా మారిపోతుంటారు.

సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు. కొందరు స్టార్ హీరోయిన్లుగా ఎదిగితే.. మరికొందరు ఒకటి రెండు సినిమాలతోనే వెండితెరకు దూరమవుతుంటారు. వారిలో కొందరు గుర్తుపట్టలేనంతగా మారిపోతుంటారు.

  • Published Dec 27, 2023 | 4:54 PMUpdated Dec 27, 2023 | 4:54 PM
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హీరోయిన్!

నేటికాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు దీనిని వినియోగించి అనేక  విషయాలు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే సినిమా వాళ్ల ఓల్డ్ ఫిక్స్, వారి ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. గతంలో సినిమాలో నటించిన వాళ్లు.. గుర్తుపట్టలేనంతగా మారిపోతుంటారు. తాజాగా అలా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు ఓ తెలుగు హీరోయిన్. ప్రస్తుతం ఆ బ్యూటీ ఫోటోలో సోషల్ మీడియా వైరల్ అవుతోన్నాయి.

సినిమా హీరోయిన్లు, ఇండస్ట్రీకి దూరమైపోతే బయట పెద్దగా కనిపించరు. ఒకవేళ వాళ్ల పోటోలు కనిపించిన సరే సడన్ గా  గుర్తుపట్టడం కాస్త కష్టమవుతుంది. కారణం.. వారు అంతలా మారిపోతారు. ఇప్పుడు పై ఫోటోలో కనిపిస్తున్న  ఓ తెలుగు హీరోయిన్ కూడా అలానే  గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈమె తెలుగులో నాని హిట్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇప్పటికైనా గుర్తుపట్టారా?. ఆ పై ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు శరణ్య మోహన్. ఈ అమ్మడు కేరళలోని అలెప్పీలో పుట్టి, పెరిగింది. ఈమె ఎనిమిదేళ్ల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో మూడు, తమిళంలో రెండు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. టీనేజ్ లోకి వచ్చాక సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అలా కొన్నాళ్లకు హీరోయిన్ గా మారిపోయింది.

నటుడు కృష్ణుడు హీరోగా నటించిన ‘విలేజ్ లో వినాయకుడు’ సినిమాలో హీరోయిన్ గా శరణ్య మోహన్ నటించారు. ఆ సినిమాతోనే  టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ బ్యూటీ పరిచయమైంది. ఆ సినిమాతో శరణ్య  మంచి మార్కులే కొట్టేసింది. ఆ తరువాత నేచురల్ స్టార్ నాని నటించిన ‘భీమిలి కబడ్డీ జట్టు’ మూవీలో కూడా నటించింది. ఆ సినిమాలో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనస్సును దోచేసింది. ఆ తరువాత నందమూరి కల్యాణ్ నటించిన ‘కల్యాణ్ రామ్ కత్తి’, అలానే ‘హ్యాపీ హ్యాపీగా’ అనే సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత ఈ బ్యూటీ తెలుగు తెరపై కనిపించలేదు. ఆమె తిరిగి వెండితెరపై చూడాలని చాలా మంది కోరుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Saranya Mohan (@saranyamohanofficial)

ఈ క్రమంలోనే 2015లో తన చిన్నప్పటి స్నేహితుడు అరవింద్ కృష్ణన్ పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ పాప, బాబు ఉన్నారు. ప్రస్తుతానికైతే  శరణ్య సినిమాలు చేసే ఆలోచనలో లేదంట. భవిష్యత్తులో ఉంటుందేమో తెలీదు. శరణ్య స్వతహాగా భరత నాట్యం డ్యాన్సర్. అందుకే తన డ్యాన్స్ వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే శరణ్య హీరోయిన్ గా ఉన్నప్పుటితో పోలీస్తే.. ఇప్పుడు చాలా మారిపోయింది. అందుకే తెలుగు ప్రేక్షకులు శరణ్యను గుర్తు పట్టలేకపోయారు అసలు ఎవరు కూడా ఆమె భీమిలీ కబడ్డి సినిమాలో నటించిన హీరోయిన్ అంటే కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. ప్రస్తుతం శరణ్యకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. మరి.. ఈ తెలుగు బ్యూటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Saranya Mohan (@saranyamohanofficial)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet