తాజ్ మహాల్ మూవీ హీరోయిన్ గుర్తుందా.. జైలుకెళ్లొచ్చాక ఇప్పుడెలా ఉందంటే..?

శ్రీకాంత్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం తాజ్ మహాల్. 1995లో వచ్చిన ఈ సినిమాలో పంజాబీ గుడియా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. హిందీలో స్టార్ డమ్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత జైలు పాలై వార్తల్లో నిలిచింది. ఆమె ఇప్పుడెలా ఉందంటే.?

శ్రీకాంత్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం తాజ్ మహాల్. 1995లో వచ్చిన ఈ సినిమాలో పంజాబీ గుడియా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. హిందీలో స్టార్ డమ్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత జైలు పాలై వార్తల్లో నిలిచింది. ఆమె ఇప్పుడెలా ఉందంటే.?

విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి.. హీరోగా మారిన నటుడు శ్రీకాంత్. ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం అంటే తాజ్ మహాల్. శ్రీకాంత్ 25వ చిత్రంగా వచ్చిన ఈ మూవీని టాలీవుడ్ స్టార్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ తెరకెక్కించింది. ముప్పలనేని శివ దర్శకుడు. 1995లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అమర్ పాత్రలో శ్రీకాంత్ నటన ఆసమ్. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సోదరి ఎం ఎం శ్రీలేఖ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఇందులో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్. ముఖ్యంగా మంచు కొండల్లోనా సంద్రమా సాంగ్ ఇప్పటికే అదే ప్రెస్ ఫీల్ వస్తుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఒకరు బాలీవుడ్ ముద్దుగుమ్మ, పంజాబీ గుడియా మోనికా బేడీ, మరొకరు సంఘవి. గతంలో ఓ వివాదంలో చిక్కుకున్న మోనిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

పంజాబ్‌లో పుట్టిన మోనికా బేడీ.. ఫ్యామిలీ నార్వేకి షిఫ్ట్ కావడంతో ఆమె ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యను అసభ్యసించింది. ఆ తర్వాత ఇండియాకు వచ్చి యాక్టింగ్ ఫ్యాషన్‌గా ఎంచుకుంది మోనికా. హిందీలో మెయిన్ తేరా ఆషిక్ అనే మూవీ చేసి తెలుగు ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది ఈ బ్యూటీ. తాజ్ మహాల్ మూవీ హిట్ కొట్టడంతో బాలీవుడ్, టాలీవుడ్‌లో అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి. సురక్ష అనే హిందీ మూవీతో సక్సెస్ అందుకున్న ఆమె అక్కడ స్టార్ డమ్ తెచ్చుకుంది. తెలుగులో మోహన్ బాబు సరసన సోగ్గాడి పెళ్లాం చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఆలీ సరసన సర్కస్ సత్తి పండు మూవీలో యాక్ట్ చేసింది. రాజశేఖర్ సరసన శివయ్య, చిరంజీవితో చూడాలని ఉంది మూవీలో రామ్మ చిలకమ్మా, ప్రేమా మొలకమ్మా అంటూ చిందులేసింది.

మరోసారి మోహన్ బాబుతో కలిసి యమజాతకుడులో ఓ ఐటమ్ సాంగ్‌లో మెరిసింది మోనికా. 1999లో రాఘవ లారెన్స్ హీరోగా వచ్చిన స్పీడ్ డ్యాన్సర్‌లో యాక్ట్ చేసింది. ఇదే ఆమె చివరి తెలుగు సినిమా. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ, నేపాలీ, బెంగాలీ, పంజాబీ చిత్రాల్లో నటించింది. అయితే సినిమాలతో పాటు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచింది. గ్యాంగ్ స్టర్ అబూ సలేంతో రిలేషన్ షిప్ కారణంగా ఆమె మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. 2002లో నకిలీ పత్రాలను వినియోగించి దేశంలోకి ప్రవేశించినందుకు అరెస్ట్ అయ్యింది. పోర్చుగల్ జైలులో శిక్ష అనుభవించింది. అలాగే 2006లో ఓ కేసులోనూ దోషిగా తేలింది. జైలు జీవితాన్ని అనుభవించి బయటకు వచ్చిన ఆమె 2008లో హిందీ బిగ్ బాస్‌లోకి ఎంటరయ్యింది. ఆ తర్వాత పలు భాషల్లో నటించింది కానీ అంత గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఆమె ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ టైమ్ పాస్ చేస్తోంది.

Show comments