iDreamPost
android-app
ios-app

వీడియో: అమ్మ 11 రోజులు ఆస్పత్రిలోనే.. సూర్యకాంతం కుమారుడు ఎమోషనల్!

తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన గయ్యాళి అత్త సూర్యకాంతం. కోడలిపై పెత్తనం సాగిస్తూ.. కొడుకును తన చెప్పు చేతల్లో పెట్టుకునే ఇంటి పెద్దగా నటించి ఆకట్టుకుంది. ఆమె చనిపోయి 30 ఏళ్లు గడుస్తున్నాఆమెను ఎవరు మర్చిపోలేరు. తాజాగా ఆమె కుమారుడు

తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన గయ్యాళి అత్త సూర్యకాంతం. కోడలిపై పెత్తనం సాగిస్తూ.. కొడుకును తన చెప్పు చేతల్లో పెట్టుకునే ఇంటి పెద్దగా నటించి ఆకట్టుకుంది. ఆమె చనిపోయి 30 ఏళ్లు గడుస్తున్నాఆమెను ఎవరు మర్చిపోలేరు. తాజాగా ఆమె కుమారుడు

వీడియో: అమ్మ 11 రోజులు ఆస్పత్రిలోనే.. సూర్యకాంతం కుమారుడు ఎమోషనల్!

గయ్యాలి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ సూర్యకాంతం. కోడలిని రాచి రంపాన పెట్టే అత్త పాత్రలో ఆమె నటన అద్బుతహ. ఇప్పటికీ ఆమె చరిష్మా చిర స్మరణీయం. సూర్యకాంతం అన్న పేరు పెట్టాలంటే భయపడిపోయేలా, ఆమె పేరు చెబితే హడలెత్తిపోయేలా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. కోడలిపై గొడవ పడే అత్తలకు సూర్యకాంతం అనే ట్యాగ్ లైన్ ఇచ్చేస్తుంటారు. ఆమె తెరపైనే గడుసుతనం, గయ్యాళితనం. కానీ తెర వెనుక సాత్వికురాలు అని చెబుతుంటారు. తెలుగు ప్రేక్షకుల అభిమాన నటి సూర్యకాంతం ఎలాంటి వారో, ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో  తాజాగా సూర్యకాంతం కుమారుడు, ఆయుర్వేద డాక్టర్ అనంత పద్మనాభ మూర్తి ‘ఐడ్రీమ్’ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

సూర్యకాంతం కుమారుడు అనంత పద్మనాభ మూర్తి మాట్లాడుతూ ‘ప్రేక్షకుల లెక్కల్లో ఆమె గయ్యాళి. మా లెక్కల్లో ఆమె అనురాగ దేవత. నా భార్యను కోడలిలా కాకుండా కూతురిలా చూసుకునేది. చేపలు, కుక్కుల పెంచడంతో పాటు వంట చేయడం ఆమెకు హాబీ. వంట చేసి ఇతరులకు వడ్డించడం ఇష్టం. ఆమెను అందరూ అమ్మ అనే పిలుస్తారు. గుండమ్మ కథ నుండి అక్క అని కొందరు పిలుస్తారు. ఒక్క భానుమతి మాత్రమే సూర్యం అని పిలుస్తుండేవారు. అమ్మ కోరిక మేరకు హోమియోపతి చదివాను. ఆంధ్రా బ్యాంక్‌లో కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేసి.. ఇప్పుడు మళ్లీ హోమియోపతిని కొనసాగిస్తున్నాను. నేను అమ్మకూచిని. అమ్మ అనుసరించిన పద్దతులను ఇప్పటికీ కొనసాగిస్తున్నాం’ అని వెల్లడించారు.

‘అప్పట్లో టీం వర్క్ ఉండేది. అప్పట్లో దివి సీమ ఉప్పెన జరిగినప్పుడు సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలింది. కానీ ఆ పరిస్థితి ఇప్పుడుందో లేదో తెలియదు. మహానటి సావిత్రి అమ్మను అడిగి కొట్టించుకున్నారు. అమ్మ దగ్గర దెబ్బలు తినని ఒకే ఒక నటి జమున. ఆమె ఎక్కువగా సూర్యకాంతంకి కూతురిగా నటించింది. అందుకే దెబ్బలు తినలేదు. గొప్ప నటీమణులు అందరూ ఆమెతో తన్నులు తిన్నవారే. అమ్మ వాగ్దాటికి సీన్ డామినేట్ అయ్యేది. కాకినాడ ఈ మధ్య కాలంలో వెళ్లినప్పుడు ఎంతో మంది నన్ను ఆదరించారు. ఆమె చనిపోయి 30 ఏళ్లు అవుతుంది. కానీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. అమ్మ .. ఛాయా దేవి మంచి ఫ్రెండ్స్‘ అని తెలిపారు.

యూట్యూబ్‌లో అమ్మ చనిపోతే రాలేదు అన్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. ‘అమ్మ డయాబెటిక్, కిడ్నీ ఫెయిల్ అయ్యింది. ఇంకా కొన్నాళ్లు బతికుండాల్సింది. అమ్మకు నెయ్యి అలవాటు. అలాగే ఫ్రై చేసిన పదార్థాలు ఇష్టం. స్పైసీగా ఉండాలి. ఆహారం దగ్గర ఎటువంటి నియంత్రణ పాటించలేదు. డయాబెటిస్‌ రావడంతో డయాలసిస్‌ కూడా చేయించుకుంది. అప్పుడు గుండె సమస్య కూడా రావడంతో ఐసీయూలో చేర్చారు. సుమారు పదకొండు- పన్నెండు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది చివరకు పరమపదించింది. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత వచ్చి..నాకు ఎందుకు చెప్పలేదు. బెటర్ ట్రీట్ మెంట్ నేనిప్పేచ్చే దాన్ని కదా అని అన్నారు. ఆమె అన్న మాటలు రెండు మూడు నెలల మర్చిపోలేకయాను’అంటూ ఎమోషనల్ అయ్యారు. ఆమె మరణించిన ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చారని, యూట్యూబ్‌లో వస్తున్న కథనాలు అవాస్తవమని అన్నారు. ఇంకా పలు విషయాలు పంచుకున్నారు.