iDreamPost
android-app
ios-app

Ritu Varma: మహారాణి రుక్మిణీ దేవిగా అలరించనున్న రీతూ వర్మ!

  • Published Mar 10, 2024 | 5:25 PM Updated Updated Mar 10, 2024 | 5:25 PM

సెలక్టివ్​గా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు యంగ్ హీరోయిన్ రీతూ వర్మ. ఆమె త్వరలో ఓ డిఫరెంట్ రోల్​లో కనిపించబోతున్నారు. ఏంటా ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

సెలక్టివ్​గా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు యంగ్ హీరోయిన్ రీతూ వర్మ. ఆమె త్వరలో ఓ డిఫరెంట్ రోల్​లో కనిపించబోతున్నారు. ఏంటా ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 10, 2024 | 5:25 PMUpdated Mar 10, 2024 | 5:25 PM
Ritu Varma: మహారాణి రుక్మిణీ దేవిగా అలరించనున్న రీతూ వర్మ!

తెలుగు సినీ పరిశ్రమలో ఈ జనరేషన్ లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న హీరోల్లో ఒకరైన శ్రీవిష్ణు గత ఏడాది ‘సామజవరగమన’తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ను అందుకున్నారు. గత కొంత కాలంగా ఎక్కువగా ఫ్లాప్ లే చవిచూసిన శ్రీవిష్ణుకి ఈ సినిమా సక్సెస్ భారీ ఊపునిచ్చింది. ఈ యంగ్ హీరో ఇప్పటికే తర్వాత చేయబోయే రెండు చిత్రాలను ప్రకటించారు. వాటిలో ఒకటి ‘స్వాగ్’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రీతూ వర్మ ఫస్ట్ లుక్ ను పంచుకున్నారు మేకర్స్.

‘స్వాగ్’ సినిమాలో శ్రీవిష్ణు సరసన రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్నారు. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘రాజులని తలదన్నే మా వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ రీతూ వర్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు చిత్ర నిర్మాతలు. పోస్టర్‌లో రీతూ రాణిగా, మెడలో బంగారు ఆభరణాలతో తెల్లటి దుస్తులు ధరించి సింహాసనంపై కూర్చొని ఉండటం మనం చూడొచ్చు. ‘పెళ్లి చూపులు’ వంటి సినిమాతో చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకున్న రీతూ వర్మ తక్కువ మూవీస్​లో నటించినా.. ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ అయితే మెయింటైన్ చేశారు. కాగా, ‘స్వాగ్’ సినిమాలో ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్నట్లు సినిమాలో తన నటనతో ప్రేక్షకులను అలరిస్తారని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు.

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ‘రాజరాజ చోళ’కు ప్రీక్వెల్‌గా ‘స్వాగ్‌’ రూపొందుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు హసిత్ గోలి. హీరో దొంగతనాలను చూపిస్తూ కామెడీతో పాటు మంచి ఎమోషన్స్ కూడా మిక్స్ చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ ఫిల్మ్​లో శ్రీవిష్ణు సరసన సునైనా, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటించగా.. ప్రీక్వెల్‌గా వస్తున్న ‘స్వాగ్‌’లో రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్నారు. అసలు శ్రీవిష్ణు దొంగ ఎలా అయ్యాడు? ఎలాంటి పరిస్థితుల్లో తన జీవితం మారింది? అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘స్వాగ్‌’ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

రీతూ వర్మ:. ‘స్వాగ్’ వంశ మహారాణి

ఇదీ చదవండి: Mahesh Babu: హాలీవుడ్ రేంజ్ లో ఉన్న మహేష్ బాబు లేటెస్ట్ యాడ్

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap