iDreamPost
android-app
ios-app

తెలుగు సెలబ్రెటీలు బెంగళూరులోనే ఎందుకు రేవ్‌ పార్టీ చేసుకున్నారు? కారణం ఇదే!

  • Published May 21, 2024 | 5:11 PM Updated Updated May 21, 2024 | 5:11 PM

Bangalore, Rave Party: తెలుగు సెలబ్రెటీలు చాలా మంది బెంగళూరు రేవ్‌ పార్టీలో పాల్గొని పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే.. అసలు అక్కడికే వెళ్లి ఎందుకు ఈ రేవ్ పార్టీలు చేసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Bangalore, Rave Party: తెలుగు సెలబ్రెటీలు చాలా మంది బెంగళూరు రేవ్‌ పార్టీలో పాల్గొని పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే.. అసలు అక్కడికే వెళ్లి ఎందుకు ఈ రేవ్ పార్టీలు చేసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 21, 2024 | 5:11 PMUpdated May 21, 2024 | 5:11 PM
తెలుగు సెలబ్రెటీలు బెంగళూరులోనే ఎందుకు రేవ్‌ పార్టీ చేసుకున్నారు? కారణం ఇదే!

‘రేవ్‌ పార్టీ’ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్‌ టాపిక్‌. ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత.. బెంగళూరు రేవ్‌ పార్టీలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రెటీలు పట్టుబడటం సంచలనంగా మారింది. బెంగళూరులోని ఓ బర్త్‌డే పార్టీ సందర్భంగా రేవ్‌ పార్టీ నిర్వహించారనే సమాచారంతో బెంగళూరులో పోలీసులు రైడ్‌ చేసి.. వంద మందికి పైగా సినీ, రాజకీయ ప్రముఖలను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే అధికంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఇప్పటికే నటి హేమా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, తాను అందులో లేని హేమా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. కానీ, ఆమె ఆ రేవ్ పార్టీలో పాల్గొన్నారని పోలీసులు కన్ఫామ్‌ చేశారు.

అలాగే ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ కూడా ఈ రేవ్ పార్టీపై స్పందిస్తూ.. తాను కూడా అందులో పాల్గొన్నట్లు కొంతమంది అనుకుంటున్నారని.. కానీ, వీడియోలో కనిపిస్తోంది తాను కాదని, తాను హైదరాబాద్‌లో ఉన్నట్లు స్పష్టం చేస్తూ ఒక వీడియో రిలీజ్‌ చేశారు. ఇలా హేమా, శ్రీకాంత్‌ లాంటి ప్రముఖుల పేర్లు ఇందులో వినిపించడంతో.. ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే.. హైదరాబాద్‌ లాంటి మహా నగరాన్ని వదిలిపెట్టి.. ఎక్కడో దూరంగా బెంగళూరు శివార్లలో ఈ రేవ్‌ పార్టీలు ఎందుకు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు వాళ్లు ఈ రేవ్‌ పార్టీల కోసం బెంగళూరుకు ఎందుకు వెళ్తున్నారు అనే డౌట్‌ చాలా మందిలో ఉంది. దాని బలమైన కారణం ఉంది.

గతంలో హైదరాబాద్‌లో కూడా రేవ్‌ పార్టీలు జరిగిన ఘటనలు ఉన్నాయి. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. రేవ్‌ పార్టీలు, డ్రగ్స్‌ వాడకం, అమ్మకం, ఇతర చట్టవ్యతిరేక కార్యక్రమాలపై ఉక్కుపాదం మొపింది. రెండు మూడు గట్టి రైడ్స్‌ చేసి.. ఈ రేవ్‌ పార్టీ కల్చర్‌కు అలవాటు పడిన వారికి ఊహించని షాక్‌ ఇచ్చింది. పైగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. డ్రగ్స్‌ మాఫియాను తెలంగాణలో లేకుండా కూకటి వేళ్లతో సహా పీకిపారేస్తామని, డ్రగ్స్‌ దందా చేసినా, వినియోగిస్తున్నట్లు తెలిసినా.. కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడంతో.. హైదరాబాద్‌లో ఆ కల్చర్‌ కాస్త తగ్గుముఖం పట్టినట్లు ఉంది. ఏకంగా సీఎం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో.. ఇక్కడి సెలబ్రెటీలు బెంగళూరుతో పాటు ఇతర నగరాలకు వెళ్లి.. ఈ రేవ్‌ పార్టీల్లో పాల్గొంటున్నారని సమాచారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.