iDreamPost
android-app
ios-app

బ్యాడ్మింటన్ స్టార్ ని పెళ్లి చేసుకోబోతున్న RGV మేనకోడలు.. ఘనంగా నిశ్చితార్థం

  • Published Aug 11, 2024 | 6:49 PM Updated Updated Aug 11, 2024 | 7:10 PM

Shravya Varma-Srikanth Kidambi Engagement: ఆర్జీవీ మేనకోడలు.. పెళ్లి పీటలు ఎక్కబోతుంది. బ్యాడ్మింటన్ స్టార్ తో ఆమెకి నిశ్చితార్థం జరిగింది. ఆ వివరాలు..

Shravya Varma-Srikanth Kidambi Engagement: ఆర్జీవీ మేనకోడలు.. పెళ్లి పీటలు ఎక్కబోతుంది. బ్యాడ్మింటన్ స్టార్ తో ఆమెకి నిశ్చితార్థం జరిగింది. ఆ వివరాలు..

  • Published Aug 11, 2024 | 6:49 PMUpdated Aug 11, 2024 | 7:10 PM
బ్యాడ్మింటన్ స్టార్ ని పెళ్లి చేసుకోబోతున్న RGV మేనకోడలు.. ఘనంగా నిశ్చితార్థం

టాలీవుడ్ లో వరుస పెళ్లి వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అక్కినేని హీరో నాగ చైతన్య.. శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 8న వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇప్పుడీ జాబితాలో మరో టాలీవుడ్ సెలబ్రిటీ చేరింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. మేనకోడలు శ్రావ్య వర్మ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సందర్భంగా ఆర్జీవీ తన మేనకోడలిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆమె పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. ఇలా ఉండగా తాజాగా శ్రావ్య వర్మ.. బ్యాడ్మింటన్ స్టార్ ని పెళ్లాడబోతుంది. ఇప్పటికే వీరికి నిశ్చితార్థం జరిగింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వివరాలు..

ఆర్జీవీ మేనకోడలు, ప్రముఖ సినీ నిర్మాత, సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రావ్య వర్మ, బ్యాడ్మింటన్ స్లార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ ని వివాహం చేసుకోబోతుంది. తాజాగా వీరి నిశ్చితార్థం వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను శ్రీకాంత్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘శ్రావ్య నాకు ఓకే చెప్పింది. మేమిద్దరం కలిసి ఒక అంతులేని కథను రాసేందుకు రెడీ అవుతున్నాం’ అంటూ తమ పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చాడు శ్రీకాంత్.

RGV

ప్రస్తుతం వీరిద్దరి నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. శ్రావ్య వర్మ విషయానికి వస్తే.. ఆమె ఇప్పటికే పలు తెలుగు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసింది. విజయ్ దేవరకొండ, అక్కినేని నాగార్జున, వైష్ణవ్ తేజ్, విక్రమ్ తదితర స్టార్ హీరోలకు పర్సనల్ స్టైలిస్ట్ గా పని చేసింది. ప్రస్తుతం రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ కూ కూడా తనే కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శ్రావ్య వర్మ నిర్మాతగా.. కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి జంటగా గుడ్ లక్ సఖి అనే సినిమాను నిర్మించింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

ఇక స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీల్లో ఎన్నో పతకాలు గెల్చుకున్నాడు. తన క్రీడా ప్రతిభకు గుర్తింపుగా అర్జున అవార్డు కూడా అందుకున్నాడు. కాగా గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న శ్రీకాంత్, శ్రావ్య నిశ్చితార్థం చేసుకొని తమ బంధం గురించి అధికారికంగా ప్రకటించారు. ఇక త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Srikanth Kidambi (@srikanth_kidambi)