iDreamPost
android-app
ios-app

సీరియల్‌ నటి గౌరీ రాజ్‌ జీవితంలో అంతులేని విషాదం!

అవి తీయకపోతే తన ప్రాణానికే ప్రమాదం అని తేల్చిచెప్పారన్నారు. తనకు సర్జరీతో పాటు లాపరోస్కోపీ కూడా చేశారని, ఇలా ప్రెగ్నెన్సీ పోవటం రెండో సారని వెల్లడించారు.

అవి తీయకపోతే తన ప్రాణానికే ప్రమాదం అని తేల్చిచెప్పారన్నారు. తనకు సర్జరీతో పాటు లాపరోస్కోపీ కూడా చేశారని, ఇలా ప్రెగ్నెన్సీ పోవటం రెండో సారని వెల్లడించారు.

సీరియల్‌ నటి గౌరీ రాజ్‌ జీవితంలో అంతులేని విషాదం!

సీరియల్‌ నటి గౌరీ రాజ్‌ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రేమ ఎంత మధురం సీరియల్‌తో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారామె. ఈ సీరియల్‌లో నెగిటివ్‌ సేడ్స్‌ ఉన్న పాత్రలో మెప్పించి… అవార్డు సైతం అందుకున్నారు. మల్లి సీరియల్‌తో కూడా మంచి గుర్తింపే వచ్చింది. అయితే, ఏమైందో ఏమో తెలియదు కానీ, సడెన్‌గా ఆమె సీరియల్స్‌కు గుడ్‌బై చెప్పారు. మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. చాలా ఏళ్ల తర్వాత తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తాను సీరియల్స్‌ను వీడటానికి కారణం చెప్పారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో తాను నెల తప్పినట్లు తెలిపారు.

అయినా ఆ విషయం ఆమెకు తెలియలేదని, అప్పుడు సీరియల్‌లో చాలా ఫైట్‌ సీన్లలో నటించానని చెప్పారు. దీని కారణంగా 20-25 రోజులు రక్త స్రావం జరిగిందని అన్నారు. అయినా పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు. కడుపునొప్పి ఉన్నప్పటికీ షూటింగ్‌లో పాల్గొనేదాన్నని అన్నారు. ఓ సారి నొప్పి ఎక్కువవటంతో ఆస్పత్రికి వెళ్లినట్లు తెలిపారు. స్కానింగ్‌లో తాను గర్భంతో ఉన్నట్లు తేలిందని, ఎంతో సంతోషించానని అన్నారు. తర్వాతి రోజు రెడీ అయి షూటింగ్‌కు వెళుతూ ఉంటే.. భర్త ఆపి ఆస్పత్రికి తీసుకెళ్లాడని, అక్కడి డాక్టర్లు నా కడుపులో బిడ్డ బ్లాస్ట్‌ అయి.. శరీరమంతా పడిందని చెప్పారన్నారు.

అవి తీయకపోతే తన ప్రాణానికే ప్రమాదం అని తేల్చిచెప్పారన్నారు. తనకు సర్జరీతో పాటు లాపరోస్కోపీ కూడా చేశారని, ఇలా ప్రెగ్నెన్సీ పోవటం రెండో సారని వెల్లడించారు. చాలా నరకం అనువించానని అన్నారు. మూడో సారి కూడా ప్రెగ్నెన్సీ పోవటంతో డాక్టర్లు రెస్ట్‌ తీసుకోమన్నారని చెప్పారు. అందుకే సీరియళ్లు మానేశానని తెలిపారు. ప్రెగ్నెన్సీలు పోవటం.. ఇంజక్షన్లు, మెడిసిన్స్‌ తీసుకోవటం వల్ల లావైపోయానని అన్నారు. తన ముగ్గురు పిల్లలు దేవుడి దగ్గర ఉన్నారంటూ కంట తడి పెట్టుకున్నారు. మరి, సీరియల్‌ నటి గౌరీ రాజ్‌ జీవితంలోని అంతులేని విషాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.