iDreamPost
android-app
ios-app

రాజమౌళికి వాళ్ల వల్లే హిట్స్ వస్తున్నాయి.. నిర్మాత సి.కల్యాణ్ వ్యాఖ్యలు!

  • Author singhj Published - 01:34 PM, Fri - 4 August 23
  • Author singhj Published - 01:34 PM, Fri - 4 August 23
రాజమౌళికి వాళ్ల వల్లే హిట్స్ వస్తున్నాయి.. నిర్మాత సి.కల్యాణ్ వ్యాఖ్యలు!

సినిమా ఇండస్ట్రీలో విజయాల శాతం చాలా తక్కువనేది తెలిసిందే. ఆడియెన్స్ పల్స్ పట్టుకోవడం అంత ఈజీ కాదని విశ్లేషకులు చెబుతుంటారు. ఒక మూవీ ఎందుకు హిట్ అవుతుందో, ఎందుకు ఫ్లాప్ అవుతుందో ఎవరూ చెప్పలేం. సక్సెస్​కు ఫలానా ఫార్ములా అనేది లేకపోవడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. ఒక సినిమా హిట్టయితే తిరిగి అదే ఫార్ములాతో అన్ని అంశాలు పర్ఫెక్ట్​గా ఉండేలా మరో మూవీ తీస్తే అది పక్కాగా నడుస్తుందని చెప్పలేం. ఇండస్ట్రీలో సక్సెస్​కు ఫార్ములా అనేది లేదు. కాబట్టే తమను తాము ఆడియెన్స్​గా ఫీలవుతుంటారు దర్శకులు. వాళ్లకు నచ్చిన చిత్రాలు తీస్తారు. అవి ప్రేక్షకులను కూడా మెప్పిస్తాయని భావిస్తారు.

ప్రేక్షకుల అభిరుచులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్లను మూడు గంటల పాటు ఎంగేజ్ చేసే సినిమాలు తీస్తే బాగుంటుందని సినీ పండితులు సూచిస్తున్నారు. అయితే ఆడియెన్స్ పల్స్ తెలిసిన కొందరు దర్శకులు ఉన్నారు. వారి కెరీర్​లో హిట్స్ తప్ప ఫ్లాప్ అనే పదమే వినిపించదు. అలాంటి అరుదైన ఫిల్మ్ మేకర్స్​లో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ‘స్టూడెంట్ నంబర్ వన్’ నుంచి ‘ఆర్ఆర్ఆర్’ వరకు ఆయన ఓటమనేదే ఎరుగరు. సినిమా సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ వరల్డ్ ఇమేజ్​ను ఆయన సొంతం చేసుకున్నారు.

పాన్ వరల్డ్ సినిమాలు తీసే రేంజ్​కు ఎదిగిన రాజమౌళిపై ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటీటీ ట్రెండ్​తో పాటు దర్శకుడు రాజమౌళి గురించి ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం థియేటర్లకు ఓటీటీ ప్లాట్​ఫామ్స్​ గట్టిపోటీని ఇస్తున్నాయిని అన్నారు. ఓటీటీ ట్రెండ్ వల్ల డిస్ట్రిబ్యూటర్లు చాలా సేఫ్ అవుతున్నారని చెప్పారు. ఈమధ్య కాలంలో తెలుగులో వచ్చిన చాలా చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయని, అలాంటి సినిమాలు త్వరగా ఓటీటీల్లోకి రావడంతో డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అయ్యారని కల్యాణ్​ పేర్కొన్నారు. అయితే ఓటీటీలు శాశ్వతం కాదన్నారాయన. ప్యూచర్​లో ఓటీటీలకు ప్రత్యామ్నాయంగా మరో కొత్త టెక్నాలజీ తప్పకుండా వస్తుందని సి.కల్యాణ్​ జోస్యం చెప్పారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో 5 నుంచి 10 శాతం వరకే సక్సెస్ ఉంటుందన్న సి.కల్యాణ్.. ఆడియెన్స్ పల్స్ పట్టుకోవడం దర్శకులకు ఈజీ కాదన్నారు. రాజమౌళికి కూడా అది సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. ఐదేళ్లకు ఒక మూవీ తీస్తే ఎలా ఫ్లాప్ అవుతుందని ప్రశ్నించారు. ఏడాదికి నాలుగైదు సినిమాలు తీస్తే రాజమౌళికి కూడా హిట్, ఫ్లాప్ అంటే ఏంటో తెలుస్తుందన్నారు కల్యాణ్. స్టార్స్​తో మూవీస్ చేస్తున్నారు కాబట్టే రాజమౌళికి హిట్స్ వస్తున్నాయని ఆయన వివరించారు. అదే కొత్తవారితో సినిమా తీసి జనాలను థియేటర్స్​కు రప్పిస్తే దర్శకుల అసలైన ప్రతిభ బయటపడుతుందని కల్యాణ్ వ్యాఖ్యానించారు. మరి.. రాజమౌళిని ఉద్దేశించి సి.కల్యాణ్ చేసిన కామెంట్స్​పై మీరేం అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.