iDreamPost
android-app
ios-app

స్కంద.. శ్రీలీల స్పీడ్ కి బ్రేకులు వేసిందా..?

  • Author ajaykrishna Updated - 11:40 AM, Wed - 4 October 23
  • Author ajaykrishna Updated - 11:40 AM, Wed - 4 October 23
స్కంద.. శ్రీలీల స్పీడ్ కి బ్రేకులు వేసిందా..?

ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ కి వరుసగా సూపర్ హిట్స్ రావడం అనేది చాలా రేర్ గా జరుగుతుంటుంది. ఆ ఊపులో చేతినిండా ఊహించని సినిమాలు వచ్చి పడతాయి. ఒక్కోసారి చేతిలో సినిమాలు ఉండటంతో చాలా ఆఫర్స్ వదులుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం యంగ్ బ్యూటీ శ్రీలీల అలాంటి ఫామ్ లో ఉంది. టాలీవుడ్ లో రెండు సినిమాలకే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన ఈ భామ.. పెళ్లి సందడి, ధమాకా సినిమాలతో మంచి విజయాలు సొంతం చేసుకుంది. దీంతో అమ్మడికి ఊహించని రేంజ్ లో బిగ్ ప్రాజెక్ట్స్ ఆఫర్స్ లభించాయి. దాదాపు వీలైనంత వరకు అన్ని ఓకే చేసుకుంది.

ఇక రీసెంట్ శ్రీలీల నుండి మూడో సినిమాగా స్కంద రిలీజ్ అయ్యింది. ఉస్తాద్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమాని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించారు. ఇటీవల భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన స్కంద.. బాక్సాఫీస్ వద్ద మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ లో బిగ్ నెంబర్స్ నమోదు చేసిన ఈ సినిమా.. రాను రాను కలెక్షన్స్ తగ్గుముఖం పట్టేసాయి. దీంతో సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని ఫినిష్ చేయడం కష్టమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. స్కంద బ్రేక్ టార్గెట్ రూ. 46 కోట్ల వరకు జరిగింది. ఇప్పటిదాకా రూ. 26 కోట్లు మాత్రమే వసూల్ చేసిందట. సో.. ఇంకా దాదాపు రూ. 20 కోట్ల దాక వసూల్ చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే.. స్కంద బ్రేక్ ఈవెన్ కష్టమని అనిపిస్తుంది. ఎందుకంటే.. ఇప్పుడు వచ్చే శుక్రవారం ఏకంగా ఆరు సినిమాల వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. పైగా కొత్త సినిమాలు వస్తున్నాయంటే.. ఆల్రెడీ మిక్సడ్ టాక్ తెచ్చుకున్న సినిమాలను జనాలు పెద్దగా పట్టించుకోరని తెలిసిందే. దీంతో స్కంద ఒకవేళ కమర్షియల్ గా ఫెయిల్యూర్ అయితే.. ఆ ఎఫెక్ట్ హీరోహీరోయిన్స్ ఇద్దరిపై పడుతుంది. కానీ.. ప్రెజెంట్ సూపర్ ఫామ్ లో ఉన్న శ్రీలీలపై ఇంకాస్త ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సో.. ఈ లెక్కన స్కంద మూవీ.. శ్రీలీలకు హ్యాట్రిక్ హిట్ ని మిస్ చేసినట్లే అవుతుంది. అలా శ్రీలీల స్పీడ్ కి బ్రేక్ వేయనుంది అని ఇండస్ట్రీ టాక్. మరి స్కంద గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio