iDreamPost
android-app
ios-app

సుకుమార్ – దిల్ రాజు కాంబోని రిజెక్ట్ చేసిన శ్రీలీల..?

  • Author ajaykrishna Published - 04:29 PM, Mon - 10 July 23
  • Author ajaykrishna Published - 04:29 PM, Mon - 10 July 23
సుకుమార్ – దిల్ రాజు కాంబోని రిజెక్ట్ చేసిన శ్రీలీల..?

ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా సక్సెస్ చూడాలంటే.. అందం ఒకటే ఉంటే సరిపోదు. పెద్దలు చెప్పినట్లు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అది లేకపోతే సక్సెస్ కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూడాల్సి రావచ్చు. లేదా అవకాశాలు వచ్చినా సక్సెస్ రాకపోవచ్చు. కానీ.. యంగ్ బ్యూటీ శ్రీలీల విషయంలో అదృష్టం.. డోర్స్ దగ్గరే కూర్చున్నట్లు అనిపిస్తుంది. తెలుగులో మొదటి సినిమా యావరేజ్.. సెకండ్ మూవీ బ్లాక్ బస్టర్.. ఇంకేముంది ఒకే ఒక్క సక్సెస్ తో అమ్మడి కెరీర్ మారిపోయింది. ఒక్క ఛాన్స్ వస్తే చాలు అనుకునే దగ్గరనుండి.. ఒక్కో సినిమాను రిజెక్ట్ చేసే స్టేజ్ కి వెళ్ళిపోయింది. అంటే.. అర్ధం చేసుకోండి.. శ్రీలీలకు లక్ ఏ రేంజ్ లో వర్కౌట్ అయ్యిందో!

ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్స్ అందరిని పక్కకు నెట్టేసి.. మోస్ట్ వాంటెడ్ గా మారింది ఈ భామ. చేతిలో ఇప్పటికైతే ఎనిమిది సినిమాలు లైనప్ చేసి పెట్టుకుంది. అంటే.. ఇంకో నెక్స్ట్ ఇయర్ వరకు పాపకు డోకా లేదన్నమాట. ఒక్కో సినిమాను కంప్లీట్ చేసుకుంటూ కొత్త సినిమాలు ఓకే చేసుకునే ఛాన్స్ లేకపోలేదు. అయితే.. ఎంత స్టార్డమ్ లో హీరోయిన్స్.. స్టార్ ప్రొడ్యూసర్, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా ఛాన్స్ వస్తే.. అసలు వదులుకోరు. కానీ.. శ్రీలీల అలా చేయకుండా ఏకంగా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అవును.. స్టార్ కాంబో దిల్ రాజు, డైరెక్టర్ సుకుమార్ ప్రొడ్యూసర్స్ గా ఓ సినిమా రూపొందుతోంది.

దిల్ రాజు కజిన్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా చేస్తున్న మూవీ సెల్ఫిష్. ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు కాశీవిశాల్ తెరకెక్కిస్తున్నాడు. సో.. దిల్ రాజుతో పాటు సుకుమార్ కూడా నిర్మాణంలో భాగం అయ్యాడు. కాగా.. ఈ సినిమా కథాచర్చలు జరిగినప్పుడు సుకుమార్.. శ్రీలీల పేరును రిఫర్ చేసాడట. దీంతో దిల్ రాజు టీమ్ వెళ్లి కలిస్తే.. అమ్మడు సున్నితంగా నో చెప్పేసిందట. కారణం ఏంటనేది తెలియదు కానీ.. తర్వాత ఈ ప్రాజెక్ట్ లోకి ‘లవ్ టుడే’ ఫేమ్ ఇవానా ఎంటర్ అయింది. మరి శ్రీలీల ఎందుకు రిజెక్ట్ చేసిందనే వివరాల్లోకి వెళ్తే.. ధమాకా హిట్ తో శ్రీలీల చేతినిండా అవకాశాలు వచ్చి చేరాయి. అందులో ఎనిమిది సినిమాలు ఓకే చేసేసింది. సో.. ఇక సెల్ఫిష్ కి ఓకే చెప్పడం కుదరదని సెల్ఫిష్ గా ఆలోచించకుండా నో అనేసిందని సమాచారం. మరి శ్రీలీల.. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఫ్యూచర్ లో ఏమైనా సినిమాలు చేస్తుందేమో చూడాలి!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet