iDreamPost
android-app
ios-app

‘స్కంద’ బిజినెస్.. రీచ్ అవ్వాలంటే రామ్ ఆ లిస్ట్ లో చేరాల్సిందేనా?

  • Author ajaykrishna Updated - 08:34 AM, Mon - 25 September 23
  • Author ajaykrishna Updated - 08:34 AM, Mon - 25 September 23
‘స్కంద’ బిజినెస్.. రీచ్ అవ్వాలంటే రామ్ ఆ లిస్ట్ లో చేరాల్సిందేనా?

టాలీవుడ్ ఉస్తాద్ రామ్ పోతినేని.. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ షేర్ టార్గెట్ ని ఫేస్ చేయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది. దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన మూవీ స్కంద. మాస్ యాక్షన్ జానర్ లో రూపొందిన ఈ సినిమాలో రామ్ సరసన ట్రెండింగ్ హీరోయిన్ శ్రీలీల నటించింది. ఇక సినిమాని బిగ్ బడ్జెట్ తో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు. కాగా.. రామ్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ జరుపుకుంటోంది స్కంద. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి తీసిన మూవీ కావడం.. అందులోనూ రామ్ ని ఊరమాస్ అవతారంలో ప్రెజెంట్ చేసి.. ట్రైలర్ తో అంచనాలు సెట్ చేశారు.

స్కంద ట్రైలర్ పరంగా మిక్సడ్ టాక్ అందుకున్నట్లు సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. బోయ స్టైల్ రెగ్యులర్ ఎలిమెంట్స్.. హీరోయిజం ఎలివేషన్స్ రిపీట్ అయ్యాయి తప్ప కొత్తగా అనిపించలేదు అనే కామెంట్స్ వినిపించాయి. మరోవైపు సెప్టెంబర్ 15న రావాల్సిన సినిమా.. సెప్టెంబర్ 28కి వాయిదా వేశారు. రిలీజ్ కి వారం ముందు వరకు సాంగ్స్ రిలీజ్ తప్ప ప్రమోషన్స్ చేయలేదు. ఇదంతా చూసి.. స్కంద పై ఎన్నో అనుమానాలు రేకేత్తాయి. కానీ.. ఒక్క ప్రీ రిలీజ్ బిజినెస్ తో సినిమాపై ఎంత హైప్ ఉందో.. క్లారిటీ ఇచ్చేశారు. తాజా సమాచారం ప్రకారం.. స్కంద ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలు కలిపి రూ. 50 కోట్ల షేర్ టార్గెట్ బిజినెస్ జరుపుకున్నట్లు తెలుస్తుంది.

రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ టార్గెట్ ఇదే అని చెప్పాలి. ఇప్పటిదాకా ఏ సినిమా కూడా రామ్ కెరీర్ లో ఇంత టార్గెట్ సెట్ కాలేదు. సో.. రూ. 50 కోట్ల షేర్ అంటే రామ్ కి పెద్ద పరీక్షనే అని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. స్కంద రూ. 50 కోట్ల మార్క్ అందుకోవాలంటే రామ్ ఆ క్లబ్ లో చేరాల్సిందేనని టాక్ నడుస్తుంది. ఇంతకీ ఏ లిస్ట్ అని అనుకుంటున్నారా..? రూ. 100 కోట్ల క్లబ్ లో చేరాలట. ఇండస్ట్రీలో మినిమమ్ రూ. వంద కోట్లు గ్రాస్ వసూల్ చేస్తేనే.. యాభై కోట్ల షేర్ టార్గెట్ ఈజీ అవుతుందని అంటున్నారు. ఆల్రెడీ టాలీవుడ్ లో రూ. 100 కోట్ల క్లబ్ లో నాని, విజయ్ దేవరకొండ, నిఖిల్ లాంటి హీరోలు చేరిపోయారు. సో.. రామ్ కూడా ఆ టార్గెట్ కి రీచ్ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి స్కంద గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş