iDreamPost
android-app
ios-app

రామ్ పక్కనుండగా.. అతనే కావాలంటూ శ్రీలీల ప్రార్థనలు!

  • Author ajaykrishna Published - 02:25 PM, Wed - 27 September 23
  • Author ajaykrishna Published - 02:25 PM, Wed - 27 September 23
రామ్ పక్కనుండగా.. అతనే కావాలంటూ శ్రీలీల ప్రార్థనలు!

ఇండస్ట్రీలో శ్రీలీల హవా నడుస్తోంది. వరుసగా అటు స్టార్స్.. ఇటు యంగ్ స్టర్స్ అందరి సరసన సినిమాలు చేసుకుంటూ మోస్ట్ బిజీ హీరోయిన్ అయిపోయింది. ఓ రకంగా ఇప్పటిదాకా రిలీజ్ చేసింది రెండు సినిమాలే. అయినప్పటికీ.. శ్రీలీలకు చేతినిండా ఊహించని రేంజ్ లో అవకాశాలు వచ్చి వాలాయి. ఇంకేముంది దొరికిన సినిమాలు దొరికినట్లుగా శ్రీలీల అందరు హీరోల సినిమాలకు ఓకే చేసేసి.. దాదాపు పదికి పైగా లైనప్ చేసుకుందట. అయితే.. ప్రస్తుతం శ్రీలీల చేసిన సినిమాలలో ముందుగా రామ్ పోతినేని సరసన నటించిన ‘స్కంద’ రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 28న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ గట్టిగా జరుగుతున్నాయి. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా.. ట్రైలర్, సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. కాగా.. ఈ సినిమా ప్రమోషన్స్ లో రామ్ తో పాటు శ్రీలీల కూడా చురుకుగా పాల్గొంటుంది. రీసెంట్ గా రామ్, శ్రీలీల ఇద్దరూ యాంకర్ సుమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో సుమ సరదాగా కొన్ని రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడిగింది. అలాగే ఒకరి గురించి ఒకరికి కొన్ని ఇంటరెస్టింగ్ పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. ఈ క్రమంలో సుమ.. ఎప్పుడైనా బ్రేకప్ అయ్యిందా? అని అడిగింది. దీనికి రామ్ స్పందించి ఎప్పుడూ చూడలేదని అన్నాడు.

ఆ తర్వాత శ్రీలీల స్పందిస్తూ.. ఇప్పటిదాకా లేదని చెప్పింది. అయితే.. రామ్ జోక్యం చేసుకొని.. శ్రీలీల ప్రస్తుతం రిలేషన్ లో ఉంది. సో.. బ్రేకప్ కానట్లే కదా అన్నాడు. దీంతో వెంటనే స్పందించిన శ్రీలీల.. ‘అయ్యో అదేం లేదు. మంచి బాయ్ ఫ్రెండ్ కోసం దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రామ్ పక్కన ఉండగానే శ్రీలీల వేరే ఎవరి గురించి చెప్పిందని ఆరా తీస్తున్నారు నెటిజన్స్. అయితే.. బాయ్ ఫ్రెండ్ కోసం ప్రే చేస్తున్న అని చెప్పింది కాబట్టి.. ఆమె ప్రెజెంట్ సింగిల్ అని అర్ధమవుతుంది. కాగా.. పక్కన రామ్ ని పెట్టుకొని ఇంకా వేరే ఎవరి గురించో ఎందుకు ప్రార్థించడం అని రామ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి శ్రీలీల మాటల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom