iDreamPost
android-app
ios-app

రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ రీమేక్ కోసం టాలీవుడ్ హీరోల పోటీ.. ఇద్దరిలో ఎవరికీ ?

  • Published Jul 14, 2024 | 7:21 PM Updated Updated Jul 14, 2024 | 7:21 PM

Competition For Bollywood Movie Remake Rights :టాలీవుడ్ లో రీమక్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా బాలీవుడ్ లో రిలీజ్ అయినా సినిమా కిల్. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడం కోసం టాలీవుడ్ హీరోలు పోటీ పడుతున్నారట. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

Competition For Bollywood Movie Remake Rights :టాలీవుడ్ లో రీమక్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా బాలీవుడ్ లో రిలీజ్ అయినా సినిమా కిల్. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడం కోసం టాలీవుడ్ హీరోలు పోటీ పడుతున్నారట. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

  • Published Jul 14, 2024 | 7:21 PMUpdated Jul 14, 2024 | 7:21 PM
రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ రీమేక్ కోసం టాలీవుడ్ హీరోల పోటీ.. ఇద్దరిలో ఎవరికీ ?

బాగా హిట్ అయినా సినిమాలు ఏ లాంగ్వేజ్ లో ఉన్న సరే.. హిట్ అయితే కనుక.. అవి ఖచ్చితంగా రీమేక్ చేస్తూనే ఉంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే . ఈ క్రమంలో రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించిన సినిమా “కిల్”. ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందే.. దీనికంటే భయకరమైన సినిమా మరొకటి ఉండదు అన్నట్లుగా.. అందరికి ఈ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేశారు. చెప్పిన విధంగానే సినిమా.. అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో కిక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో కొనసాగుతుంది. ఈ క్రమంలో కిల్ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు.. ఇద్దరు టాలీవుడ్ హీరోలు కరణ్ జోహార్ టీమ్ ను సంప్రదించినట్లుగా సమాచారం. దానికి సంబంధించిన పూర్తి విషయాలు ఇలా ఉన్నాయి.

జూలై 5 న బాలీవుడ్ లో కిల్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎలాంటి హైప్ నైతే క్రియేట్ చేసిందో.. రిలీజ్ తర్వాత కూడా అదే రేంజ్ లో టాక్ ను, కలెక్షన్స్ ను రాబడుతుంది. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు సంపాదించుకుంటుంది. ఈ సినిమా వినడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవుతుంది. పెద్దగా ట్విస్ట్ లు కూడా ఏమి ఉండవు కానీ.. రక్తపాతం మాత్రం బాగా ఉంటుంది. హీరో రౌడీలపై తీర్చుకున్న రివెంజ్ కు అందరు షాక్ అవ్వాల్సిందే. కాగా ఈ సినిమాకు నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించారు. ఇక లక్ష్య, . ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా రీమేక్ రైట్స్ కోసం ఇద్దరు టాలీవుడ్ హీరోలు పోటీ పడుతున్నారనే టాక్ వినిపిస్తుంది. వారు మరెవరో కాదు.. కిరణ్ అబ్బవరం , సుధీర్ బాబు. మరి వీరిలో ఆ రైట్స్ ఎవరికీ దక్కుతాయో వేచి చూడాలి.

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు రీసెంట్ గా హరోం హర సినిమాతో.. డీసెంట్ టాక్ ను , కలెక్షన్స్ ను సంపాదించుకుని.. సేఫ్టీ జోన్ లోనే ఉన్నారు. ఇక తర్వాత ఎంచుకునే సినిమా విషయంలో కాస్త జాగ్రత వహిస్తే కనుక.. ఈ హీరో కెరీర్ లో వెనక్కు తిరిగి చూసే అవసరం రాదు. సుధీర్ బాబు ఎప్పుడు ప్రయోగాత్మకమైన సినిమాలనే తీస్తూ ఉంటారు కాబట్టి..ఈసారి ఎలాంటి స్టోరీ ఎంచుకుంటారనే ఆసక్తి అందరికి మొదలైంది. ఇక మరొక హీరో కిరణ్ అబ్బవరం విషయానికొస్తే.. కొన్నాళ్ళు అనేక కారణాల వలన గ్యాప్ వచ్చినా కానీ.. ఇప్పుడు వరుస సినిమాలు లైన్ అప్ తో బిజీగానే ఉన్నాడు ఈ హీరో. రీసెంట్ గా తన కొత్త సినిమాకు సంబంధించిన “క” అనే ఓ మూవీ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. సో ప్రస్తుతానికి ఇద్దరు హీరోలు బిజీగానే ఉన్నారు. మరి కిల్ మూవీ రైట్స్ ను ఎవరు దక్కించుకుంటారో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş