iDreamPost
android-app
ios-app

హైప్ అంతా సెకండ్ ట్రైలర్ పైనే డిపెండ్ అయ్యిందా..?

  • Author ajaykrishna Published - 12:41 PM, Wed - 20 September 23
  • Author ajaykrishna Published - 12:41 PM, Wed - 20 September 23
హైప్ అంతా సెకండ్ ట్రైలర్ పైనే డిపెండ్ అయ్యిందా..?

పాన్ ఇండియా రిలీజ్ అనుకున్న సినిమాలకు హైప్ ఏ రేంజ్ లో ఉండాలో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం హీరో రామ్ పోతినేని, దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా సాంగ్స్, ఫస్ట్ ట్రైలర్ వచ్చేసాయి. బోయపాటి సినిమా కదా.. ఆయన రెగ్యులర్ మార్క్ తప్పించి ట్రైలర్ లో కొత్తదనం ఏది కనిపించలేదని ఫ్యాన్స్ అంటున్నారు. సరే కొన్నిసార్లు ట్రైలర్ చూసి సినిమాని అంచనా వేయలేము అనే యాంగిల్ లో కూడా ఆలోచిస్తున్నారు అభిమానులు.

స్కంద.. టైటిల్ ఇంటరెస్టింగ్ గా ఉన్నప్పటికీ, బోయపాటి మార్క్ మాస్ రామ్ కి ఎంతవరకు సెట్ అయింది? అనేది సినిమా రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే.. బోయ మాస్ అనేది ఇప్పటిదాకా బాలయ్యకు సూట్ అయినట్లు ఎవరికి సెట్ అవ్వలేదు. మిగతా హీరోలలో అల్లు అర్జున్ సరైనోడు కొంచం వర్కౌట్ అయ్యింది. వీరిద్దరూ మినహాయించి ఈ మధ్యకాలంలో ఏ హీరోకి కూడా బోయ ట్రీట్మెంట్ అంత సంతృప్తికరంగా లేదనే టాక్ నడుస్తుంది. ఆల్రెడీ రిలీజైన ఫస్ట్ ట్రైలర్ చూస్తే.. అవే బోయ మార్క్ డైలాగ్స్, ఎలివేషన్స్, బిగ్ ఫ్యామిలీ.. అందులో ఇద్దరు మాట్లాడితే మిగతా వారు నిలబడి చూడటం.. మాస్ ఫైట్స్.. స్కందలో కూడా అవే రిపీట్ చేశాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కాగా.. స్కందలో హీరో మారాడు గానీ.. రెగ్యులర్ బోయ మార్క్ బోరింగ్ గా ఉందని అంటున్నారు. రిలీజ్ కి ఇంకా వారం రోజులే ఉంది. ఈ క్రమంలో సినిమాకు కావాల్సిన బజ్ అయితే క్రియేట్ అవ్వలేదని స్పష్టంగా కనిపిస్తుంది. పైగా శ్రీలీల గ్లామర్ ఒకటి పక్కన పెడితే.. తమన్ అందించిన సాంగ్స్ జనాలకు పెద్దగా ఎక్కలేదని అంటున్నారు. మరి ఆల్రెడీ ఓసారి వాయిదా పడిన స్కందకు.. పోటీగా చంద్రముఖి 2, ఆ తర్వాత రోజు పెదకాపు రిలీజ్ అవుతున్నాయి. సో.. సినిమా పాన్ ఇండియా రిలీజ్ అనుకుంటే ఖచ్చితంగా సౌండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి.. మేకర్స్ కొత్త ట్రైలర్ కట్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలలో కథనాలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన స్కంద బజ్ అంతా సెకండ్ ట్రైలర్ పైనే డిపెండ్ అయ్యుందేమో అని ఆడియన్స్ భావిస్తున్నారు. మరి స్కంద గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet