iDreamPost
android-app
ios-app

రేవ్‌ పార్టీ అంటే ఏంటి? సెలబ్రెటీలు పట్టుబడి ముఖం దాచుకునేంత తప్పు ఏం చేస్తారు?

  • Published May 20, 2024 | 6:13 PM Updated Updated May 20, 2024 | 6:13 PM

Rave Party, Hema, Srikanth: బెంగళూరులో ఒక బర్త్‌ డే పార్టీ పేరుతో రేవ్‌ పార్టీ నిర్వహించారనే సమాచారంతో బెంగళూరు పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. అసలు ఈ రేవ్‌ పార్టీ అంటే ఏంటని చాలా తెగసెర్చ్‌ చేస్తున్నారు. రేవ్‌ పార్టీ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Rave Party, Hema, Srikanth: బెంగళూరులో ఒక బర్త్‌ డే పార్టీ పేరుతో రేవ్‌ పార్టీ నిర్వహించారనే సమాచారంతో బెంగళూరు పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. అసలు ఈ రేవ్‌ పార్టీ అంటే ఏంటని చాలా తెగసెర్చ్‌ చేస్తున్నారు. రేవ్‌ పార్టీ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published May 20, 2024 | 6:13 PMUpdated May 20, 2024 | 6:13 PM
రేవ్‌ పార్టీ అంటే ఏంటి? సెలబ్రెటీలు పట్టుబడి ముఖం దాచుకునేంత తప్పు ఏం చేస్తారు?

నగరాల్లో పార్టీ కల్చర్‌ విపరీతంగా పెరిగిపోతుంది. సందర్భం ఏదైనా.. విచ్చలవిడిగా ఎంజాయ్‌ చేసేందుకు చాలా మంది యువత ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ.. కాస్త డబ్బున్న యువత అయితే.. ఈ పార్టీలకు బానిసలు అయిపోతున్నారడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు తాజాగా రేవ్‌ పార్టీ అనే మాట రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. అందుకు కారణం.. బెంగళూరులో నిర్వహించిన ఓ రేవ్‌ పార్టీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు, పలువురు రాజకీయ ప్రముఖులు పట్టుబడటమే. ఇప్పటికే తెలుగు సినిమా నటీనటులు.. హేమా, శ్రీకాంత్‌ ఈ ఘటనపై స్పందించారు కూడా. ఈ పార్టీలో హేమా పాల్గొందని తొలుత సమాచారం రాగా.. కాదంటూ హేమ ప్రకటన చేసింది. కానీ, బెంగళూరు పోలీసులు మాత్రం ఆమె రేవ్‌ పార్టీలో పాల్గొన్నట్లు నిర్ధారించారు.

గతంలో చాలా మంది రేవ్‌ పార్టీలు నిర్వహించి పట్టుబడినా.. సెలబ్రేటీలు ఎందుకు ఈ పార్టీల్లో పాల్గొంటారు? అసలు ఈ రేవ్‌ పార్టీ అంటే ఏంటి? ఇందులో ఏం చేస్తారు? ఎందుకు పోలీసులు పట్టుకుంటారు? లాంటి విషయాలపై నెటిజన్లు తెగ సెర్చ్‌ చేస్తున్నారు. రేవ్‌ పార్టీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ పార్టీ కల్చర్‌ అనేది 1950ల్లో ఇంగ్లండ్‌లో మొదలైంది. ఆ తర్వాత.. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. ఈ పార్టీలో తొలుత మ్యాజిక్‌, డ్యాన్స్‌ను ఎంజాయ్‌ చేసేవారు. నేరుగా సంగీత కళాకారులు ఈ పార్టీల్లో ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ తర్వాత ఈ పార్టీ కల్చర్‌ కొత్త రూపు సంతరించుకుని.. ఒక క్లోజుడ్‌ ప్రదేశంలో, పెద్ద హాల్‌లో చెవులు పగిలిపోయే మ్యాజిక్‌ పెట్టుకుని మంద్యం సేవిస్తూ.. పార్టీ చేసుకునే వారు.

వైల్డ్‌ బిహేవియర్‌తో చేసుకునే పార్టీలకు ‘రేవ్‌’ అని పిలవడం మొదలుపెట్టారు. సాధారంగా మధ్య సేవిస్తూ, డ్యాన్స్‌లు వేస్తూ పార్టీలు చేసుకోవడం వేరు.. ఈ రేవ్‌ పార్టీలు వేరు. ఈ రేవ్‌ పార్టీ అని పదం మొదట లండన్‌లో పుట్టింది. రేవ్‌ పార్టీలో పాల్గొనే వారిని రేవర్స్‌ అని పిలుస్తారు. ప్రముఖ జాజ్ సంగీత విద్వాంసుడు మిక్ ముల్లిగాన్‌ను “కింగ్ ఆఫ్ ది రేవర్స్” అని అంటారు. క్రమక్రమంగా ఈ రేవ్‌ పార్టీ కల్చర్‌.. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వేదికైంది. మద్యంతో పాటు అమ్మాయిల డ్యాన్స్‌ అశ్లీల నృత్యాలు చేయించడమే కాకుండా.. యాంఫేటమిన్, ఎల్‌ఎస్‌డీ, కెటామైన్, మెథాంఫేటమిన్ , కొకైన్ , గంజాయి వంటి మాదకద్రవ్యాలు రహస్యంగా వినిగించడం ప్రారంభం అయింది. ఇలాంటి చట్టవ్యతిరేక రేవ్‌ పార్టీలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందితే.. వెంటనే దాడి చేసి.. పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని, నిర్వహకులను అరెస్ట్‌ చేస్తారు. ఈ పార్టీలతో డ్రగ్స్‌ వాడకం వివరీతంగా పెరగడంతోనే పోలీసులు ఈ రేవ్‌ పార్టీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా కూడా.. కొంతమంది సెలబ్రేటీలు ఈ రేవ్‌ పార్టీ కల్చర్‌ నుంచి బయటపడలేకపోతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.