iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం! టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ కన్నుమూత

  • Published Apr 02, 2024 | 4:15 PM Updated Updated Apr 02, 2024 | 4:33 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ మరణాన్ని మర్చిపోక ముందే.. మరో స్టార్ కమెడియన్ ఇక లేరన్న వార్త వినిపిస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ మరణాన్ని మర్చిపోక ముందే.. మరో స్టార్ కమెడియన్ ఇక లేరన్న వార్త వినిపిస్తోంది.

  • Published Apr 02, 2024 | 4:15 PMUpdated Apr 02, 2024 | 4:33 PM
ఇండస్ట్రీలో విషాదం! టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ కన్నుమూత

ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ఈ వారం రోజుల వ్యవధిలోనే పాపులర్ సినీ నటులు మరణించారు. ప్రముఖ హాస్య నటుడు లక్ష్మీ నారాయణన్ శేషు అలియాస్ లొల్లు సభ శేషు మృతి చెందగా.. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు వీర భద్రర రావు గత శుక్రవారం కన్నుమూసిన సంగతి విదితమే. తమిళ నటుడు కమ్ పాపులర్ విలన్ డేనియల్ బాలాజీ చిన్న వయస్సులోనే గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయారు. అంతలో ప్రముఖ డబ్బింగ్ రచయిత శ్రీ రామకృష్ణ మృతి చెందారన్న వార్త వినిపించింది. ఇప్పుడో స్టార్ కమెడియన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ప్రముఖ తెలుగు కమెడియన్ విశ్వేశ్వర రావు మృతి చెందారు.

కాకినాడలో పుట్టిన ఆయన 1966లో పొట్టి ప్లీడర్ అనే చిత్రంలో ఇండస్ట్రీలోకి వచ్చారు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన విశ్వేశ్వర రావు తెలుగు, తమిళంలో సుమారు 150 సినిమాలు చేశారు. యుక్త వయస్సుకు రాగానే సినిమాలు కాస్త గ్యాప్ ఇచ్చి ఎమ్మెస్సీ చదువుకుని ఉద్యోగం కూడా చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చి అనేక సినిమాల్లో అలరించారు. ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు. ఆరేళ్ల ప్రాయం నుండి ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నారు. సుమారు 350కి పైగా చిత్రాల్లో నటించారు. ఆమె కథ, ముఠామేస్త్రీ, బిగ్ బాస్, ప్రెసిడెంట్ గారి పెళ్లాం,  ఆయనకు ఇద్దరు, అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి, మెకానిక్ అల్లుడు,  శివాజీ వంటి చిత్రాలు చేశారు.

అనారోగ్య సమస్యలతో ఏప్రిల్ 2వ తేదీన తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నైలోని సిరుశేరీలోని ఆయన నివాసంలో ఉంచారు. రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బుల్లితెరపై కూడా రాణించిన ఆయన.. విస్సు టాకీష్ అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు. అందులో సినిమాలకు సంబంధించిన విషయాలను, విశేషాలను పంచుకున్నారు. ముగ్గురు సీఎంలో పనిచేసిన నటుడాయన. నందమూరి తారకరామారావు, జయలలిత, ఎంజీఆర్‌లతో పనిచేయడం తనకెంతో గర్వమని చెప్పుకునేవారు ఆయన.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet