iDreamPost
android-app
ios-app

ఈ ఒక్క విషయంలో ఆదిపురుష్ ని ఫాలో అయ్యారా..?

  • Author ajaykrishna Published - 01:09 PM, Tue - 26 September 23
  • Author ajaykrishna Published - 01:09 PM, Tue - 26 September 23
ఈ ఒక్క విషయంలో ఆదిపురుష్ ని ఫాలో అయ్యారా..?

ఇండస్ట్రీలో అప్పుడప్పుడు రిలీజ్ విషయంలో.. లేదా ప్రమోషన్స్ విషయంలో ఒక సినిమా తెలియకుండానే ఇంకో సినిమా స్ట్రాటజీని ఫాలో అవుతున్న సందర్భాలు కనిపిస్తుంటాయి. అది వాళ్ళు తెలియకుండా చేసినా.. ఖచ్చితంగా ఇదివరకు ఏ సినిమా ఆ స్ట్రాటజీ ఫాలో అయ్యిందో కనిపెడుతుంటారు ఆడియన్స్. ప్రస్తుతం రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన ‘స్కంద’ సినిమా ప్రమోషన్స్ విషయంలో అలాంటి టాకే వినిపిస్తుంది. ఏంటంటే.. స్కంద మూవీ మేకర్స్.. ఇప్పటికి సినిమా నుండి రెండు ట్రైలర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ట్రైలర్స్ విషయంలో మేకర్స్ ‘ఆదిపురుష్’నే ఫాలో అయ్యారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అదేంటి.. స్కంద ట్రైలర్స్ కి, ఆదిపురుష్ కి లింక్ ఏంటని మీకు సందేహం రావచ్చు. ఆ వివరాల్లోకి వెళ్తే.. స్కంద మూవీ నుండి కొద్దిరోజుల క్రితం మొదటి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ లో మొత్తం యాక్షన్ సీన్స్.. బోయపాటి మార్క్ రెగ్యులర్ ఎలిమెంట్స్, ఆ టైప్ ఆఫ్ ఫ్యామిలీ డైలాగ్స్ పెట్టి.. నార్మల్ అనిపించారు. బోయపాటి సినిమాలలో ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి. కానీ.. ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా.. మాట్లాడేది ఇద్దరు, చూస్తూ ఉండిపోయేది మిగతా అందరు. పైగా కొత్తగా వావ్ అనిపించే మూమెంట్స్ కంటే.. బోయపాటి మాస్ లో హీరో ఒక్కడే మారాడు. కానీ.. యాక్షన్, ఎమోషన్స్ ఏం మారలేదంటూ కామెంట్స్ వినిపించాయి.

కట్ చేస్తే.. ఇప్పుడు స్కంద సెకండ్ ట్రైలర్ వచ్చేసింది. ఆ ట్రైలర్ ఫస్ట్ ట్రైలర్ కంటే చాలా డిఫరెంట్ గా.. ఫ్రెష్ గా.. ఊరమాస్ రేంజ్ లో కట్ చేసి సర్ప్రైజ్ చేశారు. సెకండ్ ట్రైలర్ జనాలకు, ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది. ట్రైలర్ లో స్టఫ్ చూశాక అంచనాలు కూడా పెరిగిపోయాయి. దీంతో ఈ ట్రైలర్ ఏదో ముందే రిలీజ్ చేసి ఉండొచ్చు కదా అని అంటున్నారు. ఎందుకంటే.. గతంలో ఆదిపురుష్ మేకర్స్ కూడా ఇలాగే చేశారు. ఆదిపురుష్ ఫస్ట్ ట్రైలర్ నార్మల్ అనిపించుకొని.. విమర్శలు ఫేస్ చేసింది. కానీ.. సెకండ్ ట్రైలర్ చూశాక సినిమాపై అభిప్రాయాలు మారిపోయాయి. ఒక్కసారిగా ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ తో ఫస్ట్ డే ఓపెనింగ్స్ హైయెస్ట్ వచ్చాయి. అలా.. ఇప్పుడు స్కంద కూడా ఫస్ట్ ట్రైలర్ తో నార్మల్ అనిపించుకొని.. సెకండ్ ట్రైలర్ తో ఇంప్రెస్స్ చేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. మరి స్కంద గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss