iDreamPost
android-app
ios-app

రేవ్ పార్టీలో నేను లేను.. ఆ కల్చర్ నాకు అలవాటు లేదు : శ్రీకాంత్

  • Published May 20, 2024 | 4:46 PM Updated Updated May 20, 2024 | 4:46 PM

బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో అలజడి రేగింది. రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అందులో నటి హేమ పేరుతో స్టార్ నటుడు శ్రీకాంత్ పేరు కూడా వినిపించింది

బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో అలజడి రేగింది. రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అందులో నటి హేమ పేరుతో స్టార్ నటుడు శ్రీకాంత్ పేరు కూడా వినిపించింది

  • Published May 20, 2024 | 4:46 PMUpdated May 20, 2024 | 4:46 PM
రేవ్ పార్టీలో నేను లేను.. ఆ కల్చర్ నాకు అలవాటు లేదు : శ్రీకాంత్

బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం ఇటు కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేయడంతో పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇందులో తెలుగు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఉన్నట్లు వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. బర్త్ డే పేరిట హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఫామ్ హౌస్ హైదరబాద్‌కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా గుర్తించారు. ఇక్కడ పెద్ద ఎత్తున డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకుననారు పోలీసులు. ఈ క్రమంలో కొంత మంది తెలుగు సినీ నటుల పేర్లు బయటకు వచ్చాయి.

ఇందులో తెలుగు నటి హేమ పేరు తొలుత బయటకు వచ్చింది. కాగా, ఆమె ఈ వార్తలను ఖండించింది. తాను ఆ పార్టీలో లేనని, హైదరాబాద్ నగరంలోనే ఉన్నానని, తన పేరును ఇందులోకి లాగొద్దని తెలిపింది. ఇదే క్రమంలో కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. ఆ సమయంలో ఓ వ్యక్తిని చాలా మంది టాలీవుడ్ స్టార్ నటుడు శ్రీకాంత్ అని భావించారు. దీంతో శ్రీకాంత్ కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో నటుడు స్పందించారు. రేవ్ పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తాను భాగ్య నగరిలో ఉన్నట్లు పేర్కొన్నారు. తనకు రేవ్ పార్టీలు, పబ్‌లకు వెళ్లే అలవాటు లేదని వెల్లడించారు శ్రీకాంత్. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు.

‘ ఇదేంటీ మొన్నేమో నా భార్య (ఒకప్పటి నటి ఊహా)తో విడాకులు ఇప్పించేశారు. ఇప్పుడేమో రేవ్ పార్టీకి వెళ్లాడు అంటూ వార్తలు వచ్చేశాయి. అతడెవరో నా లాగే ఉన్నాడు. ఇలా టీ షర్టు మొహానికి కప్పుకుని ఉండే సరికి.. నేనే అనుకున్నారు. అతడ్ని చూసి నేను కూడా షాక్ అయ్యాను. అది చూసి అందరు నేనేమో అనుకున్నారు. మీడియా సంస్థలు కూడా తొందరపడ్డాయి. అందులో ఏం తప్పులేదు. నేను రేవ్ పార్టీలకు వెళ్లను.. ఎలా ఉంటాయో తెలియదు. పబ్ కల్చర్, రేవ్ పార్టీ కల్చర్ నాది కాదు. బర్త్ డే పార్టీకి వెళ్లినా కాసేపు ఉండి వచ్చేస్తాను. దయచేసి ఎవ్వరు నమ్మొద్దు. నేను హైదరాబాద్‌లో ఉన్నా. ఇక్కడ నుండే వీడియో చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు శ్రీకాంత్.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet