iDreamPost
android-app
ios-app

Sonali Bendre: ఆ నిర్మాతలు వేధించారు! ఆ చెత్త ట్రెండ్ ఇప్పటికీ ఉంది: సోనాలి బింద్రే!

  • Published May 03, 2024 | 3:41 PM Updated Updated May 03, 2024 | 3:41 PM

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ వస్తూనే ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఒకప్పటి హీరోయిన్స్ వారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎటువంటి అనుభవాలను ఎదుర్కొన్నారు అనేది పంచుకుంటున్నారు.

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ వస్తూనే ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఒకప్పటి హీరోయిన్స్ వారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎటువంటి అనుభవాలను ఎదుర్కొన్నారు అనేది పంచుకుంటున్నారు.

  • Published May 03, 2024 | 3:41 PMUpdated May 03, 2024 | 3:41 PM
Sonali Bendre: ఆ నిర్మాతలు వేధించారు! ఆ చెత్త ట్రెండ్ ఇప్పటికీ ఉంది: సోనాలి బింద్రే!

టాలీవుడ్ లోకి ఇప్పుడిప్పుడు ఎంతో మంది హీరోయిన్స్ వస్తూ ఉన్నారు. కానీ, ఒకప్పుడు చాలా తక్కువమంది ఉండే వారు. వారు తెరపైన ఓ మంచి హీరోయిన్ గా ఎటువంటి పేరు సంపాదించుకున్నారు అనేది అందరికి కనిపిస్తుంది. కానీ, అలాంటి ఛాన్స్ ల కోసం వారు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు అనేది మాత్రం.. వారంతట వారు బయట పెట్టె వరకు ఎవరికీ తెలియదు. ఈ మధ్య కాలంలో అలనాటి తారలంతా కూడా ఇండస్ట్రీలో తాము ఎదుర్కున్న అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ సోనాలి బింద్రే.. ” ది బ్రోకెన్ న్యూస్’ సీజన్ 2″ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా.. ఇండస్ట్రీలో అలనాటి సినిమా పరిస్థితులను గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. అవేంటో చూసేద్దాం.

ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సోనాలి బింద్రే కు మంచి క్రేజ్ ఉంది. సోనాలి బింద్రే అంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది మన్మధుడు సినిమానే. కానీ కొంతకాలం తర్వాత సోనాలి బింద్రే సినిమాలకు దూరం అయిపొయింది. ఇక ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత.. ది బ్రోకెన్ న్యూస్’ సీజన్ 2 వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తానూ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎటువంటి పరిస్థితులు ఉండేవో చెప్పుకొచ్చింది సోనాలి. ఇండస్ట్రీలో నిర్మాతల గురించి చెబుతూ.. “1994లో నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అప్పడు పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. నిర్మాతలు కూడా అలానే ఉండేవారు. నా తోటి నటులకి నాకు మధ్య నిర్మాతలే రూమర్స్ సృష్టించేవారు. నిజానికి అక్కడ ఏమి లేకపోయినా సరే ఆ సినిమా ప్రమోషన్ అవుతుందనే ఉద్దేశంతో అలా చేసేవాళ్ళు. ఇప్పటికీ ఈ చెత్త ట్రెండ్‌ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. రూమర్స్‌ను మీడియాకి వీళ్లే లీక్ చేసేవాళ్లు. ఇది తెలిసి నేను షాక్ అయ్యా..

అంతే కాకుండా నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను చాలా సన్నగా ఉండేదాన్ని. దీంతో నిర్మాతలు నాపై జోకులు వేసేవారు. నేను కూడా అందరిలా కాస్త బొద్దుగా అవ్వాలంటూ నాకు క్లాసులు పీకేవారు. కానీ వాటిని నేనేం పట్టించుకోలేదు. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి రావాలని అనుకోలేదు. అందుకే ఎప్పుడూ నటనలో, డ్యాన్స్‌లో ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. అన్నీ ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నాను. కానీ ఫ్యాన్స్ నన్ను స్టార్ హీరోయిన్‌ను చేస్తారని ఏనాడూ అనుకోలేదు.” అంటూ సోనాలి చెప్పుకొచ్చింది. నిజానికి తెరపైన ఏం జరుగుతుందో అందరూ చూస్తారు. కానీ, తెర వెనుక ఎలాంటి సంఘటనలు జరుగుతాయో మాత్రం ఎవరికీ తెలియదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom