Krishna Kowshik
ఆమె ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. హైదరాబాద్ పప్పుల గూడలో నివాసం ఉంటూ ఐటీ కారిడార్‌లోని ఓ కంపెనీలో వర్క్ చేస్తుంది. ఆమెకు సినిమాల్లో నటించాలని కల. దీన్నే అవకాశంగా తీసుకున్న అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు..
ఆమె ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. హైదరాబాద్ పప్పుల గూడలో నివాసం ఉంటూ ఐటీ కారిడార్‌లోని ఓ కంపెనీలో వర్క్ చేస్తుంది. ఆమెకు సినిమాల్లో నటించాలని కల. దీన్నే అవకాశంగా తీసుకున్న అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు..
Krishna Kowshik
సినిమా అంటే పిచ్చి, ఫ్యాషన్‌తో ఎంతో మంది ఇండస్ట్రీలోకి వస్తుంటారు. హీరో, హీరోయిన్ అవుదామని ప్రయత్నాలు చేస్తుంటారు. అలా నటీనటులుగా తెరపై తమను చూసుకోవాలని వస్తున్న వాళ్లను టార్గెట్ చేస్తున్నారు కొందరు. ముఖ్యంగా అమ్మాయిల్ని. ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు కాంప్రమైజ్‌లు అడుగుతుంటారు కొంత మంది దర్శక నిర్మాతలు. మరికొంత మంది నేరుగానే అడుగుతుంటారు. అలాగే ఛాన్సులు ఇప్పిస్తామని నమ్మిస్తూ.. మరికొంత మందిని లొంగదీసుకుంటున్నారు. తాజాగా ఓ అసిస్టెంట్ డైరెక్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. సినిమాల్లో అవకాశాలిస్తానని చెప్పి ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌పై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు సిద్దార్థ్ వర్మ అనే అసిస్టెంట్ డైరెక్టర్. తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అనంతపురానికి చెందిన ఓ యువతి.. హైదరాబాద్ పప్పుల గూడలో నివాసం ఉంటూ ఐటీ కారిడార్‌లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఆమెకు సినినమాల్లో నటించాలన్న ఆశ ఉండేది. వైజాగ్‌కు చెందిన సిద్ధార్థ్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూ కొండాపూర్ రాఘవేంద్ర కాలనీల నివాసం ఉంటున్నాడు. అయితే తెలిసిన యువతి ద్వారా సాఫ్ట్ వేర్ యువతి పరిచయం చేసుకున్నాడు సిద్దార్థ్. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ నంబర్ తీసుకుని ఆమెను ట్రాప్ చేశాడు. వీరి మధ్య పరిచయం పెరగడంతో ఆమెను తన ఇంటికి డిన్నర్‌కు ఇన్వైట్ చేశాడు ఈ అసిస్టెంట్ డైరెక్టర్.
సినిమాల గురించి డిస్కస్ చేద్దామని చెప్పేసరికి సిద్ధార్థ్ ఉంటున్న ఇంటికి వెళ్లింది సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఈ క్రమంలో కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి.. స్పృహ తప్పిపోయిన తర్వాత యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమెను ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఛాన్సులిప్పిస్తానని చెప్పి శారీరకంగా, మానసికంగా తనను వినియోగించుకున్నాడని, తాను మోసపోయానని గుర్తించి సదరు యువతి.. గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అసిస్టెంట్ డైరెక్టర్ సిద్ధార్థ్ వర్మను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉంటే అతడు పలు సినిమాలకు వర్క్ చేసినట్లు తెలుస్తుంది.