iDreamPost
android-app
ios-app

నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు.. అల్లు అర్జున్ కు ఆహ్వానం!

  • Published Aug 29, 2024 | 3:13 PM Updated Updated Aug 29, 2024 | 3:13 PM

Nandamuri Balakrishna 50 Years Celebrations: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను టాలీవుడ్ అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సిద్ధమైంది. ఇక ఈ వేడుకకు సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఆహ్వానించింది తెలుగు ఫిలిం ఛాంబర్. ఆ వివరాల్లోకి వెళితే..

Nandamuri Balakrishna 50 Years Celebrations: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను టాలీవుడ్ అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సిద్ధమైంది. ఇక ఈ వేడుకకు సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఆహ్వానించింది తెలుగు ఫిలిం ఛాంబర్. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 29, 2024 | 3:13 PMUpdated Aug 29, 2024 | 3:13 PM
నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు.. అల్లు అర్జున్ కు ఆహ్వానం!

విశ్వవిఖ్యాత నటుడు, స్వర్గీయ నందమూరి  తారక రామరావు వారసుడిగా నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తరువాత తనదైన నటనతో టాలీవుడ్ లో టాప్ హీరో, ఓ లెజెండ్ గా నిలిచారు. ఇలా నేటికి ఎన్నో చిత్రాల్లో నటించి..యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టాలీవుడ్ పరిశ్రమ సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ సౌత్ ఇండియాలోని సినీ పరిశ్రమల నుంచి పలువురు ప్రముఖలకు ఆహ్వానాలు వెళ్లాయి. అలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా  ఆహ్వానం అందింది.

నేషనల్ అవార్డు విన్నర్ ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ తరపున పలువురు పెద్దలు కలిశారు. అంతేకాక బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ వేడుకలకు హాజరు కావాలంటూ ఆహ్వానించారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, తెలంగాణ స్టేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ అనుపమ రెడ్డి, మా అసోసియేషన్ నుండి మాదాల రవి , శివ బాలాజీ గారు, నిర్మాత ముత్యాల రామదాసులు బన్నీని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆహ్వానించడానికి వచ్చిన సినీ పెద్దలతో అల్లు అర్జున్ ముచ్చటించారు. అదే విధంగా బాలకృష్ణ గారి గురించి, ఆయనతో ఉన్న అనుబంధాన్ని అల్లు అర్జున్ వారితో పంచుకున్నారు.

నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 1న ఆదివారం హైదరాబాద్ లోని నోవోటెల్ హోటల్ లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో అంగరంగా వైభవంగా స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు  లెజెండరీ యాక్టర్స్ కు టాలీవుడ్ కు చెందిన పలువురు పెద్దలు ఆహ్వానం పలుకుతున్నారు. తమిళ్, మలయాళ,కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు శివరాజ్ కుమార్,విజయ్ సేతు పతి,శివకార్తికేయన్, కిచ్చా సుదీప్,దునియా విజయ్,డైరెక్టర్ పి.వాసు, నాజర్ ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్ లను ఈ వేడుకకు ఆహ్వానించారు.

అలానే సీనియర్ హీరోయిన్లు సుహాసిని, మీనా,మాలాశ్రీ,సుమలతలకు ఈ వేడుకకు సంబంధించి ఆహ్వానం అందింది. బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘తాతమ్మ కల’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా 1974వ సంవత్సరం ఆగస్టు 30న విడుదలైంది. ఈ నెల ఆగస్టు 30తో బాలకృష్ణ నటుడిగా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాలను నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఇటీవల టాలీవుడ్ లో అల్లు అర్జున్  ఇష్యూ నడుస్తున్న సంగతి తెలిసింది. ఈ  నేపథ్యంలోనే  బన్నికి బాలకృష్ణకు సంబంధించిన స్వర్ణోత్సవ వేడుకలకు  ఆహ్వానం అందింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş